
సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘బ్యూటీఫుల్’. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘రొమాంటిక్ కథాంశంతో వైవిధ్యభరితంగా ఉంటుందీ చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. త్వరలో ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సిరాశ్రీ పాటలు రాశారు. రవిశంకర్ సంగీతం అందించారు.
∙నైనా, సూరి
Comments
Please login to add a commentAdd a comment