అందమైన ప్రేమకథ | Beautiful Trailer release | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమకథ

Published Thu, Nov 14 2019 1:15 AM | Last Updated on Thu, Nov 14 2019 1:15 AM

Beautiful Trailer release - Sakshi

సూరి, నైనా

సూరి, నైనా జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్‌’. ‘ట్రిబ్యూట్‌ టు రంగీలా’ అనేది ట్యాగ్‌లైన్‌. రాంగోపాల్‌ వర్మకు చెందిన టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ‘లక్ష్మీస్‌ యన్టీఆర్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకత్వంతో పాటు రచన, ఫొటోగ్రఫీ బాధ్యతలు కూడా చేపట్టారు.  టి. నరేశ్‌ కుమార్, టి.శ్రీధర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని  డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నారు. ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కి విశేష  స్పందన లభించింది. రొమాంటిక్‌ ప్రేమ కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాటలు మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్‌.
 ∙సూరి, నైనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement