ఏక పాత్రతో ‘నయన’ | 'Naina' movie released on september 6th | Sakshi
Sakshi News home page

ఏక పాత్రతో ‘నయన’

Published Sun, Sep 1 2013 12:00 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ఏక పాత్రతో ‘నయన’ - Sakshi

ఏక పాత్రతో ‘నయన’

‘‘ఏక పాత్రతో మధు చేసిన ఈ వినూత్న ప్రయోగం ఫలించాలని కోరుకుంటున్నాను. మధుకి పరిశ్రమ పట్ల మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనతో మంచి సినిమా తీసి ఉంటారని నమ్ముతున్నాను’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. నటాషా టైటిల్ రోల్‌లో చండ్ర మూవీస్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో చండ్ర మధు నిర్మించిన చిత్రం ‘నయన’.
 
కార్తీక్ రోడ్రిజ్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీని ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి ఆవిష్కరించి, కొమర వెంకటేష్‌కి ఇచ్చారు. ‘‘కథ మీద పట్టు లేకపోతే ఇలాంటి సినిమా చేయలేరు. పాటలు బాగున్నాయి’’ అని ట్రైలర్స్‌ను ఆవిష్కరించిన అనంతరం అచ్చిరెడ్డి చెప్పారు.  మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న చిత్రం ఇదని కార్తీక్ అన్నారు. 
 
చండ్ర మధు మాట్లాడుతూ -‘‘తొలి ప్రయత్నంగా ఓ అవార్డ్ మూవీ చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా చేశాను. రిథమ్ స్టూడియోవారు అందించిన సహకారం మరువలేనిది. కార్తీక్ మంచి పాటలతో పాటు చక్కని నేపథ్య సంగీతం కూడా ఇచ్చారు. ఈ నెల 6న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement