రక్షకభటుడు... దెయ్యానికి! | rakshaka bhatudu movie shooting completed with tomorrow | Sakshi
Sakshi News home page

రక్షకభటుడు... దెయ్యానికి!

Published Wed, Mar 8 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

రక్షకభటుడు...  దెయ్యానికి!

రక్షకభటుడు... దెయ్యానికి!

దేవుణ్ణి చూస్తే దెయ్యాలకు వణుకు. భయంతో పరుగులు పెడతాయి. అందువల్ల, ఎవరికైనా దెయ్యం పడితే రక్షించమంటూ భక్తులు దేవుణ్ణి శరణు కోరతారు. దేవుడు వాళ్లను రక్షిస్తాడు. పురాణాల నుంచి మన తెలుగు సినిమాల వరకూ వింటున్న కథలు ఈ కోవలోనే ఉంటాయి. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌... దేవుడు ఓ దెయ్యాన్ని రక్షిస్తే? ఎలా ఉంటుందో వెండితెరపై చూడమంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల.

 రిచా పనయ్,  ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌ పతాకంపై ఎ. గురురాజ్‌ నిర్మిస్తున్న సినిమా ‘రక్షకభటుడు’. రేపటితో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో కథే హీరో. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

 ‘‘సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంది. 90 శాతం సినిమా అరకు లోయలోని పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో నడుస్తుంది. సెకండాఫ్‌లో బ్రహ్మానందంగారు కీలక పాత్ర చేశారు. త్వరలో టీజర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. హీరోయిన్‌ రిచా పనయ్, సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర, కళా దర్శకుడు రాజీవ్‌ నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement