Akella Vamsi Krishna
-
ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ
‘‘రక్ష, జక్కన్న’ చిత్రాల స్థాయిలో ‘రక్షకభటుడు’ ఉంటుంది. చిన్న సినిమా చేసిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్‌కి వెళ్దామనుకున్న నాకు ‘రక్షకభటుడు’ పెద్ద చిత్రంగా నిలిచింది’’ అని వంశీకృష్ణ ఆకెళ్ళ అన్నారు. రిచా పనయ్, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మించిన ‘రక్షకభటుడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వంశీకృష్ణ ఆకెళ్ళ చిత్రవిశేషాలు పంచుకున్నారు. ⇔ అరకు సమీపంలోని ఓ హిల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవు. ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రారు. కానీ, ఆ స్టేషన్లో నైట్‌డ్యూటీ చేయాలంటే పోలీసులకు భయం. అది ఎందుకన్నది సస్పెన్స్. ఓ అమ్మాయికి వచ్చిన ఒక సోషల్ సమస్యను పోలీస్ స్టేషన్లో ఎలా పరిష్కరించారన్నదే ఈ సినిమా. ⇔ ఈ చిత్రంలో నటుడు ధన్‌రాజ్ ‘ప్రపంచానికి ఫస్ట్ పోలీస్ నువ్వే కదా స్వామి’ అంటాడు. ఆంజనేయస్వామి నిజంగానే ప్రొటెక్టర్. ప్రస్తుతం సొసైటీలో ప్రొటెక్టింగ్ ఫోర్స్ అంటే పోలీస్. ఆ పోలీస్ రూపంలో మనల్ని రక్షించే దేవుడు అనే పాయింట్ ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ చిత్రం కథ. ఇందులో పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఆంజనేయ స్వామి ఎవరు? అన్నది రివీల్ చేయకపోవడంతో బిజినెస్ బాగా జరిగింది. ⇔ రిచా పనయ్ ఇప్పటికి నాలుగు సినిమాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ‘రక్షకభటుడు’ తో ఆ లోటు తీరుతుంది. బ్రహ్మానందంగారు హారర్ సినిమాల దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ⇔ రెండు, మూడు స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఓ పెద్ద స్టార్‌తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా. అది కాకుండా మరో చిన్న సినిమా కూడా పరిశీలనలో ఉంది. -
రక్షకభటుడు... దెయ్యానికి!
దేవుణ్ణి చూస్తే దెయ్యాలకు వణుకు. భయంతో పరుగులు పెడతాయి. అందువల్ల, ఎవరికైనా దెయ్యం పడితే రక్షించమంటూ భక్తులు దేవుణ్ణి శరణు కోరతారు. దేవుడు వాళ్లను రక్షిస్తాడు. పురాణాల నుంచి మన తెలుగు సినిమాల వరకూ వింటున్న కథలు ఈ కోవలోనే ఉంటాయి. బట్ ఫర్ ఏ ఛేంజ్... దేవుడు ఓ దెయ్యాన్ని రక్షిస్తే? ఎలా ఉంటుందో వెండితెరపై చూడమంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ నిర్మిస్తున్న సినిమా ‘రక్షకభటుడు’. రేపటితో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో కథే హీరో. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంది. 90 శాతం సినిమా అరకు లోయలోని పోలీస్ స్టేషన్ నేపథ్యంలో నడుస్తుంది. సెకండాఫ్‌లో బ్రహ్మానందంగారు కీలక పాత్ర చేశారు. త్వరలో టీజర్ విడుదల చేస్తాం’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. హీరోయిన్ రిచా పనయ్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, కళా దర్శకుడు రాజీవ్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.