ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ
‘‘రక్ష, జక్కన్న’ చిత్రాల స్థాయిలో ‘రక్షకభటుడు’ ఉంటుంది. చిన్న సినిమా చేసిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్‌కి వెళ్దామనుకున్న నాకు ‘రక్షకభటుడు’ పెద్ద చిత్రంగా నిలిచింది’’ అని వంశీకృష్ణ ఆకెళ్ళ అన్నారు. రిచా పనయ్, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మించిన ‘రక్షకభటుడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వంశీకృష్ణ ఆకెళ్ళ చిత్రవిశేషాలు పంచుకున్నారు.
⇔ అరకు సమీపంలోని ఓ హిల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉండవు. ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రారు. కానీ, ఆ స్టేషన్‌లో నైట్‌డ్యూటీ చేయాలంటే పోలీసులకు భయం. అది ఎందుకన్నది సస్పెన్స్. ఓ అమ్మాయికి వచ్చిన ఒక సోషల్ సమస్యను పోలీస్ స్టేషన్‌లో ఎలా పరిష్కరించారన్నదే ఈ సినిమా.
⇔ ఈ చిత్రంలో నటుడు ధన్‌రాజ్ ‘ప్రపంచానికి ఫస్ట్ పోలీస్ నువ్వే కదా స్వామి’ అంటాడు. ఆంజనేయస్వామి నిజంగానే ప్రొటెక్టర్. ప్రస్తుతం సొసైటీలో ప్రొటెక్టింగ్ ఫోర్స్ అంటే పోలీస్. ఆ పోలీస్ రూపంలో మనల్ని రక్షించే దేవుడు అనే పాయింట్ ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ చిత్రం కథ. ఇందులో పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఆంజనేయ స్వామి ఎవరు? అన్నది రివీల్ చేయకపోవడంతో బిజినెస్ బాగా జరిగింది.
⇔ రిచా పనయ్ ఇప్పటికి నాలుగు సినిమాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ‘రక్షకభటుడు’ తో ఆ లోటు తీరుతుంది. బ్రహ్మానందంగారు హారర్ సినిమాల దర్శకుడి పాత్రలో కనిపిస్తారు.
⇔ రెండు, మూడు స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఓ పెద్ద స్టార్‌తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా. అది కాకుండా మరో చిన్న సినిమా కూడా పరిశీలనలో ఉంది.