ఆంజనేయస్వామి ఎవరో తెలుసుకోవాలనుంది! | Rakshaka Bhatudu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఆంజనేయస్వామి ఎవరో తెలుసుకోవాలనుంది!

Published Wed, Apr 26 2017 12:03 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

ఆంజనేయస్వామి ఎవరో తెలుసుకోవాలనుంది! - Sakshi

ఆంజనేయస్వామి ఎవరో తెలుసుకోవాలనుంది!

– దర్శకుడు మారుతి
‘‘రక్షక భటుడు’ చిత్రంలో పోలీస్‌ గెటప్‌లో ఉన్న ఆంజనేయస్వామి మోషన్‌ పోస్టర్‌ చూస్తే ఆ నటుడు ఎవరా? అని అందరిలో ఓ కుతూహలం పెరిగింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి నాలోనూ కలిగింది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. రిచా పనయ్, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్‌ ముఖ్య పాత్రల్లో ‘రక్ష, జక్కన్న’ చిత్రాల ఫేమ్‌ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఎ. గురురాజ్‌ నిర్మించిన చిత్రం ‘రక్షక భటుడు’. శేఖర్‌ చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు.

ఎ. గురురాజ్‌ మాట్లాడుతూ– ‘‘జక్కన్న’ సినిమాలో నేను ఓ పాత్ర చేశా. ఆ టైమ్‌లో వంశీకృష్ణగారు వినిపించిన కథ బాగా నచ్చింది. ముఖ్యంగా వంశీ చెప్పిన క్లయిమాక్స్‌ విని ఒళ్ళు జలదరించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాణించిన నేను సినిమాలపై ఉన్న ఇష్టంతోనే ఈ చిత్రంతో నిర్మాతగా మారా’’ అన్నారు. ‘‘మా చిత్రంలో ఆంజనేయస్వామి గెటప్‌లో ఉన్న హీరో ఎవరనే ఆసక్తి అందరిలో కలిగింది. మే ప్రథమార్ధంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.

ఆ నటుడు ఎవరనేది తెలిసేది అప్పుడే. శేఖర్‌ చంద్ర మంచి పాటలిచ్చారు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగా కుదిరింది. గురురాజ్‌గారు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో విజయం సాధించినట్లుగానే సినిమా రంగంలోనూ సక్సెస్‌ అవుతారనే నమ్మకం ఉంది’’ అని వంశీకృష్ణ అన్నారు. రిచా పనయ్, శేఖర్‌ చంద్ర, పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement