లేడీ టైగర్
మాములుగా సినిమా షూటింగ్ స్పాట్ ఆర్టిస్టుల సందడితో కోలాహలంగా ఉంటుంది. అయితే అనుకోని అతిథిలా వచ్చిన ఓ దెయ్యం ఆ కేరింతల్ని కంగారుగా మార్చేసింది. దెయ్యాన్ని తరుముదామంటే దేవుడు రక్షిస్తున్నాడు. మరి వారి పరిస్థితి ఏంటి? దెయ్యానికి దేవుడు ఎందుకు అభయం ఇచ్చాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘రక్షక భటుడు’ చిత్రం చూడాల్సిందేనని అంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ నిర్మించారు. రిచాపనయ్, బ్రహ్మనందం, బ్రాహ్మజీ, సుప్రీత్, ప్రభాకర్ ముఖ్య తారాగణం. ఈ చిత్రం ట్రైలర్‌ను హైద్రాబాద్‌లో రిలీజ్ చేశారు.
సినిమాను ఈనెల 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భం మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులు తప్పక ఉంటాయి. నటుడు గురురాజ్ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. దర్శకుడు వంశీకి సినిమాలంటే పిచ్చి. ఈ ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘కథనే హీరోగా భావించి అందరం కష్టపడ్డాం. రిచా పనయ్ లేడి టైగర్‌లా నటించింది. వంశీకృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాత గురురాజ్. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: జె.శ్రీనివాసరాజు.