ఎనిమిది కథలతో...
ఎనిమిది కథలతో...
Published Thu, Feb 6 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
‘‘అందం, బంధం, బాంధవ్యం, నమ్మకం, అబద్ధం, మోసం, ఆశ, పేదరికం.. ఈ ఎనిమిది అంశాలు మానవ జీవితాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను ఒక్కో కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సినిమాని రూపొందించాం’’ అని ప్రవీణ్ సత్తారు అన్నారు. లక్ష్మీప్రసన్న, చైతన్యకృష్ణ, సీనియర్ నరేష్, ఆమని, రిచా పనై, షామిలి, ఇషా ముఖ్య తారలుగా వర్కింగ్ డ్రీమ్స్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మించిన చిత్రం ‘చందమామ కథలు’.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ పాటలు స్వరపరిచారు. పాటలను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘నిత్య జీవితంలో చూసే వ్యక్తులు, సంఘటనల సమాహారంతో ఈ చిత్రం చేశాం. ఎనిమిది కథలను అనుసంధానిస్తూ చేసిన సరికొత్త ప్రయోగం ఇది. ఓ రచయిత దృష్టి కోణంలోంచి సాగే చిత్రం. ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు.
Advertisement