Laxmiprasanna
-
కాళ్లపారాణి ఆరకముందే..
ముషీరాబాద్ : అనుమానాస్పదస్థితిలో ఓ నవవధువు మృతిచెందింది. కాళ్లపారాణి ఆరకముందే కూతురు మృతి చెందడంతో తల్లిదండులు కన్నీరుమున్నీరయ్యారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, బంధువుల కథనం ప్రకారం... తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఆవుల శంకర్‌కు నార్కట్‌పల్లికి చెందిన లక్ష్మీప్రసన్న (21)తో 2014, మే 11న పెళ్లైంది. కట్నకానులకు కింద మొత్తం రూ.14.5 లక్షలు ముట్టజెప్పారు. శంకర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్. నవదంపతులు రాంనగర్ రామాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కాపురం పెట్టారు. ఆ ఇంట్లో పది రోజులు ఉన్నాక.. చుట్టుపక్కల వారు ఆ ఇంట్లో గతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇదే సమయంలో తమకు ఎప్పుడో ఏదో ఆందోళనగా ఉంటోందని, భయమేస్తోందని చెప్పిన భార్యాభర్త.. ఆ ఇంటిని ఖాళీ చేసి బర్కత్‌పురలో ఉంటున్న లక్ష్మీప్రసన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ పది రోజులుండి ఆదివారం మధ్యాహ్నం రాంనగర్లో గతంలో తాముండే ప్రాంతంలోనే మరో ఇంట్లో అద్దెకు దిగారు. రాత్రి పది గంటల వరకు సామగ్రి సర్దుకొని పడుకున్నారు. రాత్రి ఒంటి గంటకు, మళ్లీ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య మూత్ర విసర్జనకు లేవడంతో ఆమెను బాత్రూంకు తీసుకెళ్లాడు. అయితే కొద్దిసేపటికి లక్ష్మీప్రసన్న అపస్మారకస్థితికి జారుకోవడంతో భర్త వెంటనే అమ్మమ్మకు, మేనమామకు ఫోన్ చేసి సమీపంలోని ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీప్రసన్న మృతి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ముషీరాబాద్ పోలీసుస్టేషన్‌కు, గాంధీ మార్చురీకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వైవిధ్యమైన కథలు
జీవితంలో ఎదురయ్యే అనుభవాలే పాఠాలు. మనిషిని పరిపూర్ణుణ్ణి చేసేది అవే. అలా జీవితం నుంచి పాఠాలను నేర్చుకున్న కొందరు వ్యక్తుల అనుభవాలు, పర్యవసానాలు, ఫలితాల సమాహారాన్నే కథాంశంగా చేసుకొని రూపొందుతోన్న చిత్రం ‘చందమామ కథలు’. ‘ఎల్బీడబ్ల్యూ’ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న, సీనియర్ నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్, శౌర్య ముఖ్య తారలు. చాణక్య భూనేటి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను మంచు లక్ష్మీప్రసన్న విడుదల చేశారు. తెలుగు సినీ చరిత్రలో ‘చందమామ కథలు’ చిత్రం ఓ లాండ్‌మార్క్‌గా నిలిచిపోతుందని, దర్శకుడు ఎంతో వైవిధ్యంగా సినిమాను తీర్చిదిద్దుతున్నాడని లక్ష్మీప్రసన్న అన్నారు. పదహారు వంటకాలతో వడ్డించిన విందు భోజనంలాంటి పసందైన సినిమా ఇదని నరేష్ కొనియాడారు. త్వరలో పాటలను, మార్చి ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
ఎనిమిది కథలతో...
‘‘అందం, బంధం, బాంధవ్యం, నమ్మకం, అబద్ధం, మోసం, ఆశ, పేదరికం.. ఈ ఎనిమిది అంశాలు మానవ జీవితాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను ఒక్కో కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సినిమాని రూపొందించాం’’ అని ప్రవీణ్ సత్తారు అన్నారు. లక్ష్మీప్రసన్న, చైతన్యకృష్ణ, సీనియర్ నరేష్, ఆమని, రిచా పనై, షామిలి, ఇషా ముఖ్య తారలుగా వర్కింగ్ డ్రీమ్స్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మించిన చిత్రం ‘చందమామ కథలు’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ పాటలు స్వరపరిచారు. పాటలను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘నిత్య జీవితంలో చూసే వ్యక్తులు, సంఘటనల సమాహారంతో ఈ చిత్రం చేశాం. ఎనిమిది కథలను అనుసంధానిస్తూ చేసిన సరికొత్త ప్రయోగం ఇది. ఓ రచయిత దృష్టి కోణంలోంచి సాగే చిత్రం. ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు.