కిషోర్
వైవిధ్యమైన కథలు
Published Mon, Feb 24 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
జీవితంలో ఎదురయ్యే అనుభవాలే పాఠాలు. మనిషిని పరిపూర్ణుణ్ణి చేసేది అవే. అలా జీవితం నుంచి పాఠాలను నేర్చుకున్న కొందరు వ్యక్తుల అనుభవాలు, పర్యవసానాలు, ఫలితాల సమాహారాన్నే కథాంశంగా చేసుకొని రూపొందుతోన్న చిత్రం ‘చందమామ కథలు’. ‘ఎల్‌బీడబ్ల్యూ’ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న, సీనియర్ నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్, శౌర్య ముఖ్య తారలు. చాణక్య భూనేటి నిర్మాత.
ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను మంచు లక్ష్మీప్రసన్న విడుదల చేశారు. తెలుగు సినీ చరిత్రలో ‘చందమామ కథలు’ చిత్రం ఓ లాండ్‌మార్క్‌గా నిలిచిపోతుందని, దర్శకుడు ఎంతో వైవిధ్యంగా సినిమాను తీర్చిదిద్దుతున్నాడని లక్ష్మీప్రసన్న అన్నారు. పదహారు వంటకాలతో వడ్డించిన విందు భోజనంలాంటి పసందైన సినిమా ఇదని నరేష్ కొనియాడారు. త్వరలో పాటలను, మార్చి ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
Advertisement
Advertisement