Chandamama Kathalu
-
స్వేచ్ఛ చందమామ కథలు: తొలి తెలుగు AI టూల్ లాంచ్ (ఫొటోలు)
-
చందమామ కథలు: స్వేచ్ఛ తొలి తెలుగు AI టూల్ లాంచ్
హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని, తెలుగులో ప్రత్యేకించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డేటాతో స్వేచ్చా "AI చందమామ కథలు" ను శనివారం ఆవిష్కరించింది. తెలుగు ఎల్ఎల్ఎమ్ అనేది తెలుగు మాట్లాడే మారుమూల రైతుకు కూడా అందుబాటులో ఉండాలనే ఛాలెంజ్‌ను స్వీకరించి, ఈ క్రమంలో దీనికి చందమామ కథలను ఎంచుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరైనారు. ఇది తెలుగులో కథ చెప్పడం కోసం దేశంలో తీసుకొచ్చిన తొలి ఏఐని ఆయన కొనియాడారు. నీతి, మర్మం నైతిక విలువలతో కూడిన చందమామ కథలను తెలుగు ఏఐవైపు మళ్లించడం సంతోషమన్నారు. భారతీయ కథలు, భారతీయ భాషలలో, భారతీయులందరికీ కథల రూపంలో అందించడం ముఖ్యం, ఈ క్రమంలో తెలుగు భాషలో, విలువలతో కూడిన చందమామ కథలతో ప్రారంభించడం చాలా బాగుందన్నారు ప్రొఫెసర్ (ఐఐటీ, మద్రాస్)గౌరవ్ రైనా. ఈ సందర్భంగా స్వేచ్ఛ తెలంగాణ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక చిన్న సమావేశంలో కథలకోసం భారతీయ భాషలలో ఏఐని సృష్టించే ఈ సమస్యపై ఆలోచిస్తున్న క్రమంలో చైతన్య (CPO & కో-ఫౌండర్, ఓజోనెటెల్), ప్రొఫెసర్ గౌరవ్ రైనా (ప్రొఫెసర్ IIT మద్రాస్) ఈ ఆలోచనకు రూపం వచ్చిందని తెలిపారు. తమ ప్రయత్నానికి 30 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు సహకరించారని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో స్వేచ్ఛ గొంతుకలా కూడా విస్తరించాలని భావిస్తున్నామని కిరణ్ చంద్ర తెలిపారు. ప్రధానంగా భారతదేశంలో 10 మిలియన్ డాలర్లతో ChatGPT లాంటి ఎల్ఎల్ఎంని నిర్మించడం అసాధ్యమన్న ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వ్యాఖ్యల్ని సవాల్‌గా తీసుకున్నట్టు చెప్పారు. ఓపెన్ AI వంటి వాటితో పోటీ పడేందుకు భారతీయ స్టార్ట్-అప్ రూపొందించిన తొలి ఇండిక్ లాంగ్వేజ్ మోడల్‌లలో తమ స్వేచ్ఛ చాట్‌బాట్ ఒకటని కిరణ్ వెల్లడించారు. 42 వేలకు పైగా పేజీల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేశామనీ, అమృతమైన సరికొత్త కథలు వచ్చేలా కూడా ఈ టూల్ ను సిద్ధం చేశామని చెప్పారు. 40వేల కథల డేటాసెట్ ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది చాట్‌జీపీటీలా ఖరీదైనదిగా గాకుండా ప్రతి రైతుకు, ప్రతి గ్రామీణ ఉపాధ్యాయునికి, ప్రతి దుకాణదారునికి అందుబాటులో ఉండాలన్నారు. ఆవైపుగా కూడా తమ కృషి సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రమా దేవి లంక(డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్) ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల కూడా పొల్గొనడం విశేషం. -
ఏఐ రూపంలో అలరించబోతున్న అలనాటి చందమామ కథలు
పండు వెన్నెల్లో శ్వేతవర్ణంలో వెలిగిపోయే చందమామను చూపిస్తూ అమ్మ గోరు ముద్దలు పెడుతుంటే ఆ హాయిదనం అలాగే ఉండాలనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఎంత మాధుర్యమో ... అమ్మ భాష కూడా అంతే తియ్యదనం. తేనెలూరే తెలుగు భాషలో కథలను చెబుతూ అమ్మ తినిపిస్తుంటే ఊహా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి చందమామ కథలను మళ్లీ వినాలని ఉందా.. ఆ కథలను కొత్తగా చూడాలని ఉందా. అయితే మీ ఆశ, ఆకాంక్ష తీరే రోజు దగ్గరకొచ్చేసింది. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో, నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో .. నాటి నీతికథలు, సాహసగాథలు నేటి పిల్లలకు ఎంతో అవసరం. అందుకే అదే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ స్వేచ్ఛ సంస్థ చందమామ కథలను ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా సరికొత్తగా మనకు అందిస్తుంది. నేడు మన మొబైల్ లో వాడే తెలుగు అక్షరాలు ఈ స్వేచ్ఛ సృష్టించినవే. అదే స్వేచ్ఛ నేడు ఈ అద్భుతమైన అందమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 40 వేల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేసిన స్వేచ్ఛ బృందం .. సరికొత్త కథలు వచ్చేలా టూల్ ను కూడా సిద్ధం చేసింది. అమృతగాథలను సృష్టించే ఈ వినూత్న కార్యక్రమానికి తెలుగు సాహితీవేత్తలు, రచయితలు, కవులతో పాటు, మాతృభాషపై మమకారం కలిగిన ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నామని నిర్వాహకులు తెలిపారు. రేపు (శనివారం 2024 జనవరి 6వ తేదీ) ఈ ఆవిష్కరణ జరగనుంది. గచ్చిబౌలి స్వేచ్ఛ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
చందమామను చూపించిన శంకర్ మామ
చందమామలో కుందేలు ఉంటుందో లేదో కాని చందమామ బాలల పత్రికలో కుందేలు ఉండేది. అడవి ఉండేది. సింహాలు, పులులు, నక్కలు. ఏనుగులు పిల్లలు కోరే ప్రపంచమంతా ఉండేది. ఆ బొమ్మలు గీసిన చిత్రకారుడు శంకర్ చెన్నైలో మంగళవారం కన్నుమూశారు. ఒక గొప్ప శకానికి ముగింపు పలికారు. చందమామకు 75 సంవత్సరాలు, శంకర్‌కు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా గతంలో సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... ‘‘మా స్వస్థలం కరత్తొలువు. ఇది కోయంబత్తూరు జిల్లాలో ఉంది. మా నాన్నగారు టీచర్. అందువల్లనేనేమో చిన్నప్పటి నుంచి అక్షరాలు అందంగా రాసేలా అలవాటు చేశారు. ఆ రోజుల్లోనే పాఠశాలల్లో అందరికీ మధ్యాహ్న భోజనం ఉండేది. జస్టిస్ పార్టీ వాళ్లు అందరికీ ఎంత తింటే అంత భోజనం పెట్టించేవారు. నా పదవ యేట చెన్నై వచ్చాను చదువుకు. ఎస్ఎస్ఎల్సి పూర్తయ్యాక మా గురువులు నాతో ‘నువ్వు మామూలు చదువుల వైపు కాకుండా ఫైన్ ఆర్ట్స్‌లో చేరు’ అన్నారు. అప్పట్లో ఆ స్కూల్‌ని బ్రిటీషువారు నడుపుతున్నారు. నేను ఆయన చెప్పినట్లే చిత్రలేఖనంలోకి వెళ్లాను. నా శ్రద్ధ చూసి, పాఠశాల వారు నాకు స్కాలర్షిప్ మంజూరు చేశారు. దాంతో నేను ముందు తరగతులు చదువుకోవడానికి వీలుపడింది. చందమామలో బొమ్మలు 1940లో చందమామ ప్రారంభమైతే 1952లో నాగిరెడ్డిగారి పిలుపు మేరకు 300 రూపాయల జీతానికి చేరాను. అంతకు ముందు వేరొక తమిళ మ్యాగజీన్లో పనిచేశాను. తెలుగు, తమిళం, ఇంగ్లీషు భాషలలో తగినంత పరిజ్ఞానం ఉండటం వల్ల పని సులువుగా చేసుకోగలిగాను. గత 60 సంవత్సరాలుగా అందులోనే పని చేస్తున్నాను. నాకు ఆధ్యాత్మికత ఎక్కువ. భక్తి కూడా ఎక్కువ. అదే సంస్థలో ఆరు దశాబ్దాలు పాటు పనిచేయడం నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. నా తుదిlశ్వాస వరకు చందమామలోనే ఉండాలనేది నా ఆకాంక్ష మాత్రం నెరవేరకుండా గత సంవత్సరం ఈ పత్రిక మూతపడింది. విక్రమ్ భేతాళ్... 1955లో చక్రపాణి, కుటుంబరావుగార్లు తెలుగులో బేతాళ కథలకు బొమ్మలు వేయమని అడిగారు. అప్పటివరకు వస్తున్నవాటిని మార్చి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి బొమ్మలు గీయమని సూచించారు. అది పిల్లల కథే అయినప్పటికీ చాలా పెద్ద విజయం సాధించింది. ఈ కథలకు నేను 700 బొమ్మలు వేశాను. పిల్లల ఆలోచనా ధోరణి ఆరోగ్యకరంగా ఉండేలా చేసేందుకు చందమామ నాకు అవకాశం ఇచ్చింది. నేను, చిత్ర, వపా... మా బొమ్మల ద్వారా గత ఆరుతరాలుగా ఇంటింటా నిలిచిపోయాం. ఆనందంగా ఉంటుంది... కథలకు బొమ్మలు వేసి ఆ బొమ్మల ద్వారా కథను సజీవం చేయడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది. పురాణాలకు సంబంధించి ఇప్పటికి వేలకొలది బొమ్మలు వేశాను. చాలామంది నేను వేసిన రాముడు, కృష్ణుడు బొమ్మలను వారి వారి పూజా మందిరాలలో పెట్టుకున్నామని చెబుతుంటే ఎంతో పరవశంగా అనిపిస్తుంది. చందమామను మీరే కాదు, మీ తల్లిదండ్రులు, తాతలు కూడా తప్పనిసరిగా చదివి ఉంటారని నా అభిప్రాయం. కేవలం ఐదారు వేలతో ప్రారంభమైన చందమామ సర్క్యులేషన్ లక్షల స్థాయికి చేరి ఒక వెలుగు వెలిగింది. మరచిపోలేని అనుభవాలు ఎన్నో... ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల గ్రామంలో ఒక చదువురాని స్త్రీ ‘చందమామ కారణంగా చదవడం, రాయడం నేర్చుకున్నాను’ అని చెప్పింది. ఒరిస్సాలో ఒక గొర్రెల కాపరి ఒక వెదురుబొంగులో చందమామ పుస్తకాన్ని భద్రపరిచాడట. అతడికి ఎప్పటికైనా నేను వేసినట్లుగా బొమ్మలు వేయాలని కోరికట. చందమామ గురించి కవిసమ్రాట్, ‘చందమామ నా చేత కూడా చదివిస్తున్నారు. పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా’ అని ఒక సందర్భంలో అన్నారంటే చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల పెద్దల మనసులో ఎంత స్థానం సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. చందమామ నా బిడ్డ. ఈ పత్రిక ఆగిపోవడంతో బిడ్డను చంపేసినట్టుగా ఉంది. ప్రపంచంలో ఇన్ని భాషలలో వచ్చిన పత్రిక ఇదొక్కటే. అవార్డులు, రివార్డులు ప్రభుత్వాల నుంచి అందుకోలేదు కాని, ప్రజల ప్రశంసలు మాత్రం లెక్కలేనన్ని అందుకున్నాను. ఆ అనుభూతులు నేను ఎన్నటికీ మరచిపోలేను.’’ – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
‘చందమామ’ శంకర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, ‘చందమామ’శంకర్‌గా పేరొందిన కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఉన్న కరథొలువు గ్రామంలో 1924 జూలై 24న శంకర్ జన్మించారు. తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవారు. తల్లి గృహిణి. శంకర్‌కు నలుగురు సోదరు లు. చిన్నప్పటి నుంచే చిత్రాలు గీయడంలో ఆసక్తి పెంచుకున్న శంకర్ పన్నెండవ తరగతి పూర్తయ్యాక చెన్నైలోని ఆర్ట్ కాలేజీలో చేరారు. అక్కడ తనలోని చిత్రకారునికి మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత 1946లో కళైమాగల్ అనే పత్రికలో తొలిసారి చిత్రకారునిగా కొలువులో చేరారు. అనంతరం 1952లో ‘చందమామ’లో చేరి, 2012లో ఆ పత్రిక మూతపడేవరకూ దాదాపు 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. తన అద్భుత చిత్రాలతో చందమామ కథలను పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపచేశారు. పురాణ పాత్రలకు సజీవరూపం.. చిత్రకారునిగా శంకర్ వేలాది చిత్రాలకు జీవం పోశారు. రామాయణం, మహాభారతం వంటి పురాణాలకూ ఆయన అద్భుత చిత్రాలు వేశారు. అయితే, ఆయనకు బాగా పేరు తెచ్చింది మాత్రం చందమామలో బేతాళ కథలకు రూపొందించిన చిత్రాలే. శంకర్ చందమామలో చేరేటప్పటికే అక్కడ మరో ఇద్దరు ప్రసిద్ధ చిత్రకారులు ‘చిత్రా’రాఘవులు, వడ్డాది పాపయ్య ఉన్నారు. సాధారణంగా పిల్లలకు ఇంట్లో తాతయ్యో, అమ్మమ్మో పురాణాలు, కథలు చెప్పడం మామూలే. అయితే, వాటిలోని పాత్రధారులు ఎలా ఉండేవారో ఎవరికి తెలుసు? ఊహించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ, ‘చందమామ’లో శంకర్ బొమ్మలు చూస్తూ పెరిగిన వారికి పురాణపాత్రలు టక్కున కళ్లముందు మెదులుతాయి. అంత అద్భుతంగా ఆ పాత్రల చిత్రాలను ఆయన మన కళ్లముందు ఉంచారు. ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తయితే, బేతాళ కథలకు వేసిన శీర్షిక చిత్రం ఒక ఎత్తు. విక్రమార్కుడు ఒక చేతిలో కరవాలం పట్టుకొని, భుజంపైన శవాన్ని మోసుకుంటూ వెళుతున్నట్లుండే ఆ చిత్రం శంకర్‌కు ఎంతో పేరు తెచ్చింది. అంతేకాదు, పురాణగాథలకు శంకర్ చిత్రీకరించిన భవనాలు, ఆభరణాలు, సినిమాల్లో ఎన్నో సెట్టింగ్‌లకు ప్రేరణ అంటే అతిశయోక్తికాదు. -
ముగిసిన చందమామ శకం
పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో తాతయ్యో, బామ్మో/అమ్మమ్మో ఇతర పెద్దలో పిల్లలకు పురాణాలలోని కథలు వాళ్ళకు తెలిసినంతవరకూ చెబుతూ ఉంటే ఆయా పురాణ పాత్రలు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఎవరి ఊహల్లో వాళ్ళు అనుకోవటం తప్ప వేరే అవకాశం లేదు. కానీ, చందమామలో శంకర్ గారి బొమ్మలు చూస్తూ పెరిగిన బాలలకు పురాణ పాత్రలను ఊహించుకోవలసిన కష్టం లేదు. చదివిన పది వాక్యాల కంటే, ఒక బొమ్మ విషయాన్ని పిల్లలకు అద్భుతంగా చెబుతుంది. తాను బొమ్మలు వేస్తున్నది, పిల్లలకోసం అని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆ బొమ్మలు వేసేవారు. కథ చదివిన తక్షణం ఆయా పాత్రల వివరాలు చక్కగా తెలిసిపోయేవి. పురాణాల పాత్రలను పిల్లలకే కాదు పెద్దలకు కూడా కళ్ళకు కట్టిన ఘనత ఒకే వ్యక్తిది. ఆ వ్యక్తే మనందరకూ సుపరిచితమైన శంకర్‌గారు. చందమామలో వచ్చిన రామాయణం, మహా భారతం సీరియల్స్‌కి వేసిన బొమ్మలతో పౌరాణిక పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్గారని అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబ రావుగారు చెప్పారు. రాజకుమార్తెల నిసర్గ సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించిన శంకర్‌గారు రాక్షస పాత్రలను కూడా అంతే సుందరంగా చిత్రించారు. ఉదాహరణకు రామాయణంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు పాత్రలు మచ్చుకు మాత్రమే. చందమామలో చేరింది మొదలుకుని 2012 చివరి వరకు దాదాపు 60ఏళ్లు పాటు చిత్రాలు గీస్తూనే వచ్చిన మాన్య చిత్రకారుడు శంకర్‌గారు. ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తు ఐతే, బేతాళ కథలకు శీర్షిక బొమ్మగా వేసిన బొమ్మ ఒక ఎత్తు. ఆయన వేసిన ఒక బొమ్మ ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. అదే బేతాళ కథలకు ప్రత్యేక శీర్షిక బొమ్మగా విక్రమార్కుడు చేతిలో కరవాలం భుజాన శవాన్ని మోసుకుంటూ వెడుతూ ఉంటే, శవంలోని బేతాళుడు కథ చెప్పటం మొదలుపెడతాడు. నాకు తెలిసి తెలుగు పత్రికా చరిత్రలో అతి ఎక్కువకాలం ధారావాహికగా కొనసాగిన శీర్షిక చందమామలో బేతాళ కథలే. చందమామలో చివరివరకూ ఆయన వేసిన బేతాళ బొమ్మనే కొనసాగించారు.కథలోని వివరాలే కాక, పిల్లలకు ఆ పాత్ర లక్షణాలు తెలియటానికి అనేక ఇతర వివరాలు కూడా చొప్పించేవారు. దాంతో ఆయన బొమ్మలతో కథలకు పరిపూర్ణత్వం వచ్చేది. అంతేకాక, బొమ్మలు చక్కగా చెక్కినట్టు, రూప లావణ్య విశేషాలతో ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆయన జానపద కథలకు వేసిన బొమ్మల్లో అలనాటి కట్టడాలు, అప్పటివారి దుస్తులు, వాడుకలో ఉన్న అనేక పరికరాలు పాత్రలు వగైరా ఎంతో శ్రద్ధగా చిత్రీకరించేవారు. నిజానికి శంకర్‌గారు వేసిన పురాణ సంబంధిత బొమ్మల్లో ఆయన చిత్రీకరించిన భవనాలు, ఆభరణాలు వంటివి నాటి తెలుగు పౌరాణిక సినిమాలలో వేసిన సెట్టింగ్‌లకు ప్రేరణ అంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, పిల్లలకు పురాణాలు, పురాణ గాథలు దగ్గిర చేయటంలో, శంకర్ గారి చిత్రాలు ఎంతగానో తోడ్పడ్డాయి. శంకర్ గారి మరణంతో అలనాటి పిల్లలు తమ నేస్తాన్ని కోల్పోయారు. వారికి మోక్ష ప్రాప్తి కలుగుగాక. మంగళవారం కన్నుమూసిన శంకర్‌గారి వయస్సు 97 సంవత్సరాలు, తన అసలు పేరు కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. చందమామ చిత్రకారుడిగా శంకర్‌గా పరిచయం. ఆయన 1924, జూలై 24న ఈరోడ్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. 12వ తరగతి పూర్తయ్యాక, మదరాసులోని ఆర్ట్స్ కాలేజీలో చేరి తనకు స్వతహాగా అబ్బిన బొమ్మలు వేసే శక్తిని ఇనుమడింపచేసుకున్నారు. మొదటి ఉద్యోగం 1946లో కళైమాగళ్ అనే పత్రికలో. తరువాత 1952లో చందమామలో చిత్రకారునిగా చేరి, చివరివరకూ చందమామలోనే బొమ్మలు వేశారు. చివరిక్షణాల్లోనూ, చందమామలో తాను వేసిన బొమ్మలనే తలచుకుంటూ ఆ బెంగతోనే ఆయన మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కె. శివరామప్రసాద్ వ్యాసకర్త రిటైర్డ్ మేనేజర్, కెనరా బ్యాంక్ మొబైల్ : 91676 03720 -
గుంటూరులో ఏం జరిగింది?
ఓ మెడికల్ షాప్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. ‘చందమామ కథలు’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రేష్మీ గౌతమ్, సిద్ధు జొన్నలగడ్డ , నరేశ్ విజయకృష్ణ, మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్.ఎం నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ‘‘సామాజిక అంశం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రం రూపొందింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. గుంటూరులో ఓ ఫిలిం సిటీ నిర్మించాలనే ఆలోచనతో ఉన్నా’’ అని చెప్పారు.ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: రామిరెడ్డి.పి. -
ఉత్తమ తెలుగు చిత్రంగా చందమామ కధలు
-
'చందమామ కథలు'కు జాతీయ అవార్డు
-
'చందమామ కథలు'కు జాతీయ అవార్డు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపిక జాతీయ ఉత్తమచిత్రం.. క్వీన్ ఉత్తమ నటి.. కంగనా రనౌత్ ప్రజాదరణ పొందిన చిత్రం.. మేరీకోమ్ న్యూఢిల్లీ 'చందమామ కథలు' సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ అవార్డు అందుకుంది. దీంతో ఆ సినిమాలో నటించిన మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ''ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. నా సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పుడే తెలిసింది. యాయాయాయా...'' అంటూ ఆనందం ప్రకటించారు. బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న క్వీన్ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అందులో అద్భుతమైన నటనను ప్రదర్శించిన కంగనా రనౌత్ జాతీయ ఉత్తమనటిగా కూడా ఎంపికయ్యారు. 62వ జాతీయ సినిమా అవార్డులను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రియాంకా చోప్రా నటించిన 'మేరీకోమ్' నిలిచింది. చైతన్య తమ్హానే తీసిన కోర్ట్ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిలింగా ఎంపికైంది. కన్నడ చిత్రం నాను అవనల్ల అవలు అనే సినిమాలో నటించిన హీరో విజయ్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. Omg omg omg #chandamamaKathalu just won the national award for the best regional film. Yayayayayayayyayayayayay. ???????????? — Lakshmi Manchu (@LakshmiManchu) March 24, 2015 -
మేకింగ్ ఆఫ్ చందమామ కథలు
-
పెళ్లికి ముందు.. ఆ తర్వాత
అభిజిత్, రీతూవర్మ జంటగా విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆళ్ల నౌరోజీరెడ్డి, ఎ.శోభారాణి కలిసి నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో డి.రామానాయుడు చేతుల మీదుగా మొదలైంది. పెళ్లి తర్వాత ఓ ప్రేమజంట ప్రేమలో వచ్చే మార్పే ప్రధానాంశంగా ఈ చిత్రం ఉంటుందని, కొమ్మనాపల్లి గణపతిరావు సంభాషణలు, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలని నిర్మాతల్లో ఒకరైన నౌరోజిరెడ్డి చెప్పారు. ఇరవైఏళ్లుగా దర్శకత్వశాఖలో పనిచేస్తున్నానని, ఓ మంచి కథ ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని విజయ్ శ్రీనివాస్ అన్నారు. అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్రలను ఇందులో చేస్తున్నామని హీరోహీరోయిన్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శ్రీచరణ్ కార్తీకేయ మూవీస్, కెమెరా: కె.చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.శ్రీనివాస్. -
అడుక్కోడానికి వేళాపాళా లేదా అన్నాడు
ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసుకుని పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సవాల్‌లా తీసుకుంటారు. ‘చందమామ కథలు’లో భిక్షగాడి పాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు కృష్ణేశ్వరరావు అలానే ఫీలయ్యారు. దాదాపు 1500 నాటక ప్రదర్శనలు, పలు నాటకాలకు కథ, మాటలు, భద్రాచలం, శ్రీరాములయ్య, జయం మనదేరా లాంటి చిత్రాలకు రచన, గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు తదితర చిత్రాల్లో నటన... సింపుల్‌గా ఇది కృష్ణేశ్వరరావు ట్రాక్ రికార్డ్. ‘చందమామ కథలు’లో చేసిన భిక్షగాడి పాత్ర ఆయన కెరీర్‌కు మంచి మలుపు అయ్యిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆదివారం పత్రికలవారితో తన ఆనందాన్ని కృష్ణేశ్వరరావు ఈ విధంగా పంచుకున్నారు... నటనంటే ఇష్టం. అందుకే నాటక రంగంలోకి అడుగుపెట్టాను. పరిషత్తుల్లో పాల్గొన్నాను. అమ్మ నేపథ్యంలో సాగే ‘సంపద’ అనే నాటకాన్ని 150 సార్లు ప్రదర్శిస్తే అన్నిసార్లూ అపూర్వ స్పందన లభించింది. నటుడు జీవా నాకు మంచి మిత్రుడు. వంశీగారి దర్శకత్వంలో ఆయన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు, ఆ షూటింగ్‌కి వెళ్లేవాణ్ణి. తన ద్వారానే నాకు వంశీగారితో పరిచయమైంది. ‘నీలో మంచి నటుడు కనిపిస్తున్నాడు’ అని వంశీగారు ‘గోపి గోపిక గోదావరి’లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. విడుదలకు సిద్ధమైన ‘తను మొన్నే వెళ్లిపోయింది’లో కూడా నాది మంచి పాత్ర. సూపర్‌స్టార్ కృష్ణ మెచ్చుకున్నారు ఇక, ‘చందమామ కథలు’లో చేసిన భిక్షగాడి పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపయ్యిందనే చెప్పాలి. ఆ సినిమా చూసి, ఇద్దరు పెద్ద నిర్మాతలు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నేను అడుక్కునే సన్నివేశాలను హైదరాబాద్‌లోని జూబ్లి హిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర తీశారు. షూటింగ్ అని చెప్పకుండా నిజంగా అడుక్కుంటున్నవాళ్లతో కలిసిపోయి, నేనూ అందరి దగ్గరి చెయ్యి చాపేవాణ్ణి. ‘మా ఏరియాకొచ్చావేంటి’? అంటూ అక్కడ భిక్షాటన చేస్తున్నవాళ్లు గుర్రుగా చూసేవాళ్లు. అలాగే ట్రైన్ ఎక్కే సన్నివేశం గురించి చెప్పాలి. నేను ట్రైన్ ఎక్కుతుంటే, ‘అడుక్కోడానికి వేళాపాళా లేదా’ అంటూ అక్కడున్న పోలీస్ తిట్టాడు. కంపార్ట్మెంట్లో కింద కూర్చుని అడుక్కుంటుంటే ఒకడైతే కర్రతో కొట్టినంత పని చేశాడు. షూటింగ్ అనడంతో ఆగాడు. అవన్నీ నాకు మంచి అనుభూతులు. కృష్ణగారు, విజయనిర్మలగారు సినిమా చూసి ‘బాగా చేశావు’ అని అభినందించారు. వంశీగారి సినిమాల్లో కామెడీ టచ్ ఉన్న కేరక్టర్లు, ఎన్. శంకర్‌గారి సినిమాల్లో కొంచెం సీరియస్‌గా ఉండే పాత్రలు చేసిన నాకు ఈ భిక్షగాడి పాత్ర నాలో పూర్తి స్థాయి కేరక్టర్ నటుడున్నాడని నిరూపించింది. నా నాటక, సినీరంగ ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలిచి, ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు తాడిశెట్టి వెంకట్రావుగారికి కృతజ్ఞతలు. -
చందమామా కథలు మూవీ సక్సస్ మీట్
-
నేను చేసిన సాహసం అదే! : ప్రవీణ్ సత్తారు
తొలి సినిమా ‘ఎల్బీడబ్ల్యూ’తోనే మంచి దర్శకునిగా మార్కులు కొట్టేశారు ప్రవీణ్ సత్తారు. రెండో సినిమా ‘రొటీన్ లవ్‌స్టోరి’ని భిన్నమైన ప్రేమకథగా ఆవిష్కరించి ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించేశారు. ఆయన మూడో సినిమా ‘చందమామ కథలు’ విడుదలైంది. ఇదో కథామాలిక. సమకాలీన సమాజంలో... పొంతనలేని ఎనిమిది కథల సమాహారం ఈ సినిమా. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలందుకుంటోందని ప్రవీణ్ ‘సాక్షి’తో ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారుతో కాసేపు... ఈ సినిమా విషయంలో మీకు లభించిన గొప్ప ప్రశంస? చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అభినందిస్తున్నారు. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని కలలో కూడా అనుకోలేదని చాలామంది అంటున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఈ చిత్రం చూశారు. విజయనిర్మలగారైతే క్లయిమాక్స్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో సినిమా తీయడం కష్టమని అభినందించారు. అసలు ఇలాంటి సినిమా తీయాలని ఎందుకనిపించింది? తెలుగులో కొత్త సినిమాలు రావడం లేదు, తీసిన సినిమాలే మళ్లీ తీస్తున్నారనే విమర్శ ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అందుకే... తెలుగుతెరకు ఓ కొత్త సినిమా ఇవ్వాలనే కసితో ఈ సినిమా చేశాను. నిజంగా ఇలాంటి కథనంతో సినిమా తీయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏమైనా హోమ్‌వర్క్ చేశారా? ఇలాంటి సినిమాలు తీయాలంటే పరిశీలన అవసరం. లేచినప్పట్నుంచీ పడుకునే వరకూ జీవితంలో ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యక్తిత్వం. సినిమాల్లో డ్రామా అవసరం అని చాలామంది అంటుంటారు. నిజానికి సమాజంలో మనకు కనిపించే పాత్రల్లో ఉండే డ్రామా ఏ సినిమాలో కనిపించదు. కాకపోతే దాన్ని తెరపై ఆవిష్కరించడం చేతకావాలి. ‘చందమామ కథలు’ విషయంలో నేను చేసిన సాహసం అదే. అంటే... అందులోని పాత్రలు రియల్ లైఫ్‌లో మీరు చూసినవేనా? అవును... పలు సందర్భాల్లో నేను గమనించిన పలువురు వ్యక్తులే ఈ సినిమాలోని పాత్రలకు ప్రేరణ. ఉదాహరణకు ఖైరతాబాద్ జంక్షన్లో కేవలం రాత్రి వేళల్లోనే ఓ ముసలాయన అడుక్కుంటూ ఉంటాడు. అతను పగలు కనిపించడు. కారణం పొల్యూషన్. దాని కారణంగా ఆరోగ్యం పాడవుతుందని అతని ఫీలింగ్. ఆ ముసలాయనకు చింతల్ బస్తీలో మూడంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని అద్దెలు కూడా అతనికి భారీగానే వస్తుంటాయి. కేవలం బెగ్గింగ్ వల్ల వచ్చిన డబ్బుతోనే ఆ ముసలాయన ఆ బిల్డింగ్ కొన్నాడు. ‘చందమామ కథలు’ చిత్రంలోని బెగ్గర్ పాత్రకు ప్రేరణ అయనే. అలా ప్రతి పాత్రకూ ఓ ప్రేరణ ఉంది. విదేశాల్లో మంచి ఉద్యోగం, చేతినిండా సంపాదన ఉన్న మీకు సినిమాలపై మీ దృష్టి ఎందుకు మరలింది? నాకు సినిమాలంటే ప్రాణం. ముఖ్యంగా కె.విశ్వనాథ్‌గారి అభిమానిని. ఆయన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాలు తీసే దర్శకులు నాకు ఎవ్వరూ కనిపించలేదు. మంచి సినిమా అంటే... మలయాళం, హిందీ, తమిళ సినిమాలవైపే అందరూ చూస్తున్నారు కానీ, తెలుగు సినిమా వంక ఒక్కరు కూడా చూడటం లేదు. అందుకే... నా వంతు ప్రయత్నంగా తెలుగులో మంచి సినిమాలు తీయాలనే తలంపుతో దర్శకుణ్ణయ్యాను. అంటే... మున్ముందు కూడా మీ నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయన్నమాట? ఒక మంచి ప్రయత్నం చేస్తే సరిపోదు. దానికి ప్రజాదరణ కూడా ముఖ్యం. ‘చందమామ కథలు’ అనే మంచి సినిమా తీశాను. అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ మెచ్చుకోళ్లతో పాటు డబ్బులు కూడా రావాలి. అలా వస్తే... మరిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయరా? ఎందుకు చేయను... తప్పకుండా చేస్తాను. అయితే వాళ్లకి అనుగుణంగా చేయమంటే మాత్రం చేయలేను. నా శైలిలో నన్ను చేయనిస్తే స్టార్లతో కూడా చేస్తాను. -
'ఆమెకు సిగరెట్ కాల్చడం నేర్పా'
సినిమాల్లో హీరోలు సిగరెట్లు కాల్చే సన్నివేశాలు చాలానే ఉంటాయి. అయితే.. హీరోయిన్లు, ఇతర నటీమణులు సిగరెట్ కాల్చడం మాత్రం తక్కువ. అందులోనూ అప్పటివరకు ఏమాత్రం అలవటు లేకుండా కేవలం సినిమా కోసం, అందులో పాత్ర కోసం సిగరెట్ కాల్చాల్సి వస్తే? లక్ష్మీ మంచుకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 'చందమామ కథలు' సినిమాలో ఆమె ఒక మోడల్ పాత్ర పోషించారు. పాత్ర స్వరూప స్వభావాలను బట్టి సిగరెట్ కాల్చాల్సి ఉంటుంది. (చదవండి: సినిమా రివ్యూ) కానీ ఇంతవరకు లక్ష్మికి పొగతాగడం అలవాటు లేదు. అందుకే ఆమె కొంత తటపటాయించారు. కానీ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం ఆమెను సిగరెట్ కాల్చాల్సిందిగా కోరారు. కొంత నచ్చజెప్పిన తర్వాత ఆమె అర్థం చేసుకుని అంగీకరించారని, అలా తాను తొలిసారి లక్ష్మికి సిగరెట్ కాల్చడం నేర్పించానని ప్రవీణ్ చెప్పారు. అదంత సులభం కాకపోయినా.. పాత్రకోసం ఆమె అలా చేశారని అన్నారు. -
సినిమా రివ్యూ: చందమామ కథలు
నటీనటులు: లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషి సాంకేతిక వర్గం: మ్యూజిక్, రీరికార్డింగ్: మిక్కి జే మేయర్ సినిమాటోగ్రఫి: సురేశ్ రగుతు ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల నిర్మాత: చాణక్య బూనేటి దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు పాజిటివ్ పాయింట్స్: దర్శకత్వ పనితీరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫోటోగ్రఫి నటీనటుల పనితీరు మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ నేరేషన్ ఎడిటింగ్ ఎల్ బీ డబ్య్లూ (లవ్ బిఫోర్ వెడ్డింగ్), రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు మూడో చిత్రంగా చందమామ కథలు చిత్రాన్ని ఏప్రిల్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంచు లక్ష్మి, నరేశ్, ఆమని తదితర నటులతో మొత్తం ఎనిమిది కథలతో రూపొందిన ఈ చిత్రానికి విడుదలకు ముందు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఇంతకీ సినిమాలోని కథలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం... సారధి (కిషోర్) ఓ రచయిత. అతనికి కావేరి అనే కూతురు ఉంటుంది. కావేరికి లుకేమియా సోకడంతో సారథికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆస్తిపాస్తులు అంతగా లేని సారథి కూతురు వైద్యానికి కావాల్సిన సొమ్మును ఎలా సంపాదించుకున్నారు? లుకేమియా నుంచి కావేరి బయటపడిందా? సారథి, కావేరి కథకు మరో ఏడు కథలకు సంబంధమేమిటనే ప్రశ్నలకు సమాదానమే 'చందమామ కథలు' చిత్రం. నటీనటుల ప్రదర్శన లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషిలవి కథపరంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలే. ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో రచయిత కృష్ణేశ్వరరావు నటనను ప్రశంసించాల్సిందే. ఇంకా లిసా స్మిత్‌గా ఓ మోడల్‌గా నటించిన మంచు లక్ష్మి ఓ డిఫెరెంట్ పాత్రతో ఆకట్టుకున్నారు. సారథిగా కిషోర్, కూతురు పాత్రలో కావేరి పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నింటికీ అందరూ పూర్తి న్యాయం చేకూర్చారు. సాంకేతిక వర్గం: ఎనిమిది కథల సంకలనం 'చందమామ కథలు' ఓ ఫీల్ గుడ్ చిత్రమనిపించడానికి ప్రధాన కారణం మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనికి తోడు సురేశ్ పోటోగ్రఫీ మ్యాజిక్ చేసింది. ధర్మేంద్ర కత్తెరకు మరింత పదును పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం కొంత డాక్యుమెంటరీ స్టైల్లో అనిపించడానికి పూర్ ఎడిటింగ్ కారణమని అనిపిస్తుంది. ఎనిమిది కథలకు తగినట్టుగా, సరిగ్గా అతికినట్టుగా నటీనటులను దర్శకుడు ఎంపిక చేసుకోవడంలో విజయం సాధించారు. ఇక ఎనిమిది కథలను సీన్ బై సీన్ ను పేర్చుకుంటూ రూపొందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మల్టిప్లెక్స్ ఆడియెన్స్, బీ, సీ సెంటర్లను దృష్టిలో పెట్టుకుని కథల సంకలనంగా రూపొందిన 'చందమామ కథలు' టాలీవుడ్లో ఓ కొత్త ప్రయోగమే. -
ఇకనుంచీ అలా చేయదలుచుకోలేదు
‘‘ఇప్పటివరకు చేసినవాటిలో కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోలేదు. ఇకనుంచీ అలా చేయదల్చుకోలేదు. మా నాన్నగారు ధనవంతులే. కానీ, నేను కాదు. ఇంకా ఆయన మీద ఆధారపడితే ఏం బాగుంటుంది? నాకూ కుటుంబం ఉంది కదా. అందుకే, మంచి పాత్ర, అందుకు తగ్గ పారితోషికం ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నా చేస్తా’’ అని లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణక్య బూనేటి నిర్మించిన ‘చందమామ కథలు’లో ఆమె నటించారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ -‘‘ఈ కథ విన్నప్పుడు ఇలాంటి సినిమా వదులుకుంటే, భవిష్యత్తులో మళ్లీ ఇంత మంచి అవకాశం రాదనిపించింది. ఎనిమిది కథలతో సినిమా అంటేనే చాలా కొత్తగా ఉందనిపించింది’’ అని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ -‘‘ఇందులో నాది గ్లామరస్‌గా ఉండే మోడల్ కేరక్టర్. ఈ మోడల్ సిగరెట్ కాలుస్తుంది.. మందు కొడుతుంది. వాస్తవానికి సిగరెట్ ఎలా పట్టుకోవాలో నాకు తెలియదు. దాంతో కొంతమందిని పరిశీలించాను. మందు కొట్టే సన్నివేశాలకు కూడా ఇతరులను అబ్జర్వ్ చేశాను. నా కేరక్టర్ మాట్లాడే మాటలు అక్కడక్కడా అభ్యంతరకరంగా కూడా ఉంటాయి. ‘ఇలాంటి డైలాగులా? కత్తెర పడుతుందేమో’ అని దర్శకుడితో అంటే, ‘ఈ కేరక్టర్ ఇలానే మాట్లాడాలి’ అన్నారు. మోడల్‌గా చేయడం కోసం నేను హిందీ చిత్రం ‘ఫ్యాషన్’ని కొంత ఆదర్శంగా తీసుకున్నా’’ అని చెప్పారు. సిగరెట్, మందు తాగడం వంటి సన్నివేశాల్లో నటిస్తే, నెగిటివ్ ఇమేజ్ ఏర్పడే అవకాశం ఉండదా? అన్న ప్రశ్నకు -‘‘ఓ నటిగా ఎంతైనా చేయాలనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. విష్ణు, మనోజ్‌కి ఈ సన్నివేశాల గురించి తెలుసు. నాన్నగారికే తెలియదు. ఒకవేళ సినిమా చూసిన తర్వాత ‘ఎందుకిలాంటివి చేశావ్?’ అని అడిగితే ‘మీరే కదా డాడీ.. కళాకారులు ఏ పాత్రై నా చేయాలని అంటుంటారు’ అని కూల్ చేసేస్తా’’ అన్నారు. చందమామ కథలు’లాంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించడంవల్ల మీకు ప్రాధాన్యం ఉంటుందంటారా? అని అడిగితే -‘‘మంచి సినిమాలో నాది చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు. చివరికి ఒక్క సన్నివేశంలో కనిపించినా చాలు. కాకపోతే, కథకు కీలకంగా ఉండాలి. ఈ సినిమాలో నా పాత్ర మాత్రమే కాదు.. అందరివీ బాగుంటాయి’’ అని చెప్పారు. తదుపరి సొంత సంస్థలో కొత్త దర్శకునితో ఓ సినిమా నిర్మించనున్నట్లు, అందులో తానే నటించనున్నట్లు లక్ష్మీ తెలిపారు. -
నరేశ్, ఆమనిల లిప్‌లాక్
సినిమాల్లో పాటలు, ఫైట్లు ఉండటం ఎంత సహజమైందో, ఈ మధ్య పెదవి ముద్దు సన్నివేశాలుండటం అంతే సహజం అయ్యింది. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య తెలుగులోనూ ఈ తరహా సన్నివేశాల హవా సాగుతోంది. అయితే ఏ కుర్ర జంటమీదో ఈ సన్నివేశాలు చూశాం. ఈ 25న విడుదల కానున్న ‘చందమామ కథలు’లో కూడా చూడబోతున్నాం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మించారు. అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో నరేశ్, ఆమని కీలక పాత్రలు చేశారు. ఫార్టీ ప్లస్‌లో ఉన్న ఈ ఇద్దరిపై ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉండటం విశేషం. దీని గురించి నరేశ్ మాట్లాడుతూ -‘‘కథకు అవసరమైతే ఎలాంటి సన్నివేశంలో అయినా నటించడం నాకు మొదట్నుంచీ అలవాటు. ఆమని కూడా అంతే. ప్రవీణ్ సత్తారు ఈ సీన్ గురించి చెప్పగానే నేను, ఆమని ఏమాత్రం సంశయించలేదు. ఎందుకంటే, కథకు ఆ సన్నివేశం గుండెలాంటిది. కావాలని లిప్ లాక్ సీన్ పెట్టడం వేరు. కథానుగుణంగా పొందుపరచడం వేరు. ఈ సినిమా కథ డిమాండ్ మేరకు ఈ సీన్ చేశాం. లిప్‌లాక్ అనేది ఓ అందమైన భావోద్వేగంలాంటిది. ఆ భావాన్ని సరైన రీతిలో తెరకెక్కిస్తే, ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమాలో సీన్ అలానే ఉంటుంది. అసభ్యంగా ఉండదు. రేపు సినిమా చూసిన ప్రేక్షకుల ఈ మాటలు నిజమని ఒప్పుకుంటారు. సింగిల్ టేక్‌లో ఈ సీన్ చేశాం’’ అని చెప్పారు. ఇంకా సినిమా గురించి పలు విశేషాలు చెబుతూ -‘‘ఇందులోని ప్రతి పాత్ర పది మందిలో కనీసం నలుగురికైనా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఏజ్గ్రూప్వారికీ ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. టీవీ సీరియల్స్ చూసీ చూసీ విసుగెత్తిన కుటుంబ ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్‌కి రావాలనుకుంటున్నారు. వాళ్లందర్నీ సంతృప్తిపరిచే సినిమా ఇది’’ అని చెప్పారు. -
కొన్ని అనుభవాల సమాహారం...
‘నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికీ ఎందరో తారసపడుతూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి కొన్ని అనుభవాల సమాహారమే ఈ సినిమా’’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చెప్పారు. లక్ష్మీ మంచు, నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్, నాగశౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచాపనయ్, చైతన్యకృష్ణ ముఖ్య తారలుగా చాణక్య బూనేటి నిర్మించిన ‘చందమామ కథలు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ -‘‘ఇలాంటి కథతో సినిమా చేయడం మా వల్ల కాదు. ఈ చిత్రం చూశాక అద్భుతమైన సినిమా చూసినట్టనిపించింది. అందుకే ఈ సినిమా విడుదలలో మేం కూడా భాగస్వాములం అయ్యాం’’ అని తెలిపారు. ‘లెజెండ్’ తీసిన నిర్మాత మా సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉందని లక్ష్మీ మంచు చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేష్, అభిజిత్, కృష్ణుడు, ధర్మేంద్ర తదితరులు మాట్లాడారు. -
చందమామ కథలు మూవీ ప్రెస్ మీట్
-
ఆధునికంగా... చందమామ కథలు
మనిషికి ఎదురయ్యే అనుభవాలు, వాటి పర్యావసానాలు, ఫలితాల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘చందమామ కథలు’. సీనియర్ నరేష్, ఆమని, మంచు లక్ష్మీప్రసన్న, కృష్ణుడు, కిషోర్, అభిజిత్, రీచా పనయ్, చైతన్యకృష్ణ, షామిలి, శౌర్య, అమితారావ్, ఇషా రంగనాథ్, కృష్ణేశ్వరరావు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నిర్మాత చాణక్య బూనేటి. మిక్కీ జె.మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో అధునిక పద్ధతిలో చిత్రం యూనిట్ సభ్యులు విడుదల చేశారు. దర్శకుని అభిరుచి, నిర్మాత ఇచ్చిన ఫ్రీడమ్, మంచి సాహిత్యం... వల్లే మంచి సంగీతం అందించగలిగానని, ఈ సినిమా బాగా వచ్చిందంటే... ఆ క్రెడిట్ టీమ్ అందరిదీ అని మిక్కీ జే మేయర్ చెప్పారు. ‘‘ప్రవీణ్ సత్తారుతో పనిచేశాక... నేను కాస్త లేట్‌గా పుట్టి ఉంటే బావుండేదే అనిపించింది’’ అని నరేష్ చెప్పారు. అందరం కమిట్మెంట్తో వర్క్ చేశామని, ఇందులో తన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని మంచు లక్ష్మి అన్నారు. సీడీల్లో పాటలు వినే రోజులు పోయాయి కాబట్టి, తామే సొంతంగా వర్కింగ్ డ్రీమ్ మ్యూజిక్‌ని నెలకొల్పి, డిజిటల్ ఫార్మెట్లో పాటల్ని విడుదల చేస్తు న్నామని, ఈ కథలో పాటలే కీలకమని, అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయని ప్రవీణ్ సత్తారు తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 14న సినిమా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. అతిథిగా పాల్గొన్న మనోజ్‌తో పాటు చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
వైవిధ్యమైన కథలు
జీవితంలో ఎదురయ్యే అనుభవాలే పాఠాలు. మనిషిని పరిపూర్ణుణ్ణి చేసేది అవే. అలా జీవితం నుంచి పాఠాలను నేర్చుకున్న కొందరు వ్యక్తుల అనుభవాలు, పర్యవసానాలు, ఫలితాల సమాహారాన్నే కథాంశంగా చేసుకొని రూపొందుతోన్న చిత్రం ‘చందమామ కథలు’. ‘ఎల్బీడబ్ల్యూ’ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న, సీనియర్ నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్, శౌర్య ముఖ్య తారలు. చాణక్య భూనేటి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను మంచు లక్ష్మీప్రసన్న విడుదల చేశారు. తెలుగు సినీ చరిత్రలో ‘చందమామ కథలు’ చిత్రం ఓ లాండ్‌మార్క్‌గా నిలిచిపోతుందని, దర్శకుడు ఎంతో వైవిధ్యంగా సినిమాను తీర్చిదిద్దుతున్నాడని లక్ష్మీప్రసన్న అన్నారు. పదహారు వంటకాలతో వడ్డించిన విందు భోజనంలాంటి పసందైన సినిమా ఇదని నరేష్ కొనియాడారు. త్వరలో పాటలను, మార్చి ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
ఎనిమిది కథలతో...
‘‘అందం, బంధం, బాంధవ్యం, నమ్మకం, అబద్ధం, మోసం, ఆశ, పేదరికం.. ఈ ఎనిమిది అంశాలు మానవ జీవితాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను ఒక్కో కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సినిమాని రూపొందించాం’’ అని ప్రవీణ్ సత్తారు అన్నారు. లక్ష్మీప్రసన్న, చైతన్యకృష్ణ, సీనియర్ నరేష్, ఆమని, రిచా పనై, షామిలి, ఇషా ముఖ్య తారలుగా వర్కింగ్ డ్రీమ్స్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మించిన చిత్రం ‘చందమామ కథలు’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ పాటలు స్వరపరిచారు. పాటలను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘నిత్య జీవితంలో చూసే వ్యక్తులు, సంఘటనల సమాహారంతో ఈ చిత్రం చేశాం. ఎనిమిది కథలను అనుసంధానిస్తూ చేసిన సరికొత్త ప్రయోగం ఇది. ఓ రచయిత దృష్టి కోణంలోంచి సాగే చిత్రం. ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. -
జీవిత పాఠాలు...
‘‘అనుభవాన్ని మించిన గురువు మనిషికి వేరే ఉండరు. జీవనక్రమంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలు వారికి పాఠాలు. ఆ పాఠాల పర్యవసానమే మా చందమామ కథలు’’ అన్నారు మంచు లక్ష్మి. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మంచు లక్ష్మి, చైతన్యకృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్ ప్రధాన పాత్రధారులుగా... చాణక్య బూనేటి నిర్మిస్తున్న చిత్రం ‘చందమామ కథలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఏం తీయాలనుకున్నానో... అది క్లారిటీతో తీశాను. ఈ నెల ద్వితీయార్ధంలో లోగోను ఆవిష్కరించి, జనవరిలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్లో షూటింగ్‌ని పూర్తిచేయగలిగామని నిర్మాత సంతృిప్తి వ్యక్తం చేశారు. ఇంకా నరేష్, కృష్ణుడు, అభిజిత్, నాగశౌర్య కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల. -
ఈ చందమామ కథలు ఓ గొప్ప అనుభవం
‘‘చందమామ కథలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. ఆమె ఆప్యాయతకు గుర్తుగా ఈ సినిమాకు ‘చందమామ కథలు’ అనే టైటిల్ పెట్టాను. ఈ కథకు ఈ టైటిల్ కంటే గొప్ప టైటిల్ నాకు దొరకలేదు’’ అని ప్రవీణ్ సత్తారు అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చాణక్య బూనేటి నిర్మాత. చైతన్యకృష్ణ, నరేష్, అమని, కృష్ణుడు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విశేషాలు తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రవీణ్ సత్తార్ ఇంకా చెబుతూ -‘‘మనిషికి జీవితానికి మించిన పాఠం వేరొకటి ఉండదు. అలా ఓ వ్యక్తి జీవితంలో ఎదురైన అనుభవాలు, ఫలితాలు, పర్యవసానాల సమాహారమే ఈ సినిమా. కథనం ప్రధానంగా సినిమా సాగుతుంది. ఇందులో మరో ముఖ్య సూత్రధారి ఉన్నారు. త్వరలోనే ఆయన ఎవరో రివీల్ చే స్తాం. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని, పాటల్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలకు 360 డిగ్రీల తేడా ఉన్న పాత్రను ఇందులో చేశానని, అద్భుతమైన వాణిజ్య విలువలు ఉన్న ఈ సినిమా తనకో గొప్ప అనుభవమని మంచు లక్ష్మి చెప్పారు. కథకు తగ్గట్టుగా మంచి టైటిల్ పెట్టిన దర్శకుణ్ణి అభినందిస్తున్నానని నరేష్ అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.