ఈ చందమామ కథలు ఓ గొప్ప అనుభవం | Manchu Lakshmi to tell Chandamama Kathalu | Sakshi
Sakshi News home page

ఈ చందమామ కథలు ఓ గొప్ప అనుభవం

Published Tue, Nov 12 2013 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM

ఈ చందమామ కథలు ఓ గొప్ప అనుభవం

ఈ చందమామ కథలు ఓ గొప్ప అనుభవం

‘‘చందమామ కథలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. ఆమె ఆప్యాయతకు గుర్తుగా ఈ సినిమాకు ‘చందమామ కథలు’ అనే టైటిల్ పెట్టాను. ఈ కథకు ఈ టైటిల్ కంటే గొప్ప టైటిల్ నాకు దొరకలేదు’’ అని ప్రవీణ్ సత్తారు అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చాణక్య బూనేటి నిర్మాత. చైతన్యకృష్ణ, నరేష్, అమని, కృష్ణుడు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విశేషాలు తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
 ప్రవీణ్ సత్తార్ ఇంకా చెబుతూ -‘‘మనిషికి జీవితానికి మించిన పాఠం వేరొకటి ఉండదు. అలా ఓ వ్యక్తి జీవితంలో ఎదురైన అనుభవాలు, ఫలితాలు, పర్యవసానాల సమాహారమే ఈ సినిమా. కథనం ప్రధానంగా సినిమా సాగుతుంది. ఇందులో మరో ముఖ్య సూత్రధారి ఉన్నారు. త్వరలోనే ఆయన ఎవరో రివీల్ చే స్తాం. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని, పాటల్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలకు 360 డిగ్రీల తేడా ఉన్న పాత్రను ఇందులో చేశానని, అద్భుతమైన వాణిజ్య విలువలు ఉన్న ఈ సినిమా తనకో గొప్ప అనుభవమని మంచు లక్ష్మి చెప్పారు. కథకు తగ్గట్టుగా మంచి టైటిల్ పెట్టిన దర్శకుణ్ణి అభినందిస్తున్నానని నరేష్ అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement