నరేశ్, ఆమనిల లిప్‌లాక్ | Naresh & Amani lip lock in Chandamama kathalu | Sakshi
Sakshi News home page

నరేశ్, ఆమనిల లిప్‌లాక్

Published Thu, Apr 17 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

నరేశ్, ఆమనిల లిప్‌లాక్

నరేశ్, ఆమనిల లిప్‌లాక్

సినిమాల్లో పాటలు, ఫైట్లు ఉండటం ఎంత సహజమైందో, ఈ మధ్య పెదవి ముద్దు సన్నివేశాలుండటం అంతే సహజం అయ్యింది. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య తెలుగులోనూ ఈ తరహా సన్నివేశాల హవా సాగుతోంది. అయితే ఏ కుర్ర జంటమీదో ఈ సన్నివేశాలు చూశాం. ఈ 25న విడుదల కానున్న ‘చందమామ కథలు’లో కూడా చూడబోతున్నాం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మించారు. అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో నరేశ్, ఆమని కీలక పాత్రలు చేశారు. ఫార్టీ ప్లస్‌లో ఉన్న ఈ ఇద్దరిపై ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉండటం విశేషం. దీని గురించి నరేశ్ మాట్లాడుతూ -‘‘కథకు అవసరమైతే ఎలాంటి సన్నివేశంలో అయినా నటించడం నాకు మొదట్నుంచీ అలవాటు. ఆమని కూడా అంతే.
 
  ప్రవీణ్ సత్తారు ఈ సీన్ గురించి చెప్పగానే నేను, ఆమని ఏమాత్రం సంశయించలేదు. ఎందుకంటే, కథకు ఆ సన్నివేశం గుండెలాంటిది. కావాలని లిప్ లాక్ సీన్ పెట్టడం వేరు. కథానుగుణంగా పొందుపరచడం వేరు. ఈ సినిమా కథ డిమాండ్ మేరకు ఈ సీన్ చేశాం. లిప్‌లాక్ అనేది ఓ అందమైన భావోద్వేగంలాంటిది. ఆ భావాన్ని సరైన రీతిలో తెరకెక్కిస్తే, ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమాలో సీన్ అలానే ఉంటుంది. అసభ్యంగా ఉండదు. రేపు సినిమా చూసిన ప్రేక్షకుల ఈ మాటలు నిజమని ఒప్పుకుంటారు. సింగిల్ టేక్‌లో ఈ సీన్ చేశాం’’ అని చెప్పారు. ఇంకా సినిమా గురించి పలు విశేషాలు చెబుతూ -‘‘ఇందులోని ప్రతి పాత్ర పది మందిలో కనీసం నలుగురికైనా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఏజ్‌గ్రూప్‌వారికీ ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. టీవీ సీరియల్స్ చూసీ చూసీ విసుగెత్తిన కుటుంబ ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్‌కి రావాలనుకుంటున్నారు. వాళ్లందర్నీ సంతృప్తిపరిచే సినిమా ఇది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement