కొన్ని అనుభవాల సమాహారం... | Combination of all experiences | Sakshi
Sakshi News home page

కొన్ని అనుభవాల సమాహారం...

Published Tue, Apr 8 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

కొన్ని అనుభవాల సమాహారం...

కొన్ని అనుభవాల సమాహారం...

‘నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికీ ఎందరో తారసపడుతూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి కొన్ని అనుభవాల సమాహారమే ఈ సినిమా’’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చెప్పారు. లక్ష్మీ మంచు, నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్, నాగశౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచాపనయ్, చైతన్యకృష్ణ ముఖ్య తారలుగా చాణక్య బూనేటి నిర్మించిన ‘చందమామ కథలు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ -‘‘ఇలాంటి కథతో సినిమా చేయడం మా వల్ల కాదు. ఈ చిత్రం చూశాక అద్భుతమైన సినిమా చూసినట్టనిపించింది. అందుకే ఈ సినిమా విడుదలలో మేం కూడా భాగస్వాములం అయ్యాం’’ అని తెలిపారు. ‘లెజెండ్’ తీసిన నిర్మాత మా సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉందని లక్ష్మీ మంచు చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేష్, అభిజిత్, కృష్ణుడు, ధర్మేంద్ర తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement