lakshimi manchu
-
ఇలాంటి శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది.. నటి ఘాటు రిప్లై
తాప్సీకి పొగడ్తలు ఎలా తీసుకోవాలో, అలాగే అవమానాలకు ఎలా స్పందించాలో కూడా తెలుసు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘రష్మీ రాకెట్’. ఈ సినిమాలో గుజరాతీ స్పింటర్ రష్మీ పాత్రలో నటిస్తోంది. అథ్లెట్ బాడీ కోసం ఈ నటి పడిన కష్టానికి ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘మహాసముద్రం’ ట్రైలర్ రీలీజ్ ఎప్పుడంటే..? అయితే ఇటీవల ఆమె ఈ సినిమా సంబంధించిన వెనక్కి తిరిగి ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఎవరో చెప్పుకోండి?’ అంటూ క్యాప్షన్‌ని దానికి జోడించింది. దానికి ఓ నెటిజన్ ‘ఇలాంటి శరీరం తాప్సీ పన్నుకే ఉంటుంది’ అని ఇబ్బందికరమైన కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కి స్పందించిన తాప్పీ.. ‘నేను చెబుతున్న.. ఈ లైన్ గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 23 వరకు వేచి ఉండు. నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను. మీకు ధన్యవాదాలు’ అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఈ విషయంలో ఆమె స్నేహితురాలు లక్ష్మీ మంచుతో పాటు ఎంతో మంది అభిమానులు ఈ బ్యూటీకి సపోర్టుగా కామెంట్స్ పెట్టారు. అయితే ఆమె సమాధానాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ట్రైలర్ గురువారం (సెప్టెంబర్ 23న) విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సినిమాని అక్టోబర్ 15న జీ5 యాప్‌లో విడుదల చేయనున్నారు. పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్ All I will say is…. Just remember this line and wait for 23rd September :) And advance mein THANK YOU I really worked hard for this compliment 🙏🏽 https://t.co/O5O8zMRzP0 — taapsee pannu (@taapsee) September 20, 2021 -
కొన్ని అనుభవాల సమాహారం...
‘నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికీ ఎందరో తారసపడుతూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి కొన్ని అనుభవాల సమాహారమే ఈ సినిమా’’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చెప్పారు. లక్ష్మీ మంచు, నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్, నాగశౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచాపనయ్, చైతన్యకృష్ణ ముఖ్య తారలుగా చాణక్య బూనేటి నిర్మించిన ‘చందమామ కథలు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ -‘‘ఇలాంటి కథతో సినిమా చేయడం మా వల్ల కాదు. ఈ చిత్రం చూశాక అద్భుతమైన సినిమా చూసినట్టనిపించింది. అందుకే ఈ సినిమా విడుదలలో మేం కూడా భాగస్వాములం అయ్యాం’’ అని తెలిపారు. ‘లెజెండ్’ తీసిన నిర్మాత మా సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉందని లక్ష్మీ మంచు చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేష్, అభిజిత్, కృష్ణుడు, ధర్మేంద్ర తదితరులు మాట్లాడారు.