జీవిత పాఠాలు...
జీవిత పాఠాలు...
Published Mon, Dec 9 2013 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
‘‘అనుభవాన్ని మించిన గురువు మనిషికి వేరే ఉండరు. జీవనక్రమంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలు వారికి పాఠాలు. ఆ పాఠాల పర్యవసానమే మా చందమామ కథలు’’ అన్నారు మంచు లక్ష్మి. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మంచు లక్ష్మి, చైతన్యకృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్ ప్రధాన పాత్రధారులుగా... చాణక్య బూనేటి నిర్మిస్తున్న చిత్రం ‘చందమామ కథలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఏం తీయాలనుకున్నానో... అది క్లారిటీతో తీశాను. ఈ నెల ద్వితీయార్ధంలో లోగోను ఆవిష్కరించి, జనవరిలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్‌లో షూటింగ్‌ని పూర్తిచేయగలిగామని నిర్మాత సంతృిప్తి వ్యక్తం చేశారు. ఇంకా నరేష్, కృష్ణుడు, అభిజిత్, నాగశౌర్య కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల.
Advertisement
Advertisement