Krishnudu
-
నటుడు కృష్ణుడు కూతురి హాఫ్సారీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
-
Yanamala Brothers: అన్నదమ్ముల అస్త్రసన్యాసం!
సాక్షి, కాకినాడ: ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. వరుస పరాజయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్య నేతలు సైతం వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలన ముందు మళ్లీ పోటీకి వెనుకంజ వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దయనీయ పరిస్థితులపై టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తు అంతా మనదేనంటూ ఊరూవాడా ప్రచారంతో హంగామా చేస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం యుద్ధానికి ముందే అ్రస్తాలు వదిలేస్తున్నారు. వరుస ఓటములకు తోడుగా భవిష్యత్తు ఫలితాలు కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుండటంతో రాజకీయ కురువృద్ధులు సైతం పునరాలోచనలో పడ్డారు. పోటీ అంటే ససేమిరా అంటున్నారు. నేరుగా ఈ విషయం చెప్పలేక చేస్తోన్న వ్యూహాత్మక వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. పోటీ చేయడానికి ధైర్యం చాలక కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఆ పార్టీలోని అసమ్మతి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు ముచ్చెమటలు టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా చలామణీ అయ్యే ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పక్షాన చక్రం తిప్పారు. తెర వెనుక రాజకీయాల్లో ఈయన్ను ఎదుర్కొనేందుకు చాలాకాలం రెండు గ్రూపులు కూడా నడిచాయి. అటువంటి నాయకుడికే వైఎస్సార్ సీపీ ప్రజా సంక్షేమ పాలనతో ముచ్చెమటలు పడుతున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం ఈ నాయకుడిని వెంటాడుతోంది. తాను పుట్టి పెరిగి, రాజకీయంగా ఇప్పుడున్న స్థాయికి కారణమైన సొంత నియోజకవర్గం తుని నుంచి..తాను, వరుసకు సోదరుడైన కృష్ణుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ శ్రేణులకు ఇటీవల రామకృష్ణుడు పరోక్ష సంకేతాలు పంపించారు. ఇవి నియోజకవర్గంతోపాటు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం తునిలో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా రామకృష్ణుడు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పడం గమనార్హం. 70 సంవత్సరాలు వయసు దాటింది.. కృష్ణుడికి కూడా కాస్త అటు ఇటుగా వయస్సు మీరింది..ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీచేసినా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తల సమావేశంలోనే యనమల ప్రకటించారు. రామకృష్ణుడి వ్యాఖ్యలను పార్టీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు అ న్వయించుకుంటున్నారు. యువకులకు అవకాశం కల్పించాలని తానే చంద్రబాబును కోరినట్టు, అందుకు ఆయన సరేనన్నట్టు కూడా ఈ నేత చెప్పుకొచ్చారు. సీనియారిటీ, వయసు మీరడమనేది రాజకీయాల్లో అసలు ప్రశ్నే కాదనే విషయం రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వారిని అడిగినా ఇట్టే చెబుతారు. టీడీపీలో అపర చాణుక్యుడిగా చెప్పుకునే యనమల అంత పెద్ద మాటలు మాట్లాడారంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ మాటల వెనుక మర్మం ఏమిటంటూ తెలుగు తమ్ముళ్లు ఎవరి స్థాయిలోవారు అంచనాలు వేస్తున్నారు. నాటి అరాచకాలు ఇంకా కట్టెదుటే.. అధికారంలో ఉన్నన్నాళ్లు తునిలో సాగించిన అరాచక పాలనతో యనమల సోదరులు ప్రజల ఛీత్కారానికి గురయ్యారు. రామకృష్ణులను వరుసగా మూడు పర్యాయాలు ఓడించిన తరువాత కూడా అక్కడి ప్రజలు గత జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చాలక రామకృష్ణుడు 2009 తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అయినా ఆశను వదులుకోలేక తన రాజకీయ వారసుడిగా (వరుసకు సోదరుడు) కృష్ణుడ్ని తుని నుంచి బరిలోకి దింపారు. రామకృష్ణుడి తరువాత వరుసగా రెండు పర్యాయాలు 2014, 2019లలో బరిలోకి దిగిన కృష్ణుడిని తుని ప్రజలు ఓడించారు. వరుస ఓటములు, గడచిన మూడున్నరేళ్ల జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన వెరసి తునిలో యనమల సోదరులకు రాజకీయ భవిష్యత్తు లేదనే అంచనాలే రామకృష్ణుడు నోటితో ఆ మాటలు పలికించాయనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ మాటలు సాకులే.. 1983 నుంచి వరుసగా రామకృష్ణుడు తునిలో ఆరు పర్యాయాలు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఓటమి తరువాత తుని నుంచి పోటీ చేసే సత్తా లేక చేతులెత్తేసి ఆయన ఇక్కడి రాజకీయాలకు దూరమయ్యారు. సందర్భోచితంగా బంధువులు, సన్నిహితుల శుభ కార్యాలకు రావడం తప్పితే సొంత నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలకు దాదాపు ముఖం చాటేశారని చెప్పొచ్చు. ఈ నాయకుడు ఇంత హఠాత్తుగా తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఒకవేళ పార్టీపై అభిమానంతో ఏర్పాటు చేశారనుకున్నా, వయసు మీరిందని సాకులు చెబుతూ యువకులకు అవకాశం కల్పించాలంటూ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏమై ఉంటుందా అనే కోణంలో కూడా తమ్ముళ్లు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గుకు రావడం కలే అనే నిర్థారణకు రావడంతోనే వయస్సును సాకుగా చూపిస్తున్నారని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో యనమల పలికిన నాలుగు పలుకులు టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఈ నటుడిని గుర్తుపట్టారా? హీరోగా రెండు సినిమాల్లో నవ్వించాడు!
తెరపై కనువిందు చేసే తమ అభిమాన నటీనటులు, హీరోహీరోయిన్లు చిన్నతనంలో, యుక్త వయసులో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు దొరికిన సెలబ్రిటీల ఫొటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో ఈ మధ్య సెలబ్రిటీలకు సంబంధించిన పలు పాత ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నా, సాయి పల్లవి, అంజలి, నిహారిక కొణిదెల, నాగార్జున ఇలా పలువురు స్టార్ హీరో హీరోయిన్ల ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో నటుడి త్రోబ్యాక్ పిక్ ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. అయితే ఈ నటుడు ఎవరో గుర్తుపట్టలేక నెటిజన్లు తంటాలు పడుతున్నారు. కొందరూ గుర్తు పట్టినప్పటికీ వారికి కూడా స్పష్టత రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ హీరో అంతగా ఛేంజ్ అయ్యాడు. ఇంతకి ఆ అతడేవరో మీరైనా గుర్తుపట్టారా? లేదా?.. అయితే ఆ నటుడు, హీరో ఎవరో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. పూల చొక్కా, నీట్‌గా క్రాఫ్ చేసుకుని స్టైల్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈయన ఎవరో కాదు నటుడు కృష్ణుడు. హీరో లాంటి లుక్, కండలు లేకపోయినా వినాయకుడి, విలేజ్‌లో వినాయకుడు వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించిన కథానాయకుడు అతడు. అంతేగాక పలు సినిమాల్లో సహా నటుడిగా, హీరోలకు స్నేహితుడిగా కూడా నటించాడు. ఇక బొద్దుగా తన అమాయాకపు మాటలతో తెరపై హీరోయిన్స్‌ను పడగొట్టిన కృష్ణుడిని ఇలా చూసి నెటిన్లంతా షాక్ అవుతున్నారు. దీంతో అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడంటూ తమ స్పందనను తెలుపుతున్నారు. అయితే అప్పుడు అంత సన్నగా హీరో లుక్‌లో ఉన్న కృష్ణుడు ఓ యాక్సిండెంట్ తర్వాత వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఇలా బొద్దుగా మారాడట. కృష్ణుడు సొంతూరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజోలు. సినిమాల్లో ఆడిషన్స్‌కు కోసం రాజోలులోని ఓ ఫొటో స్టూడియోలో తీయించుకున్న ఫొటో ఇది. యుక్త వయసులో సినిమాలకు రాకముందు హీరోలుక్లో ఉన్న కృష్ణుడు అవకాశాలు దొరికి సినిమాల్లోకి వచ్చేసరికి ఆయన శరీరాకృతిలో భారీ మార్పులు వచ్చాయి. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ View this post on Instagram A post shared by Alluri Krishnam Raju@ actor (@krishnudu) -
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో తెలుసా?
అభయం, చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో నెల కొనడం,దానం, దమం,యజ్ఞం,వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం, అహింస, క్రోధరాహిత్యం, త్యాగం, శాంతి, చాడీలు చెప్పకపోవడం, సర్వప్రాణుల యందు దయ కలిగిఉండడం,విషయ. వాంఛలు లేకపోవడం, మృదుత్వం, బిడియం, చపలత్వం లేకపోవడం, ద్రోహబుద్ధి, దురభి మానం లేకుండడం, తేజస్సు, క్షమాగుణం,శుచిత్వం మొదలైన సద్గుణాలు. దైవీ సంపత్తితో మూర్తీభవించి ఉంటాయి అని శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పేడు.ఈ సద్గుణాలు కేవలం అర్జునునకో లేక ద్వాపర యుగానికో పరిమితమైనవి కావు.ఈ సమస్త విశ్వంలో మానవజాతి ఉన్నంతవరకు సర్వులకు అవసరమే.ఎన్ని అధునాతన సాధన సంపత్తి వున్నా మానవుడు ప్రశాంత జీవితాన్ని గడప లేక పోతున్నాడు. ఎటు చూసినా హింస, క్రౌర్యం, అసంతృప్తి పెచ్చు పెరుగుతున్నాయి. మానవతా విలువలు లేని వ్యక్తి అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆత్మ నిగ్రహం లేని వాడు ఉన్నతమైన జీవితాన్ని పొందలేడు. క్షణభంగురమైన ఇంద్రియ సుఖాల కోసం పరుగులు తీస్తూ తన పతనానికి తానే కారణమౌతున్నాడు. మనిషి జీవిత ధ్యేయం ఇంద్రియసుఖానుభవం కాదు. ఇంద్రియాలను ఎప్పటికీ తృప్తి పరచ లేము. అగ్నిలో ఆజ్యం పోసినట్లు సుఖాలు అనుభవించే కొద్ది మరిన్ని కోరికల పుడ తాయి.కాని మనిషి తృప్తి చెందడు. మానవ జీవితానికి ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. అలా కాని పక్షంలో మానవుడు సర్వావస్థలయందు అసంతృప్తి కలిగే ఉంటాడు. మనిషిలో జ్ఞాన కాంక్ష పెరిగే కొద్దీ అతడు ఉన్నతంగా తీర్చబడతాడు. మన ఆలోచనా రీతిని బట్టే మన ఆచరణ ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టినప్పుడే మనిషికి నిజమైన శాంతి.'పరోపకారః పుణ్యయ పాపాయ పరపీడనం' ఎదుటి వాడికి ఉపరకారం చేయడం పుణ్యం అపకారం చేయడం పాపమని మన సనాతన ధర్మం నొక్కి వక్కా ణించింది. అనభిధ్య పరస్వేషు, సర్వ సత్త్వేషు హృదయం । కర్మ ణాం ఫలమస్తీత మనసా త్రితయంచరేత్ ॥ పరుల సొత్తుపై ఆశ లేకుండా ఉండడం, సర్వజీవులయందును కరుణ, కర్మ కు ఫలితం ఉండి తీరుతుందనే భావం ఈ మూడింటినీ మనస్సులో ఉంచుకొని ప్రవర్తించాలని మనుస్మృతి చెబుతుంది. - గుమ్మా ప్రసాద రావు -
139 మంది అత్యాచారం కేసు: కృష్ణుడు స్పందన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘139 మంది అత్యాచారం’ కేసుపై హీరో కృష్ణుడు స్పందించారు. అత్యాచార కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు మీడియా ముఖంగా చెప్పిందని గుర్తు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలే మీడియా ముఖంగా చెప్పిందన్నారు. (చదవండి : 139 మంది అత్యాచారం కేసులో ట్విస్టు) సంబంధం లేని విషయాల్లో తమను ఇరికించి పరువు తీస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై ఆరోపణలో రాగానే సోషల్ మీడియాలో వపరీతంగా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. తమకు కుటుంబం, పిల్లలు ఉన్నారని, ట్రోల్ చేసే వాళ్లు ఇది గుర్తించుకోవాలన్నారు. నిజాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఆపద ఉంటే 100కు డయల్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. బాధితురాలికి తమ తరపున ఎలాంటి సహాయం కావాలన్న తాము సిద్దంగా ఉన్నామని కృష్ణుడు పేర్కొన్నారు. (చదవండి : యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’) కాగా, తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల పంజాగుట్ట పోలీసులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో సినీ సెలబ్రిటీలు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేరు కూడా ఉండగా.. వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆ బాధితురాలు ఈ కేసుతో సెలబ్రిటీలకు సంబంధం లేదని తెలిపారు. డాలర్ బాయ్ తనను బెదిరించి, వారి పేర్లు ఎఫ్ఐఆర్ చేర్చమని ఒత్తిడి తెచ్చాడని వివరించారు. -
కృష్ణుడిని అభినందించిన ప్రభాస్
వినాయకుడు ఫేమ్ కృష్ణుడు తొలిసారి నిర్మిస్తున్న చిత్రం ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుక్రవారం ఆవిష్కరించారు. నిర్మాతగా మారిన కృష్ణుడికి అభినందనలు తెలిపారు. నిర్మాతగా అతను సక్సెస్ అవ్వాలని ప్రభాస్ ఆకాక్షించారు. ఇక నిత్యా క్రియేషన్స్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సెన్సార్ కార్య్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. ‘నా కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాను. ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సినిమా అందరికి నచ్చే కంప్లీట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్. సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’అని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు కృష్ణుడు. -
నిర్మాతగా కృష్ణుడు
‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల్లో కథానాయకుడిగా, పలు చిత్రాల్లో చేసిన కీలక పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు నిర్మాతగా మారారు. తన కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించారాయన. లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కృష్ణుడు నిర్మించిన సినిమా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ –‘‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా మా చిత్రం ఉంటుంది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు.. ఇప్పుడు నిర్మాతగా నా ప్రయాణాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
నిర్మాతగా వస్తున్న కృష్ణుడు
‘వినాయకుడు’,‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ప్రచార చిత్రాలు విడుదల చేయనున్నారు. (చదవండి : మరోసారి తమిళదర్శకుడితో మహేష్‌బాబు!) ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉంటుంది. కొత్త కథ, కథనాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా’అని అన్నారు. ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. -
నటుడు కృష్ణుడు ఇంట విషాదం
సాక్షి, పశ్చిమగోదావరి: సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణుడు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి అల్లూరి సీతారామరాజు సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా భీమవరం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సీతారామరాజు సోమవారం మరణించారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు, పార్టీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు వినాయకుడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అలరించిన కృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
సాక్షి, విజయనగరం రూరల్: కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడని, ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, రాష్ట్రంలో వచ్చేది రాజన్న రాజ్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీనటుడు ఫృథ్వీ, సిని హీరో కృష్ణుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా జిల్లా పర్యటనకు వచ్చిన ఫృథ్వీ, కృష్ణుడు, జోగినాయుడు, సినీ, టీవీ ఆర్టిస్టుల బృందం పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫృథ్వీ మాట్లాడుతూ జననేత జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు ఐదు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నాడన్నారు. ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహాకూటమి అని తెలంగాణలో పోటీ చేసి డిపాజిట్లు గల్లంతు చేసుకున్న చంద్రబాబు, రాష్ట్రంలో ఎన్నికల వేళ మాయాకూటమిని కట్టాడన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని గెలిపించాలన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులన్నారు. జిల్లాలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని సినీ నటుడు కృష్ణుడు అన్నారు. విజయనగరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని కోటలో రాణి కావాలో, ఎళ్లవేళలా తోడుండే ప్రజల నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరోయే తప్ప రియల్ హీరో కాదన్నారు. మరో సినీ, టీవీ నటుడు జోగినాయుడు మాట్లాడుతూ కోటల్లో మహారాణులను కాదు మనకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోండని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలకు పొడిచిన వెన్నుపోటుపై ఫృథ్వీ, నటులు ఆలపించిన గేయం ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణతేజ, వర్మ, ఈశ్వర్ కౌషిక్, రాంపండు, తవిటిరాజు, కనకల ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్‌కు మహిళలే అండ నెల్లిమర్ల: వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలే అండ అని ప్రముఖ సినీ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేటలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పృథ్వీరాజ్ తన బృందంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇదిలా ఉంటే వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకు కేఏ పాల్ని తీసుకొచ్చి, ప్రజాశాంతి పార్టీ తరఫున ఒకేలాంటి పేరుగల అభ్యర్థులను పోటీకి నిలబెట్టారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ప్రముఖ నటులు కృష్ణుడు, జోగినాయుడు మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, మండల శాఖ అధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, కె.హర్షవర్ధన్ పాల్గొన్నారు. -
‘బాబు మోసపూరిత హామీలను నమ్మొద్దు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే మోసపూరిత హామీలను, మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పృథ్వి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సాహితీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నటులు జోగినాయుడు, కృష్ణుడులతో కలిసి ఆయన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు .. మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. ఫీజురియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నాశనం చేశారన్నారు. నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో చేతులు కలిపి స్పెషల్ ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మోదీ మంచివాడు కాదని అంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజలకు ఎంతో మేజు చేస్తాయన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడుని, విజయనగర పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. -
‘ఫిరాయింపులకు చెంప పెట్టులా ఉండాలి’
విజయనగరం: ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బొబ్బిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని గెలిపించడం ద్వారా ఫిరాయింపు రాజకీయాలకు చెంప పెట్టులా సమాధానం చెప్పాలని సినీ నటులు పృధ్వీ, కృష్ణుడు, జోగినాయుడు బృందం ప్రజలను కోరింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సినీ నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు పృద్వీ, కృష్ణుడు ప్రసంగిస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని పార్టీలు తెలుగు దేశం గొడుగు కిందకు చేరాయని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ని మోసం చేయడానికి కలిసికట్టుగా కొమ్ము కాస్తున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఢిల్లీలో గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఏవిధంగా క్లీన్ స్వీప్ చేసిందో అధే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్సార్సీసీ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. -
అన్నబాటలో
-
వైఎస్సార్సీపీలో చేరిన జోగినాయుడు
-
వైఎస్సార్సీపీలో చేరిన జోగినాయుడు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైఎస్సార్సీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. నటులు పృథ్వి, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్సీపీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదిరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు చివరికి దోచుకోవడానికి ఏమిలేక ఓట్లు కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
టీడీపీ వైఫల్యాలను ఎండగడతాం: పృథ్వీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు పృథ్వీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు రూ.10కోట్ల విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ఆయన ...ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ధర్మపోరాట దీక్షలంటూ చేస్తున్న హడావుడిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన సినీ నటుడు కృష్ణుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం తన సాయశక్తుల కృషిచేస్తానని తెలిపారు. టీడీపీ దీక్షలకు టీడీపీ నాయకులు మాత్రమే వస్తారని, తమ దీక్షకు జెండా మోసే కార్యకర్తలొస్తారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలన్నీ చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించబోతున్నామని తెలిపారు. తమ కళాకారుల బృందం ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ పథకాలు ఎందుకు రాలేదో ప్రశ్నిస్తుందన్నారు. ‘మందులోడా.. ఓ మాయలోడా’ అంటూ ప్రచారం సాగిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. త్వరలో దివంగత నటుడు దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ కూడా తమతో కలుస్తారని పృథ్వీ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సినీ నటుడు కృష్ణుడు తెలిపారు. పృథ్వీకి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన స్వాగతించారు. -
పాదయాత్ర సక్సెస్‌కు కారణం అదే: పృథ్వీ
సాక్షి, ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని సినీ నటుడు పృథ్వి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరో నటుడు కృష్ణుడుతో కలిసి ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. మహానేత వైఎస్సార్ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్ వెంట నడిచారని వెల్లడించారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్వి గుర్తు చేశారు. చంద్రబాబు విఫలం: కృష్ణుడు టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని నటుడు కృష్ణుడు అన్నారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యల గురించి చెప్పుకున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రతో వైఎస్ జగన్ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం వైఎస్సార్ కుటుంబం ఎంతో చేసిందన్నారు. -
మానవ ధర్మమే మన ధర్మం
సాంఖ్యయోగంలో శ్రీ కృష్ణుడు సర్వాంతర్యామియైన ఆత్మ గురించి తెలుసుకున్న వారు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారని తెలియజేశాడు. అంటే, ఆ ఆత్మ ఒక విచిత్రమైన, అర్థమయ్యీ కానట్టుండే విషయమని అర్థం చేసుకోవచ్చు. కారణం, అది విశ్వవ్యాప్తమై అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది. నక్షత్రాలు, నక్షత్రమండలాలే కాకుండా వాటి ఉత్పత్తులైన కాంతి, శబ్దం, అంతరిక్షం, ఆకాశం లాంటి వాటన్నింటికీ ఉత్పన్నకారకమై, తిరిగి తానే లయకారకమవడం వింతగా కనిపిస్తుంది. ఈ ఖగోళపదార్థాలేవీ శాశ్వతం కావని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా నిరూపిస్తోంది. అంటే, ‘యదృశ్యతి తన్నశ్యతి’– కనిపించేవన్నీ నశించేవే! మరి నశించనిది ఏంటంటే మనం చెప్పుకునే ఆత్మ లేక అనంతమైన శక్తి మాత్రమే. ఆధునిక వైజ్ఞానికులు చెప్పిన శక్తి నిత్యత్వ నియమం’ ప్రకారం శక్తిని సృష్టించలేము, నశింప చేయలేము కానీ, శక్తి రూపాలను మాత్రం మార్చగలము. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు అనేకమార్లు, అనేక విధాలుగా ఘోషించినా, వాటిల్లో ‘కఠోపనిషత్తు’ రెండవ అధ్యాయం లోని 18 వ శ్లోకాన్ని చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆత్మ జన్మించడం లేదు, మరణించడం లేదు. ఇది దేని నుండి రూపొందినది కాదు. ఎన్నటికీ ఉండేది, సనాతనమైనది, శరీరం నశించినా నశించనిది. ఈ శ్లోక భావననే ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పిన ‘శక్తి నిత్యత్వ నియమం’ కూడా చెప్తుంది. ఈ శ్లోకం సిద్ధాంతాల మధ్య భేదం ఏమీ కనిపించదు. ఇక్కడ శరీరమనేదాన్ని కనిపించే అన్ని పదార్థాలుగా చెప్పుకోవచ్చు. అంతటితో ఆగకుండా కఠోపనిషత్తు ఈ ఏకాత్మ గురించి పరిపరివిధాలుగా విశ్లేషించింది. ఇంద్రియాలు గ్రహించగల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నింటికీ అతీతమైన, అవినాశియైన, ఆద్యంత రహితమైన, బుద్ధికన్నా శ్రేష్ఠమైన, సుస్థిరమైన భగవంతుని లేదా ఏకాత్మను లేదా అనంతమైన శక్తిని అనుభూతితో గ్రహించాలని తెలియజేస్తోంది. ఈ శక్తి అనంతమైనది అంటోంది. అంటే ఈ శక్తి స్థలం మిగల్చకుండా వ్యాపించి ఉంది కాబట్టి, దానికి రూపం లేదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులన్నింటికీ అతీతమైనది. అంటే ఈ అనంతమైన శక్తికి రంగు, రుచి, వాసన, ఆకృతి, స్పర్శ మొదలైన పదార్థ స్వభావాలు ఏమీ లేవని అర్థం. ఇంద్రియాలు అట్టి శక్తిని చూడలేవు, తెలుసుకోలేవు. అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి, అలాగే అర్థం చేసుకుందాం. దాని నుండి ఉద్భవించిన మనతో కలిపి కనిపించేవన్నీ తిరిగి దానిలోకే వెళ్తాయి. కాబట్టి, అశాశ్వతమైన ఆకృతుల పట్ల ఆశ పెంచుకోవడం, ద్వేషించటం తగనిది. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు ఎవరు సకల జీవరాశులను ఆత్మలోను, ఆత్మను సకల జీవరాశులలోనూ దర్శిస్తాడో అతను ఎవరినీ ద్వేషించడని నిర్ధారిస్తోంది. అందుచేత, ఇతర పదార్థాలు అంటే గ్రహాలు, నక్షత్రాలే కాకుండా చెట్టూచేమ, పశుపక్ష్యాదులు ఏవిధంగానైతే తమ తమ ధర్మాల రీత్యా మాత్రమే కర్మలను ఆచరిస్తూ, శాంతియుతంగా మనుగడ సాగిస్తూ ఉన్నాయో అదేవిధంగా మనం మానవధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అదే జీవిత పరమావధి. – రావుల గిరిధర్ -
జగన్ అనే నేను.. అనే మాటకోసం...
అనంతపురం, గుమ్మఘట్ట : ‘నువ్వు హీరో అవుతావా? సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం కూడా నీకు సాధ్యం కాదని అందరూ నవ్వుకున్నారు. సినిమా రంగాన్ని ఇంటిలోనూ అసహ్యించుకునేవారు. ఇలా చీదరించుకున్న వారంతా ఈ రోజు అభిమానించే స్థాయికి స్వశక్తితో ఎదిగా’నని ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు తెలిపారు. క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చిన ఆయన తన సినీ రంగ ప్రవేశం.. రాజకీయ అరంగేట్రం తదితర అంశాలపై ‘సాక్షి’తో ముఖాముఖి. మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా? ♦ మాది తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామం. అమ్మా, నాన్న సావిత్రి, సీతరామరాజు. వ్యవసాయం చేసేవారు. నాతో పాటు తమ్ముడు సుబ్రమణ్యం రాజు, చెల్లి విజయలక్ష్మి ఉన్నారు. చిన్న వయసులోనే చదువు కోసం వైజాగ్ సమీపాన గుడిలోవా బంధువుల గ్రామం చేరాం. ఐదేళ్ల కిత్రం ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేసుకున్నా. మాకు ఒక అమ్మాయి. సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది..? ♦ గుడిలోవా గ్రామంలోని విజ్ఞానవిహార్ పాఠశాలలో చదువునేటపుడు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు పాఠశాల వార్షికోత్సవ సమయంలో రాముడి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. తొలిసారి ముఖానికి రంగువేశా. వైజాగ్, బెంగళూరు ప్రాంతాల్లో పాలిటెక్నిక్ పూర్తిచేశా. సినీ రంగంలో అడుగుపెట్టి హీరోగా నటించి తీరాలని కసితో 12 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య నా ప్రయాణం సాగింది. సంతృప్తినిచ్చిన పాత్ర ఏది? ♦ వినాయకుడు సినిమాలో ‘వినాయకుడి’ పాత్ర నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ పాత్ర ప్రేక్షకుల్లో ఎంతో ఆదారాభిమానం చూరగొంది. ఈ చిత్రాన్ని ఎన్నటికీ మరచిపోలేను. ఇప్పటి దాకాఎన్ని చిత్రాలు నటించారు.. ♦ హీరోగా, సహనటునిగా దాదాపు వంద చిత్రాలు తెలుగులో చేశా. అందులో విలేజ్‌లో వినాయకుడు, వినాయకుడు, ఓయ్, ఏమాయ చేశావే తదితర చిత్రాల్లోని పాత్రలు నాకు మంచి గుర్తింపు తెచ్చాయి. మీ అసలు పేరు ఏమిటి..? ♦ నా అసలు పేరు కృష్ణంరాజు. ఈ పేరుతో ఇప్పటికే ఒక గొప్ప హీరో ఉన్నారు. అందుకని నేను సినీరంగ ప్రవేశం చేయగానే కృష్ణుడిగా పేరు మార్చుకున్నా. మీ జీవితంలో మలుపుతిప్పిన ఘటన.. ♦ బాల్యం నుంచే సినిమా హీరో కావాలనుకునేవాడిని. 20 ఏళ్ల వయసులో బైక్ యాక్సిడెంట్ జరిగింది. కుడికాలు పూర్తిగా దెబ్బతినింది. అప్పుడు మూడేళ్లపాటు బెడ్‌రెస్ట్. ఇక నాజీవితం ఇంతేనేమో.. అనుకున్న లక్ష్యం చేరుతానో లేదోనని ఆందోళన చెందాను. నా బాధ చూసి తమ్ముడు, చెల్లి, స్నేహితులు ఓదార్చేవారు. ఆ సమయంలోనే అధికంగా బరువు పెరిగిపోయాను. లావుగా ఉన్నందున నాకు సహనటుడుగా అవకాశం దక్కింది. తర్వాత డైరెక్టర్ కిరణ్‌సాయి సహకారంతో హీరోగా అవకాశం వచ్చింది. రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఏమిటి..? ♦ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వ పటిమ చూసి ఇష్టపడ్డా. ప్రజలే తన ఊపిరిగా.. కుటుంబంగా అలుపెరుగకుండా వారి కోసం ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయడం చూసి చలించిపోయా. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పేదల కష్టాలను కళ్లారా చూసి.. వారి కోసం ఆయన ఇస్తున్న హామీలు, సంక్షేమ పథకాల రూపకల్పన నచ్చాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నా. వైఎస్సార్సీపీలో చేరా. ప్రేక్షకాదరణ ఎలా ఉంది? ♦ బొద్దుగా ఉన్న నన్ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరును ఎన్నటికీ మరచిపోలేను. నిజంగా వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. హ్యాపీడేస్ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా రీలిజ్ తర్వాత రాజమండ్రికి వెళ్లా. ‘అప్పుడు చాలాబాగా నటించారు.. బొద్దుగా ముద్దొచ్చేలా ఉన్నావం’టూ ప్రేక్షలు చెప్పడం చూస్తే నిజంగా సంతోషమేసింది. ఆటలంటే ఇష్టమా..? ♦ క్రికెట్ అంటే నాకు చచ్చేంత ప్రాణం. సచిన్ బ్యాటింగ్‌ను ఎంతగానో ఇష్టపడుతా. క్రికెట్ ఆడే వారికి నా ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నా. ‘అనంత’తో మీకున్న అనుబంధం ♦ రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన కుమారుడు ప్రవీణ్‌రెడ్డి నాతో అన్యోన్యంగా ఉంటాడు. నేను అభిమానించే ఫ్యామిలీలో కాపు కుటుంబం కూడా ఒకటి. గొప్ప మనసున్న నాయకుడు కాపు. ప్రజాసంకల్ప యాత్రపై మీ స్పందన? ♦ ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ సూపర్బ్. ఎండనక.. వాననక.. పాదయాత్ర చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇటీవల ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నా. ‘మీకేమన్నా ఇంత కష్టం’ అని అడిగితే.. ‘నాన్నలా మంచి చేసి... పేరు సంపాదించుకోవాలి. పేదల కష్టాలు తొలగించటమే నా ధ్యేయం’ అని చెప్పారు. ఎంతటి గొప్ప మనసు జగనన్నది. జగన్ అనే నేను.. అనే పదం కోసం నాతో సహా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన నటుడు కృష్ణుడు
-
‘అందుకే వైఎస్సార్ సీపీలో చేరా’
సాక్షి, కత్తిపూడి : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆకర్షితుడై సినీ నటుడు కృష్ణుడు వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్ జగన్ సమక్షంలో నటుడు కృష్ణుడు వైఎస్సార్ సీపీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. జననేత వైఎస్ జగన్ పాదయాత్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్సార్ సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు.. నటుడి ఆవేదన!
సాక్షి, హైదరాబాద్ : ఆవేశంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీరెడ్డిని దూషిస్తూ.. బెదిరిస్తూ.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. పవన్‌కు, ఆయన తల్లికు సారీ చెప్పారు. ఇదిలా ఉండగా.. పలు సినిమాల్లో హీరోగా నటించిన ప్రముఖ నటుడు కృష్ణుడు కూడా ఫేస్బుక్లో ఈ వివాదంపై స్పందించారు. పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల విషయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించాలి అంటూ ఆవేదనగా ఆయన ఒక పోస్టును షేర్ చేశారు. ‘ఇవాళ పవన్ కళ్యాణ్ ని అన్నది, రేపు మిమ్మల్ని అంటుంది. మీరు స్పందించండి, అక్కడ పవన్ కళ్యాణ్‌ని అనలేదు, పవన్ తల్లిని అసభ్యంగా అన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. రేప్పొద్దున పెద్ద సినీ రచయితలు, దర్శకులు, ప్రొడ్యూసర్ల అమ్మల్ని, అక్కల్ని అనడానికి కూడా ఆమె ఏమాత్రం ఆలోచించదంటూ పేర్కొన్నారు. ‘మా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ, కళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ గళం విప్పండి. సహనంతో ఉండే సమయం మించిపోయింది. ఓపికగా ఉండే హద్దులు పగిలిపోయాయ్. ఇక అడుగేయండి, ఒకే ఒక్క అడుగు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘అభిమానులూ స్పందించండి.. ఇవాళ మా హీరో, రేపు మహేష్ ఫాన్స్, ఎల్లుండి ప్రభాస్ ఫాన్స్, ఆ తర్వాత తారక్ ఫాన్స్, వదిలేస్తే మీదాక కూడా వస్తుంది. మీ హీరో మా హీరో కాదు, మన సిన్మావాళ్ళు. మన ఇండస్ట్రీ గుర్తుంచుకోండి’ అని పేర్కొన్నారు. ‘స్త్రీల గౌరవం కోసం పోరాడే మహిళా సంఘాలు ఎక్కడికి పోయాయి?? పవన్ కళ్యాణ్ అమ్మ కూడా ఒక స్త్రీనే! ఒక స్త్రీ గౌరవం కోసం స్పందించకపోతే మీరు చేసే పోరాటానికి అర్థమేముంది? ప్రేక్షకులు, ప్రజలు కూడా స్పందించండి సినిమా వాళ్ళు ఏ ఆదివారమో, నెలకోసారో నువ్వూ నీ ఫ్యామిలీ సరదాగా హాల్ కెళ్తే మిమ్మల్ని నవ్వించే, ఆనందంగా ఇంటికిపంపించే సినిమా వాడు కదా మీరు కూడా స్పందించండి. ఇప్పుడు నాకు భాస్కరభట్ల గారి మాటలు గుర్తొస్తున్నాయి. 'సరదాగా మీరంతా మా సినిమాలే చూస్తారండి. అయినా మేమంటే ఓ చిన్న చూపులేండి!'’ అని కృష్ణుడు పేర్కొన్నారు. అయితే, మిహిరా అని చివర్లో రాయడంతో ఇది ఆ వ్యక్తి రాసిన షేరింగ్ పోస్ట్ అని తెలుస్తోంది. -
అమ్మ ప్రేమ గొప్పది
‘‘తెలుగు గానా, తెలంగాణ అంటే ఇష్టం. హైదరాబాద్, అమరావతి కూడా చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం’’ అని కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల అన్నారు. కృష్ణుడు, సన ప్రధానపాత్రల్లో పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మకు ప్రేమతో’. ఈ సినిమా పోస్టర్ని రాందాస్ అత్వాల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అమ్మకు ప్రేమతో’ మంచి టైటిల్. ఈ సినిమా సక్సెస్ కావాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కేసీఆర్‌గారికి మద్దతు కూడా ప్రకటించాను’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో మంచి మనిషి, నిరంతరం ప్రజా సేవకై పాటుపడే వ్యక్తి రాందాస్ అత్వాలగారిని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్(టి.ఎఫ్.సి.సి) తరఫున సత్కరించడం గర్వంగా ఫీలవుతున్నాం. టి.ఎఫ్.సి.సి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మందికి హెల్త్ కార్డులు అందించాం. భవిష్యత్‌లో మరిన్ని పథకాలను రాందాస్ గారిద్వారా సాధిస్తాం’’ అన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలి
– బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కష్ణుడు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కష్ణుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, బీసీ ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లకు కావాల్సిన చదువుకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని అన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించేందుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కష్ణయ్యతో అసెంబ్లీలో చర్చించి రద్దు చేసేందుకు రాష్ట్ర శాఖ కషి చేస్తుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, గురుప్రసాద్, సదాశివుడు, సత్యం, రవి, రాజు, రాఘవేందర్, శివకుమార్ పాల్గొన్నారు. -
రాధ అనన్యభక్తి
జ్యోతిర్మయం ఓ ధనిక దంపతుల కథ చెప్తాడు సాధు వాస్వానీ. వారిద్దరికీ ఒకరి ఎడల మరొకరికి గొప్ప ప్రేమ. ఇద్దరూ ఒక స్టీమర్లో ప్రయాణిస్తుండగా నీటిలో మునిగింది. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు గ్రామాలకు చేరారు. భార్య ఎంతగానో దుఃఖించింది. భర్త విచార గ్రస్తుడై భార్యకై వెతకనారంభించాడు. ఓ రాత్రి భర్తకు వచ్చిన స్వప్నంలో తన భార్య కని పించాలంటే ఉత్తరం వైపు వెళ్లమని సూచన వచ్చింది. ఆ సూచనను అనుసరించి ఒక గ్రామానికి వెళితే, ఊరి వారు ఆ ఊరికి కొత్తగా వచ్చిన స్త్రీని గురించి చెప్పు కుంటున్నారు. ఆవిడ నివసిస్తున్నట్లు చెప్పిన గుడిసె వద్దకు వెళ్లి ఆ భర్త తలుపు తట్టాడు. పేరు పెట్టి పిలిచే సరికి, భర్త కంఠ స్వరాన్ని గుర్తుపట్టి, ఆమె వెంటనే తలుపు తీసి అతడితో మళ్లీ ఏకమయింది. ‘భగవంతుడు మనందరికీ శాశ్వతమైన భర్త. మన హృదయ కవాటాన్ని సతతం తట్టుతూనే ఉంటా డు. కానీ మనం లేచి, ఆ తలుపు తీయాలని అను కోము. మనమందరం వేరుపడి బతుకుతుంటాం. ప్రేమ కొద్దీ కార్చే కన్నీరు, అతడికై మనం పడే తహ తహ ఒక్కటే భగవంతుడికి దగ్గర తోవ.’ అని గద్గద స్వరంతో చెప్పేవారు వాస్వానీ. సాధు వాస్వానీ జీవితమంతా ఈ ప్రేమ మార్గాన్ని బోధించారు. ‘చిన్ని కృష్ణుడికి జ్వర మొచ్చింది’ అనే కథ అదే. ఏమందూ ఆ జ్వరాన్ని తగ్గించలేకపోయింది. ఆందోళన చెందిన యశోద ‘కృష్ణా! నీ జ్వరమేమిటో అంతుబట్ట టం లేదు. ఇది ఎట్లా తగ్గుతుందో, త్రిలోకాల పాలకు డివైన నీవే చెప్పాలి’ అని వేడుకున్నది. ‘నన్ను అమితం గా ప్రేమించే భక్త శిఖామణి పాదధూళి నా నుదురుకు రాస్తే, తగ్గిపోతుంది’ అన్నాడు కృష్ణుడు. ఊరినిండా కృష్ణుని ప్రేమించే గోపికలు ఉన్నారు. యశోద ఒక గోపిక ఇంటికి వెళ్లింది. ఆ గోపిక ‘ప్రాణ మైనా ఇస్తాను కానీ, పాదధూళి భగవంతుడి నుదు రుకు రాయడానికి ఇచ్చేటంతటి పాపం చేయలేను. అలాంటి వారు నేరుగా నరకానికి వెళ్తారు’ అంటుం ది. ఎవరి వద్దకు వెళ్లినా ఇలాంటి సమాధానాలే. చివ రకు యశోద, రాధ వద్దకు వెళుతుంది. రాధ, ఉత్సా హంగా ‘నాకున్నదంతా ఆ కృష్ణుడిదే. నా తల తీసు కున్నా సరే, పాదధూళి తీసుకున్నా సరే’ అంటుంది, ఆ మహా ప్రేమికురాలు. ఆశ్చర్యపోయిన యశోద, ‘రాధా! ఈ పాదధూళి ఇచ్చిన వారు నరకానికి వెళతారని శాస్త్రాల్లో ఉంది’. అంటుంది. అయినా రాధ ‘నా కృష్ణుడికై నన్ను ఏ నర కంలోకి తోసినా సంతోషంగా వెళ్తానమ్మా. నా పాద ధూళి తీసుకువెళ్లి, కృష్ణుడికి జ్వరం తగ్గించు’ అంది. యశోద పాదధూళి తీసుకొని బయలు దేరు తుంది. బాలకృష్ణుడప్పటికే లేచి, అల్లరిలో నిమగ్నమై ఉన్నాడు. జ్వరం కేవలం ‘లీల’ అయి ఉండాలి. ఆనాటి నుండి, కృష్ణుడికి రాధ అంత ప్రియమైన మనిషి ఎందు కయిందని ప్రశ్నించిన వారు లేరు. నీలంరాజు లక్ష్మీప్రసాద్