
కుమార్తె నిత్యతో కృష్ణుడు
‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల్లో కథానాయకుడిగా, పలు చిత్రాల్లో చేసిన కీలక పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు నిర్మాతగా మారారు. తన కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించారాయన. లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కృష్ణుడు నిర్మించిన సినిమా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ –‘‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా మా చిత్రం ఉంటుంది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు.. ఇప్పుడు నిర్మాతగా నా ప్రయాణాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment