బుచ్చిబాబు గీతాలాపన | buchi babu movie songs | Sakshi
Sakshi News home page

బుచ్చిబాబు గీతాలాపన

Published Sat, Oct 26 2013 1:32 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

బుచ్చిబాబు గీతాలాపన - Sakshi

బుచ్చిబాబు గీతాలాపన

ఎడిటర్ రాజు దర్శకత్వంలో కృష్ణుడు, వేణుగోపాల్‌రెడ్డి, శివ, జ్యోత్స్న, విన్నీ ముఖ్య తారలుగా తలుపులమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పాలటి శ్రీనివాసరావు, కాదంబరి కిరణ్, నరసింహారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బుచ్చిబాబు’. ఈ సినిమా పాటల సీడీని హైదరాబాద్‌లో జీవితారాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘నిర్మాతలకు, యూనిట్ అందరికీ ఈ సినిమా మంచి భవిష్యత్తుని ప్రసాదించాలి’’ అని ఆకాంక్షించారు. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు దగ్గర అసిస్టెంట్‌గా పని చేశానని, దర్శకునిగా తనకిది తొలిచిత్రమని రాజు తెలిపారు. చక్కని పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు నీరజ్ కోట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా వీరశంకర్, ప్రసన్నకుమార్, శివనాగేశ్వరరావు, చలపతిరావు, దేవీప్రసాద్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement