buchi babu cricket tournment
-
బుచ్చిబాబు గీతాలాపన
ఎడిటర్ రాజు దర్శకత్వంలో కృష్ణుడు, వేణుగోపాల్‌రెడ్డి, శివ, జ్యోత్స్న, విన్నీ ముఖ్య తారలుగా తలుపులమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పాలటి శ్రీనివాసరావు, కాదంబరి కిరణ్, నరసింహారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బుచ్చిబాబు’. ఈ సినిమా పాటల సీడీని హైదరాబాద్‌లో జీవితారాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘నిర్మాతలకు, యూనిట్ అందరికీ ఈ సినిమా మంచి భవిష్యత్తుని ప్రసాదించాలి’’ అని ఆకాంక్షించారు. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు దగ్గర అసిస్టెంట్‌గా పని చేశానని, దర్శకునిగా తనకిది తొలిచిత్రమని రాజు తెలిపారు. చక్కని పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు నీరజ్ కోట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా వీరశంకర్, ప్రసన్నకుమార్, శివనాగేశ్వరరావు, చలపతిరావు, దేవీప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
హైదరాబాద్ ఓటమి
చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. హర్యానా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 62 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 38 ఓవర్లలో ఆరు వికెట్లకు 215 పరుగులు చేసింది. భారత జట్టు మాజీ కెప్టెన్ అజయ్ జడేజా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. నింపాదిగా ఆడిన ఈ హర్యానా కెప్టెన్ రెండు బౌండరీల సహాయంతో 37 పరుగులు చేశాడు. నాలుగో వికెట్‌కు ఓపెనర్ సన్నీ సింగ్‌తో కలిసి 75 పరుగులు జోడించాడు. అనంతరం హైదరాబాద్ 37.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంక్షిప్త స్కోర్లు హర్యానా ఇన్నింగ్స్: 215/6 (38 ఓవర్లలో) (సన్నీ సింగ్ 82, నితిన్ సైని 36, అజయ్ జడేజా 37, సి.వి.మిలింద్ 2/42, అన్వర్ ఖాన్ 2/45) హైదరాబాద్ ఇన్నింగ్స్: 153 ఆలౌట్ (37.3 ఓవర్లలో) (హనుమ విహారి 45, అమోల్ షిండే 32, ఆశిష్ హుడా 3/12, కుల్దీప్ హుడా 2/34, సంజయ్ బుధ్వార్ 2/47, రాహుల్ తెవతియా 2/20).