139 మంది అత్యాచారం కేసు: కృష్ణుడు స్పందన | Hero Krishnudu Respond On Panjagutta Woman Molestation Case | Sakshi
Sakshi News home page

నిజాలు తెలుసుకోకుండా ట్రోల్‌ చేశారు : కృష్ణుడు

Published Mon, Aug 31 2020 6:01 PM | Last Updated on Mon, Aug 31 2020 7:41 PM

Hero Krishnudu Respond On Panjagutta Woman Molestation Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘139 మంది అత్యాచారం’ కేసుపై హీరో కృష్ణుడు స్పందించారు. అత్యాచార కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నిజాలు తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ ట్రోల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు మీడియా ముఖంగా చెప్పిందని గుర్తు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలే మీడియా ముఖంగా చెప్పిందన్నారు.
(చదవండి : 139 మంది అత్యాచారం కేసులో ట్విస్టు)

సంబంధం లేని విషయాల్లో తమను ఇరికించి పరువు తీస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై ఆరోపణలో రాగానే సోషల్‌ మీడియాలో వపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. తమకు కుటుంబం, పిల్లలు ఉన్నారని, ట్రోల్‌ చేసే వాళ్లు ఇది గుర్తించుకోవాలన్నారు. నిజాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఆపద ఉంటే 100కు డయల్‌ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. బాధితురాలికి తమ తరపున ఎలాంటి సహాయం కావాలన్న తాము సిద్దంగా ఉన్నామని కృష్ణుడు పేర్కొన్నారు.
(చదవండి : యాంకర్‌ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’)

కాగా, తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల పంజాగుట్ట పోలీసులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో సినీ సెలబ్రిటీలు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేరు కూడా ఉండగా.. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆ బాధితురాలు ఈ కేసుతో సెలబ్రిటీలకు సంబంధం లేదని తెలిపారు. డాలర్ బాయ్‌ తనను బెదిరించి, వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌ చేర్చమని ఒత్తిడి తెచ్చాడని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement