హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి.. | Fake Baba Abuse On New Bride In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి..

Published Wed, Aug 30 2023 9:05 AM | Last Updated on Wed, Aug 30 2023 9:40 AM

Fake Baba Abuse On New Bride In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా, ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు.

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో దారుణ  ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రీట్మెంట్ నెపంతో నవ వధువుపై నకిలీ బాబా లైంగిక దాడికి పాల్పడ్డాడు. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలోని బజార్ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు.

నవ వధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించిన బాబా.. అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. విషయం బయటికి పొక్కడంతో నకిలీ బాబా పరారయ్యాడు. అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా, ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు.

తల్లిదండ్రుల సహాయంతో భవాని నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు సైతం న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. నకిలీ బాబాకు బండ్లగూడ పోలీసులు సహకరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది.
చదవండి: అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement