చేతబడితో చంపేస్తానంటూ నకిలీ బాబా ప్రచారం
తన అత్తింటి వారిని హత్య చేయాలంటూ అతడితో ఓ మహిళ డీల్
క్షుద్రపూజలు చేసి ఆ వీడియోలను అత్తింటికి పంపిన వైనం
వీరికి చెక్ చెప్పిన సౌత్–ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ బాబాగా అవతారం ఎత్తిన ఓ మాజీ రౌడీïÙటర్ మంత్రాలతో మర్డర్లు చేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన అత్తింటి వారిపై ఉన్న కక్షను ఇతడి ద్వారా తీర్చుకోవాలని భావించిందో మహిళ. అత్తింటికి వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తూ తీసిన వీడియోను వారికి చేరేలా చేసింది. ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో నకిలీ బాబాకు సౌత్–ఈస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నట్లు మంగళవారం అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు వెల్లడించారు. కేసు పూర్వాపరాలను ఆయన ఇలా వివరించారు.
ష్యూరిటీ నేపథ్యంలో బాబా పరిచయం..
నగరంలోని బహదూర్‌పురా హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్ కలీంకు నేరచరిత్ర ఉండటంతో గతంలో కాలాపత్తర్ పోలీసులు రౌడీïÙట్ తెరిచారు. హత్య, హత్యాయత్నం సహా అయిదు కేసుల్లో నిందితుడైన ఇతగాడు 2022 నుంచి కాలీగా పేరు మార్చుకుని నకిలీ బాబా అవతారం ఎత్తాడు. ఇళ్లకు రంగులు వేసే పని చేస్తూనే పూజలు, మంత్రాల పేరుతో పలువురిని బురిడీ కొట్టిస్తున్నాడు. అనారోగ్యం తగ్గడానికి తాయత్తులు, తాళ్లు కడుతూ డబ్బు వసూలు చేస్తున్నాడు. పాతబస్తీకే చెందిన నజియా కొన్నాళ్ల క్రితం ఓ మహిళకు రూ.50 వేలు అప్పుగా ఇచి్చంది. అప్పట్లో ఆమె తరఫున ష్యూరిటీ ఇవ్వడానికి వచి్చన కాలీతో నజియాకు పరిచయం ఏర్పడింది.
అత్తింటి వారిపై కక్ష తీర్చుకోవాలని..
నజియాకు తన అత్తింటి వారితో స్పర్థలు వచ్చాయి. దీంతో వారిపై కక్షగట్టిన ఆమె హత్య చేయించాలని భావించింది. దీనికోసం కాలీని సంప్రదించగా రూ.10 వేలు ఇస్తే చేతబడితో చంపేస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తం తీసుకున్న అతగాడు నజియా అత్త, ఆడపడుచు, మరిది పేరుతో బొమ్మలు తయారు చేసి క్షుద్రపూజలు చేశాడు. ఈ తతంగం మొత్తాన్ని నజియా వీడియో చిత్రీకరించింది. గత నెల 2న నజియా మరిదికి ఫోన్ చేసిన కాలీ... క్షుద్రపూజల విషయం చెప్పడంతో పాటు 48 గంటల్లో చనిపోతారంటూ అలీ్టమేటం ఇచ్చాడు. ఆ వెంటనే వాట్సాప్ ద్వారా చేతబడి చేస్తున్న వీడియోను పంపాడు.
నిద్రాహారాలు మానేసిన కుటుంబం..
ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ కుటుంబం నిద్రాహారాలు మానేసింది. తమకు ఏదో జరుగుతోందని భయపడుతూ దైనందిన వ్యవహారాలకు దూరంగా ఉంది. ఎట్టకేలకు ధైర్యం చేసిన నజియా మరిది ఇర్ఫాన్ మాలిక్ బండ్లగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం సౌత్–ఈస్ట్ జోన్ ఇన్‌స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ నేతృత్వంలో ఎస్సైలు షేక్ కవియుద్దీన్, ఎం.మధు, పి.సాయిరాం రంగంలోకి దిగారు. మంగళవారం కాలీని పట్టుకుని అతడి నుంచి చేతబడి సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని బండ్లగూడ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న నజియా కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment