
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే మోసపూరిత హామీలను, మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని వైఎస్సార్‌సీపీ నేత, సినీ నటుడు పృథ్వి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సాహితీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నటులు జోగినాయుడు, కృష్ణుడులతో కలిసి ఆయన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు .. మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. ఫీజురియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నాశనం చేశారన్నారు. నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో చేతులు కలిపి స్పెషల్ ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మోదీ మంచివాడు కాదని అంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజలకు ఎంతో మేజు చేస్తాయన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడుని, విజయనగర పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment