సినీ నటులు పృద్వీ రాజ్
విజయనగరం: ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బొబ్బిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని గెలిపించడం ద్వారా ఫిరాయింపు రాజకీయాలకు చెంప పెట్టులా సమాధానం చెప్పాలని సినీ నటులు పృధ్వీ, కృష్ణుడు, జోగినాయుడు బృందం ప్రజలను కోరింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సినీ నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు పృద్వీ, కృష్ణుడు ప్రసంగిస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని పార్టీలు తెలుగు దేశం గొడుగు కిందకు చేరాయని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ని మోసం చేయడానికి కలిసికట్టుగా కొమ్ము కాస్తున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఢిల్లీలో గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఏవిధంగా క్లీన్ స్వీప్ చేసిందో అధే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్సార్‌సీసీ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment