వైఎస్సార్‌సీపీలో చేరిన జోగినాయుడు | Jogi Naidu Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన జోగినాయుడు

Published Fri, Mar 8 2019 6:02 PM | Last Updated on Fri, Mar 8 2019 7:37 PM

Jogi Naidu Joins YSR Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. నటులు పృథ్వి, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదిరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు చివరికి దోచుకోవడానికి ఏమిలేక ఓట్లు కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement