పృథ్వీరాజ్‌కు కీలక పదవి! | Prudhvi Raj Appointed As SVBC Chairman | Sakshi
Sakshi News home page

ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌

Published Fri, Jul 19 2019 5:53 PM | Last Updated on Fri, Jul 19 2019 8:09 PM

Prudhvi Raj Appointed As SVBC Chairman - Sakshi

సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ నియామకానికి అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement