
‘‘తెలుగు గానా, తెలంగాణ అంటే ఇష్టం. హైదరాబాద్, అమరావతి కూడా చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం’’ అని కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల అన్నారు. కృష్ణుడు, సన ప్రధానపాత్రల్లో పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మకు ప్రేమతో’. ఈ సినిమా పోస్టర్‌ని రాందాస్ అత్వాల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అమ్మకు ప్రేమతో’ మంచి టైటిల్. ఈ సినిమా సక్సెస్ కావాలి.
తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కేసీఆర్‌గారికి మద్దతు కూడా ప్రకటించాను’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో మంచి మనిషి, నిరంతరం ప్రజా సేవకై పాటుపడే వ్యక్తి రాందాస్ అత్వాలగారిని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్(టి.ఎఫ్.సి.సి) తరఫున సత్కరించడం గర్వంగా ఫీలవుతున్నాం. టి.ఎఫ్.సి.సి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మందికి హెల్త్ కార్డులు అందించాం. భవిష్యత్‌లో మరిన్ని పథకాలను రాందాస్ గారిద్వారా సాధిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment