Sana
-
సౌరవ్ గంగూలీ కుమార్తె సనా కారుకు యాక్సిడెంట్
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కుమార్తె సనా గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కోల్‌కతాలోని తమ ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం కారులో బయల్దేరిన సనా గంగూలీ బెహాలా చౌరాస్తాకు చేరుకున్న సమయంలో ఓ ప్రైవేటు బస్సు ఆమె కారును బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో సనా(Sana Ganguly)తో పాటు కారులో ఉన్న మిగతా వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, కారును ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు వేగంగా అక్కడి నుంచి కదిలింది. ఈ క్రమంలో స్థానికులతో పాటు.. పోలీసులు బస్సును వెంబడించారు. దాదాపు కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత.. ఎట్టకేలకు సఖేర్‌బజార్ క్రాసింగ్ వద్ద బస్సును ఆపగలిగారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు.అప్పటి నుంచి పోలీసు నిఘాలో కాగా బెహాలా చౌరాస్తా వద్ద గత ఏడాదిన్నర కాలంగా పోలీసు బందోబస్తు ఉంది. 2023లో బెహాలా చౌరాస్తా వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎనిమిదేళ్ల విద్యార్థిని ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడు తవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. రెండో తరగతి చదువుతున్న ఆ పిల్లాడు పరీక్ష రాసేందుకు వెళ్తూ దుర్మరణం పాలు కావడంతో స్థానికుల్లో ఆగ్రహం, ఆవేదన పెల్లుబికాయి.పరిస్థితి చేయిదాటంతో పోలీసులు వచ్చి వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చౌరాస్తా ప్రాంతం పోలీసు నిఘాలో ఉంది. ఈ క్రమంలోనే సనా గంగూలీ కారును ఢీకొట్టిన ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించగలిగారు. ఇక రాయ్చక్ నుంచి కోల్‌కతా మార్గంలో వెళ్తున్న బస్సు.. సనా కారును ఢీకొట్టిందని.. అయితే, ఈ ఘటనలో కారు పెద్దగా డ్యామేజ్ కాలేదని.. అలాగే అందులోని ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏకైక సంతానంకాగా భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ- డోనా దంపతులకు ఏకైక సంతానం సనా. 1997లో పెళ్లి చేసుకున్న సౌరవ్- డోనాలకు 2001లో కుమార్తె సనా జన్మించింది. తల్లిలాగే సనా కూడా ఒడిస్సీ డాన్సర్. లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో ఆమె పట్టా పుచ్చుకుంది. చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. ఆస్పత్రికి జస్ప్రీత్ బుమ్రా -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి... పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సనా సయ్యద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వెల్కమ్ టూ బేబీ గర్ల్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. గత నెలలోనే తన భర్తతో కలిసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగా.. బుల్లితెర నటి సనా సయ్యద్ ప్రముఖ సీరియల్ కుండలి భాగ్యతో ఫేమస్ అయింది. ఈ సీరియల్లో పల్కీ పాత్రను పోషించింది. తాజాగా సనా సయ్యద్ తనకు కుమార్తె పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రెగ్నెన్సీ తర్వాత కుండలి భాగ్య సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో అద్రిజా రాయ్‌ని తీసుకున్నారు. అంతే కాకుండా సనా సయ్యద్ దివ్య దృష్టి వంటి షోలలో కూడా కనిపించింది. ఆమె 2021లో ఇమాద్ షమ్సీని వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Sana Sayyad (@sana_sayyad29) -
Shoaib Malik-Sana Javed Wedding: షోయబ్ మాలిక్‌తో పెళ్లి.. పాకిస్తాన్ బ్యూటీకి సైతం ఇది రెండో పెళ్లే (ఫొటోలు)
-
Shoaib Malik-Sana Javed: మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. సానియాతో బంధానికి స్వస్తి (ఫొటోలు)
-
ఎంత కష్టం వచ్చిందమ్మా!
పెనుబల్లి/గచ్చిబౌలి/మల్లాపూర్/ఎడపల్లి (బోధన్)/ఖలీల్‌వాడి (నిజామాబాద్ అర్బన్): భర్తల వేధింపులు.. ఆర్థిక ఇబ్బందులు.. కారణం ఏదైతేనేం.. క్షణికావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. వారిలో ఇద్దరు తల్లులు, ఓ కుమార్తె కన్నుమూయగా పిల్లలతో కలసి చెరువులో దూకిన మరో ఇద్దరు తల్లులను స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడి ఆచూకీ గల్లంతైంది. మరో ఘటనలో అనారోగ్యం కారణంగా కుమార్తెతో కలసి భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో... ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మణికొండలోని ఆంధ్రా బ్యాంకు సమీపంలో నివసించే బుడ్డోలు సదానందానికి భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన అలివేలుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కూతురు లాస్య (14), కుమారుడు మణికంఠ (11) ఉన్నారు. సదానందం ఖాళీగా ఉంటుండగా కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు వచ్చే ఇంటి అద్దెలు కాస్తా బందువులతో ఏర్పడిన వివాదాలతో నిలిచిపోయాయి. దీంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. డబ్బులేక పిల్లలను చదువు కూడా మాన్పి0చారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమస్యల నుంచి బయటపడేయాల్సిందిగా దేవుడిని ప్రార్థించి రావాలంటూ భర్తను యాదగిరిగుట్టకు పంపింది. అనంతరం అర్ధరాత్రి వేళ ఓ బెడ్రూంలో తొలుత కుమార్తెకు ఉరేసి, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక వంటింట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున లేచిన కుమారుడు తల్లి, అక్కను విగతజీవులుగా చూసి వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలిపాడు. చేతిపై గోరింటాకు..! ఆత్మహత్మకు ముందు అలివేలు, లాస్య గోరింటాకు పెట్టుకున్నారు. లాస్య చేతిపై గోరింటాకు కోన్‌తో ‘డూ సమ్‌థింగ్ దట్ మేక్ యూ హ్యాపీ’అని రాసుకుంది. అదేవిదంగా తల్లీ, కూతురు ఇద్దరూ ‘ది గేమ్ ఈజ్ స్టార్టెడ్’అని గోరింటాకుతో రాసిన వ్యాఖ్యలు ఉండటంతో పోలీసులు ఇవి ఎందుకు రాసుకున్నారో...? అనే అంశంపై కూడా విచారణ చేస్తున్నారు. కాగా, అలివేలు, లాస్య ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో మరో ఉరితాడు వేలాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కుమారుడికి కూడా ఉరివేయాలని తల్లి భావించి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు.కానీ కుమారుడు బెడ్రూమ్లో నిద్ర పోతుండడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకొని ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అలివేలు ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్, బట్టలను ఇంట్లోనే తగలబెట్టింది. తల్లీకుమార్తెల మానసిక స్థితి సరిగ్గా లేదని.. కరోనా కాలం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారని రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. లైవ్‌లో ఆత్మహత్య... భర్త వేధింపులు తట్టుకోలేక.. ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారానికి చెందిన సనా (29) రాజస్తాన్‌కు చెందిన హేమంత్ పటియాల (డిజె మ్యూజిక్ అపరేటర్) 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకు వారి వైవాహిక జీవితం బాగానే కొనసాగింది. బాబు పుట్టాక వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సనాను భర్త హేమంత్‌తోపాటు వారి అత్తమామలు వేధించసాగారు. దీంతో గతంలో పలుమార్లు పోలీసులకు హేమంత్పై సనా ఫిర్యాదు చేశారు. సైప్రస్ దేశానికి వెళ్లిన హేమంత్ గత 5 నెలలుగా సనాను ఫోన్లో వేధిస్తూనే ఉన్నాడు. దీంతో మంగళవారం నాచారంలోని ఇంట్లో సనా ఫేస్బుక్ లైవ్ పెట్టి ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. సనాకు 3 ఏళ్ల బాబు ఉన్నాడు. పిల్లలతో సహా చెరువులో దూకిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో సహా అక్కాచెల్లెళ్లు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా అందులో బాలుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అశోక్ సాగర్ (జానకంపేట చెరువు) వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన లక్షి్మ, మోహన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. మోహన్‌కు కొత్త కలెక్టరేట్ సమీపంలో 2 వేల గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో కొంత భాగాన్ని పెద్ద కూతురుకు అమ్మి రెండో కూతురు అక్షయ, మూడో కూతురు నిఖితలకు వివాహం చేశాడు. అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. వివాహ సమయంలో చెరో 200 గజాల స్థలాన్ని వారికి కానుకగా ఇచ్చారు. కొంతకాలంగా హేమంత్, మహే‹Ùలు ఇంటి స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని భార్యలను వేధిస్తున్నారు. అయితే ఈ ప్లాట్లకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని తెలిసింది. అక్షయ, నిఖితలపై వేధింపులు ఎక్కువ కావడంతో వారిద్దరూ మూడు రోజుల క్రితం పిల్లలతో కలసి పుట్టింటికి వచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గురువారం ఉదయం నిఖిత తన పిల్లలైన భవశ్రీ, శ్రీమాన్, అక్షయ తన కుమారుడైన చిన్నా (3) అలియాస్ భువనేశ్వర్‌ను తీసుకొని ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పిల్లలను నీటిలోకి తోసి తర్వాత నిఖిత, అక్షయ కూడా దూకారు. ఆ సమయంలో రోడ్డుపై అటుగా వెళ్తున్న షేక్ హైదర్ అనే వ్యక్తి చెరువులోకి దూకి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్లను రక్షించాడు. మూడేళ్ల చిన్నా ఆచూకీ లభించలేదు. కేన్సర్ నుంచి భార్య కోలుకోదేమోనని.. భార్యకు కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో భర్త తల్లడిల్లాడు. భార్యకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని.. తామిద్దరం లేకపోతే కూతురు భవిష్యత్తు ఏమిటనే భయంతో కుమార్తె సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (40)కు భార్య సుహాసిని (35), కుమార్తె అమృత (16)తోపాటు కుమారుడు కార్తీక్ ఉన్నారు. కార్తీక్‌కు బీటెక్ సెకండియర్ పూర్తికాగానే బెంగళూరులోని హెచ్‌సీఎల్‌లో ట్రెయినీగా ఉద్యోగం రాగా అమృత ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ చదివేందుకు సిద్ధమవుతోంది. నెలన్నర క్రితం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సుహాసినికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు గర్భసంచిలోని కణతిని తొలగించారు. ఈ క్రమంలో శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపగా అది కేన్సర్‌గా తేలింది. దీంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స కోసం వెళ్తామని కుమారుడు, బంధువులకు చెప్పారు. దీంతో కుమారుడు బెంగళూరు నుంచి గురువారం ఉదయం ఇంటికి రాగా, గుంటూరులో ఉంటున్న వెంకటకృష్ణారావు తమ్ముడు కూడా కొత్తకారాయిగూడెం వచ్చాడు. అనంతరం గురువారం సాయంత్రం వెంకటకృష్ణారావు, సుహాసిని దంపతులు కుమార్తె అమృతతో కలసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెబుతూ తిరువూరు బయలుదేరారు. కానీ మధ్యలోనే మూడు ప్లాస్టిక్ స్టూళ్లు, నైలాన్ తాడు, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ కొనుక్కొని స్వగ్రామంలో పొలం పక్కనే ఉన్న మామిడి తోటకు రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన గ్రామ స్తులు ఆరా తీయగా గేదెలను వెతకడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నారు. -
గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ.. తన నృత్య ప్రదర్శనలతో వార్తల్లో నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సనాకు సంబంధించిన చిన్నప్పటి నుంచి ఉన్న అనేక ఫోటోలు ఇంటర్నెట్లో తిరుగుతున్నాయి. అప్పుడే ఆమె చదువు పూర్తయ్యే దశకు వచ్చేసింది. సనా గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం పూర్తవుతుందంటే షాకింగ్‌గా ఉంది కదా.. ఇక మరొక విశేషం ఏంటంటే గ్రాడ్యుయేషన్ పూర్తికాకముందే సనా తనకంటూ ఓ ఉద్యోగం వెతుక్కొంది. సనా కోల్‌కతాలోని లోరెటో హౌస్ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేయడానికి లండన్ వెళ్లింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సనా తన చదువుతో పాటు ఎనాక్టస్ యూసీఎల్‌లో పూర్తి సమయం పనిచేసింది. ఈ ఎనాక్టస్ యూసీఎల్ అనేది యువ వ్యాపారవేత్తలకు, పెద్ద కార్పొరేట్లకు వారి సొంత సామాజిక సంస్థలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో హెచ్ఎస్బీసీ, కేపీఎంజీ, గోల్డ్‌మన్ శాచ్స్, బార్ల్కేస్ వంటి కంపెనీలతో సహా ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు లభించింది. సనా గంగూలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం... ఆమె 2022 జూన్ నుంచి పీడబ్ల్యూసీ (PwC)లో ఇంటర్న్‌గా పని చేస్తోంది. పీడబ్ల్యూసీ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక సలహా కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 152 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ కంపెనీలో 3.28 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. పీడబ్ల్యూసీ తమ వద్ద ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్న విద్యార్థులకు భారీగానే చెల్లిస్తోంది. UK.indeed.com వెబ్సైట్ ప్రకారం.. పీడబ్ల్యూసీ ఇంటర్న్‌షిప్ సమయంలో సంవత్సరానికి సగటున రూ. 30 లక్షల జీతం ఇస్తోంది. దీని ప్రకారం సనాకు కూడా రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం వస్తోందని అనుకోవచ్చు. (జోస్ అలుకాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాధవన్) -
అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్
సినీ నటి సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు ఆరు వందల సినిమాలు చేసిన ఆమె పూర్తి పేరు సనా బేగమ్. పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్‌గా, తల్లిగా డిసెంట్ రోల్స్ చేసి ఆడియన్స్ మెప్పించింది. ఇటీవలే రిలీజైన రంగమార్తాండ చిత్రంలోనూ విభిన్న పాత్ర పోషించింది. ఇక ఈ పాత్రల గురించి పక్కన పెడితే ఇంతకాలం సంప్రదాయ పాత్రలు చేసిన ఆమె రీసెంట్గా నటించిన మెట్రోల కథలు వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్లో కనిపించి షాకిచ్చింది. ఈ సిరీస్‌లో అప్పటికే పెళ్లై భర్త ఉన్న ఆమె మరో వ్యక్తితో బెడ్ షేర్ చేసుకుంటుంది. చదవండి: తొలిసారి బేబీ బంప్‌తో ఉపాసన.. ఫొటోలు వైరల్ అయితే తాజాగా తన బోల్డ్ రోల్‌పై సనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు చెప్పడంతో నేను ఆ రోల్ చేశాను. తాగుబోతు భర్త వల్ల ఓ మిడిల్ క్లాస్ మహిళ పడే ఇబ్బందులు, కష్టాలను ఈ ‘మెట్రో కథలు’ సిరీస్‌లో చూపించారు. నా పాత్రతో చాలా మంది స్ఫూర్తి పొందుతారు. ముఖ్యంగా ఆ వయసు మహిళలకు నా పాత్ర బాగా చేరుతుంది. ఎందుకంటే భార్యని పట్టించుకోని తాగుబోతూ భర్త వల్ల కోరికలను చంపుకుని బతుకుతారు కొందరు మహిళలు. కానీ ఆలాంటి మహిళల గురించి బయట సమాజం ఎలా మాట్లాడుకుంటుంది, భర్త చేసిన తప్పుకు ఆమెను ఎలా ట్రీట్ చేస్తుందో చూపించారు. ప్రస్తుతం బయటకు జరుగుతున్నదే సిరీస్‌లో చూపించారు. ఆ పాత్రని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. మంచి మెసేజ్ ఉన్న సిరీస్, అలాగే మంచి ప్రొడక్షన్ హౌస్ కూడా. అందుకే నేను కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నా. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. తను కావాలని తప్పు చేయదు. చదవండి: చరణ్ బర్త్‌డే పార్టీలో కనిపించని తారక్.. ఎందుకు రాలేదు? అనుకోకుండా ఓ వీక్ మూమెంట్లో ఆ తప్పు జరిగిపోతుంది. ఆ తప్పు తనకు నచ్చింది కాబట్టి ఒప్పుకుంది. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని ఆ రోల్ చేశాను. భవిష్యత్తులో ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా ఇందులోని ఓ ఎపిసోడ్లో భర్తవల్ల చాలా ఇబ్బందిపడే గృహిణి పాత్రలో సనా నటించింది. తన తాగుబోతూ భర్తకు యాక్సెండ్ చేసిన వ్యక్తితో ఓ వీక్ మూమెంట్లో దగ్గరవుతుంది. ఆ వ్యక్తి పాత్రలో బిగ్‌బాస్ ఫేం అలీ రేజా నటించాడు. ఆలీ రేజాతో ఇంటిమేట్ సీన్ చేసిన సనా వార్తల్లో నిలిచింది. -
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
ఆ పోస్ట్ నిజం కాదు : గంగూలీ
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుమార్తె సనా సీఏఏకు వ్యతిరేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కుశ్వంత్ సింగ్ రాసిన ‘ది ఎండ్ ఆఫ్ ఇండియా’ పుస్తకంలోని సందేశాన్ని సనా ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేశారనేది ఆ వార్తల సారాంశం. అయితే ఆ వార్తలపై కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. మరికొందరు సనాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనిపై స్పందించిన గంగూలీ.. ఆ పోస్ట్ నిజం కాదని తెలిపారు. సనా చాలా చిన్న పిల్ల అని.. తనను వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు. ‘ఈ వివాదాలకు సనాను దూరంగా ఉంచండి. ఆ పోస్ట్ నిజమైనది కాదు. తనది రాజకీయాల గురించి తెలుసుకునే వయస్సు కాదు’ అని పేర్కొన్నారు. -
హై ఓల్టేజ్ యాక్షన్
సాయిరోనక్, ఎనా సహా జంటగా వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నిరీక్షణ’. టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై పి.రాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్ తొలిసారి మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘నిరీక్షణ’. ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ‘రాక్షస..’ అనే ప్రమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా రోల్ రిడా పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రద్ధాదాస్, సన ప్రత్యేక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి వి., సంగీతం: ‘మంత్ర’ ఆనంద్. -
దోషం ఎవరికి?
కిషోర్, సన జంటగా నటించిన చిత్రం ‘దోషం’. ‘నాకా.. దేవుడికా..?’ అన్నది ఉపశీర్షిక. రా మూవీ రిక్రియేషన్స్ పతాకంపై రఘు గోపసాని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్ర దర్శక–నిర్మాత రఘు గోపసాని మాట్లాడుతూ– ‘‘వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు. మనిషిని పట్టి పీడిస్తున్న దోషాల తలలను కోయడానికి త్రిశూలంగా దూసుకొస్తున్న చిత్రం ‘దోషం’. ఈ చిత్రంలోని నటీనటులు నెల్లూరులోని రామాపురం వాస్తవ్యులు. అందరూ చక్కగా నటించారు. ప్రవీణ్ పున్నూరు విలన్‌గా బాగా నటించాడు. మా సినిమాని ఫిబ్రవరి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పున్నూరు రాజేష్, వసీమ్, అనిల్ డబ్బు, వెన్నెల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్ రవిరామ్, కెమెరా:శంకర్ కేసరి, సహ నిర్మాతలు: ఒంటేరు మాల్యాద్రి, మోహన్ రామచంద్రయ్య, సురేశ్ పెంట్యాల, కోటపాటి రుషీల్ , డబ్బుగుంట వెంకయ్య. -
సనా... ‘సోనా’
-
అమ్మ ప్రేమ గొప్పది
‘‘తెలుగు గానా, తెలంగాణ అంటే ఇష్టం. హైదరాబాద్, అమరావతి కూడా చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం’’ అని కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల అన్నారు. కృష్ణుడు, సన ప్రధానపాత్రల్లో పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మకు ప్రేమతో’. ఈ సినిమా పోస్టర్ని రాందాస్ అత్వాల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అమ్మకు ప్రేమతో’ మంచి టైటిల్. ఈ సినిమా సక్సెస్ కావాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కేసీఆర్‌గారికి మద్దతు కూడా ప్రకటించాను’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో మంచి మనిషి, నిరంతరం ప్రజా సేవకై పాటుపడే వ్యక్తి రాందాస్ అత్వాలగారిని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్(టి.ఎఫ్.సి.సి) తరఫున సత్కరించడం గర్వంగా ఫీలవుతున్నాం. టి.ఎఫ్.సి.సి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మందికి హెల్త్ కార్డులు అందించాం. భవిష్యత్‌లో మరిన్ని పథకాలను రాందాస్ గారిద్వారా సాధిస్తాం’’ అన్నారు. -
నా సపోర్ట్ ఆ అమ్మాయికే...
నూతన నటుడు శ్రీకాంత్, హేమలత (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. భానుచందర్, సుమన్, సన, కాశీ విశ్వనాధ్ ముఖ్యపాత్రల్లో కె. గోవర్ధన్‌రావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతారెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు మల్కాపురం శివకుమార్, హేమలత కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత ‘మల్టీ డైమన్షన్’ వాసు క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందించారు. అయోధ్య కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. హేమలతారెడ్డి మాట్లాడుతూ– ‘‘మేం నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే ఓ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 20న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో అతిథిగా కాకుండా, ఫుల్‌లెంగ్త్ రోల్ చేస్తున్నా. హేమలతకి సినిమా పట్ల చక్కని అభిరుచి ఉంది. ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తా’’ అన్నారు భానుచందర్. ‘‘ఆంధ్ర, తెలంగాణలలో 50–60 రోజులు షూటింగ్ చేస్తాం’’ అన్నారు గోవర్ధన్‌రావు. ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్, కెమెరా: ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్). -
కూత్తాన్ కోసం రమ్యానంబీశన్ పాట
తమిళసినిమా: నటి రమ్యానంబీశన్‌లో మంచి గాయని ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆమె పాడిన పైపైపై కలచీపై అనే పాట ఇప్పటికీ వాడ వాడలా మారుమోగుతోంది. తాజాగా కూత్తాన్ చిత్రం కోసం మరోసారి తన గళం విప్పింది. నీలగిరీస్ డ్రీమ్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఆ చిత్రానికి నవదర్శకుడు ఏఎల్.వెంకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది ఒక నృత్యదర్శకుడి ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం అని చెప్పారు. ఇందులో రాజ్‌కుమార్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్లుగా శ్రీజిత, కీర, సన నటిస్తున్నారని తెలిపారు. విలన్‌గా ప్రభుదేవా సోదరుడు నాగేంద్రప్రసాద్ నటిస్తున్నారని చెప్పారు. బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో వివేక్ రాసిన ఓడు ఓడు కాదల్ కాడు మిరండీ అనే పాటను నటి రమ్యనంబీశన్తో పాడిస్తే బాగుంటుందని భావించామన్నారు. ఈమె చాలా చక్కగా పాడారని చెప్పారు. -
గంగూలీ కూతురి ఫొటోషూట్.. హల్చల్!
-
గంగూలీ కూతురి ఫొటోషూట్.. హల్చల్!
సెలబ్రిటీ కిడ్స్ సోషల్ మీడియాలో దుమారం రేపడం కొత్త కాదు. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కూతురు సరా అలీఖాన్ తమ ఫొటోలు, అప్డేట్స్తో ఇంటర్నెట్ను ఓ కుదుపు కుదిపారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ కిడ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమెనే సనా గంగూలీ. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారాలపట్టీ. చిన్నారిగా అప్పుడప్పుడు తండ్రి గంగూలీతో కలిసి ఫొటోలలో కనిపించిన సనా ఇప్పుడు పెరిగి పెద్దదైంది. 16 ఏళ్ల ఈ అందాల భరిణ ఇప్పుడు తండ్రి గంగూలీతో కలిసి దిగిన ఓ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ ప్రీమియం జ్యువెల్లరీ బ్రాండ్ కోసం గంగూలీ, సనా కలిసి ఈ ప్రత్యేక ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. బంగారు అంచు కలిగిన గులాబీవర్ణం చీరను కట్టుకొని ఈ ఫొటోలలో ముగ్ధమోహనంగా సనా దర్శనమిచ్చింది. తండ్రి గంగూలీ, తల్లి డొనా ఈ ఫొటోలను తమ ఫేస్బుక్ పేజీలలో షేర్ చేసుకున్నారు. కెమెరా ముందు ఏ మాత్రం బెరుకులేకుండా కనిపించిన సనా ఈ ఫొటోలలో అద్భుతంగా ఉందని నెటిజన్లు కితాబిస్తున్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
గుత్తి: ప్రేమ వివాహం చేసుకున్న తమకు ఇరుకుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. గుత్తిలోని పైమాల వీధికి చెందిన పవ¯ŒS, తాడిపత్రి రోడ్డు కాలనీకి చెందిన సన మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోరని రెండు రోజుల క్రితం కసాపురం వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. విషయం తెలిశాక పెద్దలు తమను విడదీసే అవకాశం ఉందని భావించిన ఇద్దరూ గుత్తికి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదుచచేశారు. ఎస్ఐ రామాంజనేయులు ఇరువురి తల్లిదండ్రులనూ స్టేష¯ŒSకు పిలిపించారు. ఇద్దరూ మేజర్లని, ఇష్ట్రపకారమే పెళ్లి చేసుకున్నారని, వారిపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, భయపెట్టినా నేరంగా పరిగణిస్తామని చెప్పి పంపారు. -
షూటింగ్ లో నమాజు చేయడానికి ఎప్పుడైనా ఇబ్బందిపడ్డారా?
మండే లైట్లు... ముఖాన మేకప్... చూసే కెమెరా... యాక్షన్ కేకలు... కట్ చేసి బయటికొస్తే ఆ నటన వెనుక ఒక మనిషి ఉంటాడు. విశ్వాసం ఉంటుంది. మనసులో ఒక పవిత్ర భావన ఉంటుంది. అలీ, షఫీ, సన... రంజాన్ మాసం ఆచరణలో ఉన్నారు. ఆ పవిత్ర భావనను మనకు పంచుతున్నారు. అనాథలకు ఇఫ్తార్ ఇస్తాను - అలీ రంజాన్ మాసంలో ‘రోజా’ (ఉపవాసం) ఉంటారు కదా... షూటింగ్స్ వల్ల ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందేమో? ఒక్కోసారి అలా జరిగే అవకాశం ఉంటుంది. ఈసారి అలానే జరిగింది. ఓ సినిమా షూటింగ్ కోసం పాన్ తినాల్సి వచ్చింది. కాదనలేను. వృత్తిరీత్యా తినాల్సి వచ్చింది. చిన్న పానే అయినా తిన్నట్లే కదా. ఈ కారణంగా మూడు రోజులు రోజాకి బ్రేక్. అలా కూడా చేయొచ్చా? తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తాం? రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా షూటింగ్ చేయడం నీరసంగా అనిపించదా? ఈ మాసంలో మాత్రం నీరసం అనిపించదు. భగవంతుడి కోసం ఉపవాసం చేస్తున్నామనే ఫీలింగ్. భార్యాబిడ్డలు, బంధువులూ అందరి క్షేమం కోసం రోజా ఉంటాం కాబట్టి ఏమీ అనిపించదు. ఉపవాసంతో పాటు రోజు మొత్తంలో ఐదుసార్లు తప్పకుండా నమాజు చేయాలి. అప్పుడే ఆ ఉపవాసానికి ఫలితం ఉంటుంది. భగవంతుడు కూడా ఇష్టపడతాడనే నమ్మకంతో చేస్తాం కాబట్టి చాలా సంతృప్తిగా ఉంటుంది. మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం అంటే కష్టమే? ఇక్కడో విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న మొదలైతే వచ్చే ఏడాది 13 రోజులు ముందు మొదలవుతుంది. ఆ వచ్చే ఏడాది పదమూడు రోజుల ముందే వచ్చేస్తుంది. ఆ విధంగా చూస్తే మరో పదేళ్ల వరకూ వేసవి కాలంలోనే రంజాన్ వస్తుంది. వేసవిలో నీళ్లు తాగకుండా ఉండటం కొంచెం కష్టమైన పనే. నా చిన్నప్పుడు ఎప్పుడో ఇలా వేసవిలో రంజాన్ వచ్చింది. ఇది రెండోసారి. చిన్నప్పుడు రోజా ఉండేవారా? తొమ్మిది, పదేళ్లప్పుడు అనుకుంటా. ఫస్ట్ టైమ్ రోజా ఉన్నాను. అది కూడా మూడు రోజులే. పదేళ్లు దాటని పిల్లలు చివరి మూడు రోజులు మాత్రమే రోజా ఉండొచ్చు. సౌదీలో అయితే ఐదేళ్ల నుంచే పాటించాలి. మీ కుటుంబంలో అందరూ రోజా పాటిస్తారా? నా భార్య, అమ్మ, తమ్ముడు, తమ్ముడి భార్య అందరూ ఉంటారు. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. మామూలుగా మీరు ఇఫ్తార్ విందు ఇస్తుంటారా? తప్పకుండా. అయితే సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయను. అనాథాశ్రమంలో ఉండే వంద మంది పిల్లల కోసం ఈ నెల 26న విందు ఏర్పాటు చేశాను. విందు ఆరగించిన తర్వాత వాళ్ల పేగు నుంచి ఒక త్రేన్పు వస్తుంది చూడండి.. అదే మా కుటుంబానికి లభించిన ఆశీర్వాదంగా భావిస్తా. పేదలు, కోటీశ్వరులు ఎవరికైనా పండగ ఒకటే.. అది కరెక్టేనండి. మా విషయమే తీసుకోండి. రోజుకి పది రూపాయలు సంపాదించేవాడూ.. రోజూ కోటి రూపాయలు సంపాదించేవాడు.. ఎవరైనా సరే కార్పెట్ మీదే నమాజు చేయాలి. దేవుడి దగ్గర అందరూ సమానమే అనడానికి ఇదొక నిదర్శనం. పిల్లలకు పుస్తకాలు పంచాను - సన రంజాన్ మాసం విశేషాలు పంచుకుంటారా? పవిత్రమైన మాసం. అందరికీ తెలిసిందే. ఎప్పటిలానే నేను ఈసారి కూడా రోజా ఆచరిస్తున్నాను. వర్క్ చేసేటప్పుడు నాకు ఫుడ్ మీద మనసు లాగదు. షూటింగ్ లొకేషన్లో నమాజు చేయడానికి ఎప్పుడైనా ఇబ్బందిపడ్డారా? మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మీడియా పెరిగిపోయింది. రంజాన్ మాసం గురించి ఒక్క ముస్లిమ్లకే కాకుండా అందరికీ అవగాహన వచ్చింది. ఈ మాసంలో మేం నమాజు చేస్తాం అనే విషయం పెద్దగా తెలిసేది కాదు. దాంతో షూటింగ్‌కి కాస్త బ్రేక్ దొరికేది కాదు. ఇప్పుడు ఆ టైమ్‌కి బ్రేక్ ఇస్తున్నారు. మామూలుగా చంద్రుడు అస్తమించాక మసీదులో సైరన్ మోగుతుంది కదా. మావాళ్లు నాకు ఫోన్ చేసి ఆ విషయం చెబుతారు. అప్పుడు నమాజు చేస్తాను. ఈ సీజన్లో మీరు పాటించే ఆహార నియమాల గురించి చెబుతారా? సాయంత్రం చంద్రుడు అస్తమించినప్పట్నుంచీ తెల్లవారుజాము వరకూ ఏదైనా తీసుకోవచ్చు. రోజంతా నీళ్లు తాగం కాబట్టి శరీరం డీ-హైడ్రేట్ అవుతుంది. అందుకే సాయంత్రం డ్రై ఫ్రూట్స్, నిమ్మరసం వంటివి తీసుకుంటా. ఆ తర్వాత నాన్‌వెజ్ తింటాను. తెల్లవారు జాము మాత్రం పండ్లు, ఇడ్లీ, రోటీ, పెరుగు, టీ.. ఇలా లైట్ ఫుడ్ తీసుకుంటాను. మూడుపూటలా ఆహారం తీసుకోవడానికి అలవాటు పడిన శరీరం ఒక్కసారే అడ్జస్ట్ అవుతుందా? మొదటి వారం రోజులు కొంచెం కష్టంగానే ఉంటుంది. టైమ్ కాని టైమ్‌లో ఫుడ్ తీసుకుంటాం. అప్పుడు ఆకలి అనిపించదు. కానీ, నాలుగైదు రోజుల తర్వాత అలవాటవుతుంది. మహిళలకు ఉండే సహజమైన ఆ నాలుగైదు రోజుల పరిస్థితిలో రోజా ఆచరిస్తారా? హిందూ సంప్రదాయంలానే ఆ మూడు రోజుల్లోనూ మేం కూడా పూజలవీ చేయం. రంజాన్ మాసంలో ఆచరించే ఫాస్టింగ్ని ఆ నాలుగైదు రోజులు బ్రేక్ చేస్తాం. ఆ తర్వాత మళ్లీ యథావిథిగా రోజా ఆచరిస్తాం. ఈ మాసంలో సేవా కార్యక్రమాలు చేయడం మంచిదట కదా? వీలుంటే ఎప్పుడు చేసినా మంచిదే. కానీ ఈ మాసంలో పర్టిక్యులర్‌గా కొంతమంది చేస్తారు. నేను ఇఫ్తార్ విందులు ఇస్తాను. సేవా కార్యక్రమాలు చేయడం కోసం నేను ఏ స్వచ్ఛంద సంస్థలనూ సంప్రతించను. నా కంటి ముందు ఉన్నవాళ్లల్లో ఎవరికి సహాయపడితే బాగుంటుందో చూసుకుని వాళ్లకు చేస్తాను. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలను చదివిస్తుంటాను. లక్కీగా ఈసారి స్కూల్స్ తెరిచే సమయానికే రంజాన్ మాసం మొదలైంది. దాంతో పిల్లలకు పుస్తకాలు, ఇంకా కావల్సినవి ఏర్పాటు చేశాను. అది చాలా సంతృప్తిగా ఉంది. జకాత్ పాటిస్తాను - షఫీ రంజాన్ మాసం గురించి మీరు చెప్పదల్చుకున్న విషయాలు? ‘నేను ఎవర్ని? నా భావాలు ఎలా ఉన్నాయి.. నాలో అత్యాశ, అసూయ ఉన్నాయా?’ అని తెలుసుకోవడానికి ఉపయోగపడే మాసం ఇది. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. టోటల్గాచెప్పాలంటే ‘ఆత్మ’ను పరిశుద్ధం చేసే నెల ఇది. ఈ నెల మాత్రమే కాదు మిగతా పదకొండు నెలలూ ఇలానే ఉంటే మన జీవితానికి ఏది అవసరమో అది మిగులుతుంది.. ఏది అనవసరమో అది మిగలదు. కరెక్ట్‌గా చెప్పాలంటే ‘పర్సనాల్టీ డెవలప్మెంట్’కి ఉపయోగపడే నెల ఇది. ఏడాది మొత్తం ఇది ప్రాక్టీస్ చేయాలి. భావాలు తెలుసుకోదగ్గ నెల ఇది అన్నారు? రోజంతా ఉపవాసం చేసినప్పుడు ఆకలి వేయడం సహజం. అప్పుడు ఒక పూట మాత్రమే తిని, మిగతా పూటలు పస్తులుండే పేదవాడి ఆకలి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు మనలో తెలియని ఓ మానవత్వం మొదలవుతుంది. ఇతరుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండాలనే ఆలోచన ఏర్పడుతుంది. సాటి మనిషికి సహాయపడాలనే తపన కలుగుతుంది. ఉదాహరణకు ‘హజ్’ యాత్ర (మక్కా మసీదు యాత్ర)కి వెళ్లాలనుకున్నప్పుడు ఆ సమయంలో మన కళ్లెదురుగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ యాత్రకు అయ్యే డబ్బుతో వాళ్లకు సహాయం చేయొచ్చు. యాత్ర చేసినంత పుణ్యం వస్తుంది. డబ్బురూపంలో కాకుండా వేరే రూపంలో కూడా కొంతమందికి సహాయం అవసరమవుతుంది. అది కూడా చేయొచ్చు. ఈ మాసంలో కొంత సంపాదనను పేదలకు కేటాయించాలట? అవును. దాన్నే ‘జకాత్’ అంటారు. కొంత భాగాన్ని కాదు వీలున్నవాళ్లు ఎక్కువ ఇచ్చినా తప్పులేదు. భగవంతుణ్ణి పూజించడం అంటే ఏంటి? ఇతరులకు సహాయం చేయడమే. రంజాన్ మాసంలో ఉన్న గొప్పదనం ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు. ఇతరులను నిందించకూడదు. వీలైనంత పరిశుభ్రంగా ఉండాలి. 30 రోజులు అలా ఉండటంవల్ల మిగతా జీవితంపై ఆ ప్రభావం ఉంటుంది. తెలియకుండానే ఏడాది పొడవునా కల్మషం లేని మనసుతో ఉంటాం. - షఫీ -
ఊహకందని మలుపులతో...
శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టుమణి, సన ప్రధాన పాత్రల్లో ఎస్.డి. రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వజ్రం’. ఈ చిత్రాన్ని సాయిరంగా ఫిలింస్ పతాకంపై ‘ఓదార్పు యాత్ర’ పేరుతో కె. రంగారావు తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ రాజకీయ నేపథ్యంలో జరిగే థ్రిల్లర్ కథ ఇది. కుటుంబమంతా కలసి చూసే సందేశాత్మక చిత్రం. తమిళంలో వంద రోజులాడింది. ‘గోలీ సోడా’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన పలువురు నటీనటులు ఇందులో నటించారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పాటలు-మాటలు: వెన్నెలకంటి-మలూరి వెంకట్. -
సారిక కేసులో సనా అరెస్టు
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు సాక్షి, హన్మకొండ: మాజీ ఎంపీ రాజయ్య కోడ లు, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో నాలుగో నిందితురాలు సనను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమయ్యారు. ఈ కేసులో సారిక భర్త అనిల్, మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలు నిందితులుగా ఉన్నారు. అనిల్ రెండో భార్య సనా ఏ-4 నిందితురాలు. ఘటన జరిగిన రోజు నుంచి ఆమె పరారీలో ఉంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మధ్యవర్తి ద్వారా చంటిపిల్లాడితో సన(26) లొంగిపోయినట్లు హన్మకొండ ఏసీపీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయంత్రం ఆమెను వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజి స్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సనకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అంతకుముందు సనకు ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సన మధ్యవర్తి ద్వారా లొంగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నప్పటికీ.. 7న ఖమ్మం జిల్లాలోని ఏ న్కూరులో ఆమెను పోలీసులు అదుపులోకి తీ సుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి శుక్రవారం కోర్టులో హాజరుపరిచేవరకు కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ నివాస సముదాయాల్లో ఆమెను విచారించినట్లు తెలుస్తోంది. మిస్డ్ కాల్‌తో పరిచయం కాజీపేటలోని ఫాతిమానగర్‌లో సన బ్యాంగిల్స్టోర్ను నిర్వహించేది. మిస్డ్‌కాల్ ద్వారా ఆమె కు అనిల్‌తో పరిచయమైంది. దీంతో అనిల్ సనను రెండో వివాహం చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. తొలిసారి కాన్పు అయ్యే వరకు అనిల్ మాజీ ఎంపీ రాజయ్య కొడుకని, అతనికి అప్పటికే సారికతో వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయం సనకు తెలి యదు. నిజం తెలిసినప్పటి నుంచి అనిల్, సన ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆఖరికి అనిల్‌తో విడిపోయేందుకు సనకు రూ. 10 లక్షలు ఇచ్చేందుకు రాజయ్య కుటుంబం అంగీ కరించింది. సన తరఫున బంధువు చనిపోవడంతో ఈ చెల్లింపులో జాప్యం జరిగింది. ఇం తలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. అనిల్‌ను కస్టడీకి ఇవ్వండి కోర్టులో పోలీసుల పిటిషన్ వరంగల్ లీగల్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు, ముగ్గురు మనువళ్లు సజీవ దహనమైన కేసులో ప్రధాన నిందితుడైన సారిక భర్త సిరిసిల్ల అనిల్‌కుమార్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సుబేదారి పోలీసులు కోరారు. నగరంలోని నాల్గవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈమేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులైన అనిల్‌కుమార్, మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలను అరెస్టు చేయగా, జైలులో ఉన్నారని, నాలుగో ముద్దాయి సనను శుక్రవారం అరె స్టు చేశామని పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు ముద్దాయిలు మాట్లాడిన మాటలను మృతురాలి సెల్ఫోన్లో రికార్డు అయి ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, మరింత సమాచారం సేకరించడానికి అనిల్‌కుమార్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. నిందితుడి నుంచి మరిన్ని దస్తావేజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, విస్త్రృత ప్రజాప్రయోజన దృష్ట్యా కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. -
వరంగల్ సెంట్రల్ జైలుకు సనా
వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న అనిల్ రెండో భార్య సనను పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 27వరకూ రిమాండ్ విధించింది. దీంతో సనాను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా సనా రిమాండ్ రిపోర్టులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. సనాను అనిల్ 2010లో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని చూసేందుకు రాజయ్య, ఆయన భార్య మాధవి వచ్చేవారని తెలుస్తోంది. అనిల్, అత్త మాధవి ప్రవర్తన వల్ల సారిక ఆత్మహత్య చేసుకుందని సమాచారం. అలాగే రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులపై రాహుల్ గాంధీకి సారిక రాసిన లేఖను ...సనా దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అవినీతి ఆరోపణలపై రాజయ్య ఏసీబీకి ఇచ్చిన సంజాయిషీ డైరీని కూడా ఆమె నుంచి పోలీసులు తీసుకున్నారు. ఇక రాజయ్యకు ఎంపీ టికెట్ రావడంతో సారికను ఇంట్లో నుంచి పంపించేయాలని సనా ఒత్తిడి తెచ్చినట్లు సనా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. -
సారిక కేసులో ఏ4గా సన
వరంగల్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలు, అనిల్ రెండో భార్యగా చెబుతున్న సనను ఏ4 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం ఆమెకు వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరుపరచనున్నారు. మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో గత శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో సన!
సాక్షి, హన్మకొండ/ఖమ్మం: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా సోమవారం సన అరెస్టును పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉంది. సన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆమె ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అమె అక్కడి నుంచి పరారయ్యారని భావించి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చివరికి ఈ నెల 7న ఖమ్మం నగరంలోని ఖిల్లాబజార్ ప్రాంతంలో సనను, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంపులో ఓ క్వార్టరు లో సన నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. కాగా, సనను అరెస్టు చేసిన విషయాన్ని ఖమ్మం జిల్లాలోని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఖమ్మం రూరల్ మండలంలో తన బంధువుల ఇంట సనా ఆశ్రయం పొందుతున్నట్టు తెలుసుకున్న హన్మకొండ సుబేదారి పోలీసులు ఆమెను, ఆమెతో పాటు ఉన్న సోదరుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సారిక కేసులో అనిల్ రెండో భార్య సన అరెస్ట్