మరో అల్లరి ప్రేమకథ | 'o allari prama katha' movie shooting Started | Sakshi
Sakshi News home page

మరో అల్లరి ప్రేమకథ

Published Sun, Dec 29 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

మరో అల్లరి ప్రేమకథ

మరో అల్లరి ప్రేమకథ

ప్రేమే ప్రధాన ఇతివృత్తంగా ఓ అల్లరి ప్రేమకథ తెరకెక్కుతోంది. రంజిత్‌కుమార్, సన హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి పి.నర్సింహరెడ్డి దర్శకుడు. గుర్రాల కృష్ణారెడ్డి నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి మాజీ ఎంపీ విఠల్‌రావు కెమెరా స్విచాన్ చేయగా, ఎంపీ బొత్సా ఝాన్సీ క్లాప్ ఇచ్చారు. కేఎస్ రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇదొక  వినోదభరిత ప్రేమకథని, ఖమ్మం, పాపికొండలు ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసి, సంక్రాంతి తర్వాత రెండో షెడ్యూల్ మొదలుపెడతామని నిర్మాత చెప్పారు.
 
  దర్శకుడు మాట్లాడుతూ-‘‘క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. వీఎన్ ఆదిత్య దగ్గర సహాయకునిగా పనిచేశాను. ఆ అనుభవంతో తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. అందరూ కలిసి చూడదగ్గ సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతా’’ అని చెప్పారు. అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకునికి హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ఆరు పాటలుంటాయని సంగీత దర్శకుడు రామ్‌నారాయణ చెప్పారు. కెమెరామేన్ సంతోష్ శానమోని కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కె.రాజేంద్ర భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.రమాకాంత్, సమర్పణ: గుర్రాల ధనలక్ష్మి, నిర్మాణం: జి.కె.ఆర్.ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement