భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ.. తన నృత్య ప్రదర్శనలతో వార్తల్లో నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సనాకు సంబంధించిన చిన్నప్పటి నుంచి ఉన్న అనేక ఫోటోలు ఇంటర్నెట్‌లో తిరుగుతున్నాయి. అప్పుడే ఆమె చదువు పూర్తయ్యే దశకు వచ్చేసింది.
సనా గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం పూర్తవుతుందంటే షాకింగ్‌గా ఉంది కదా.. ఇక మరొక విశేషం ఏంటంటే గ్రాడ్యుయేషన్ పూర్తికాకముందే సనా తనకంటూ ఓ ఉద్యోగం వెతుక్కొంది. సనా కోల్‌కతాలోని లోరెటో హౌస్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేయడానికి లండన్ వెళ్లింది.
(ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!)
సనా తన చదువుతో పాటు ఎనాక్టస్ యూసీఎల్‌లో పూర్తి సమయం పనిచేసింది. ఈ ఎనాక్టస్ యూసీఎల్ అనేది యువ వ్యాపారవేత్తలకు, పెద్ద కార్పొరేట్‌లకు వారి సొంత సామాజిక సంస్థలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో హెచ్‌ఎస్‌బీసీ, కేపీఎంజీ, గోల్డ్‌మన్ శాచ్స్, బార్ల్కేస్ వంటి కంపెనీలతో సహా ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు లభించింది.
సనా గంగూలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం... ఆమె 2022 జూన్ నుంచి పీడబ్ల్యూసీ (PwC)లో ఇంటర్న్‌గా పని చేస్తోంది. పీడబ్ల్యూసీ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక సలహా కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 152 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ కంపెనీలో 3.28 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు.
పీడబ్ల్యూసీ తమ వద్ద ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్న విద్యార్థులకు భారీగానే చెల్లిస్తోంది. UK.indeed.com వెబ్‌సైట్ ప్రకారం.. పీడబ్ల్యూసీ ఇంటర్న్‌షిప్ సమయంలో సంవత్సరానికి సగటున రూ. 30 లక్షల జీతం ఇస్తోంది. దీని ప్రకారం సనాకు కూడా రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం వస్తోందని అనుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment