
ప్రముఖ బుల్లితెర నటి సనా సయ్యద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వెల్‌కమ్ టూ బేబీ గర్ల్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. గత నెలలోనే తన భర్తతో కలిసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
కాగా.. బుల్లితెర నటి సనా సయ్యద్ ప్రముఖ సీరియల్ కుండలి భాగ్యతో ఫేమస్ అయింది. ఈ సీరియల్‌లో పల్కీ పాత్రను పోషించింది. తాజాగా సనా సయ్యద్ తనకు కుమార్తె పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రెగ్నెన్సీ తర్వాత కుండలి భాగ్య సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో అద్రిజా రాయ్‌ని తీసుకున్నారు. అంతే కాకుండా సనా సయ్యద్ దివ్య దృష్టి వంటి షోలలో కూడా కనిపించింది. ఆమె 2021లో ఇమాద్ షమ్సీని వివాహం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment