సినీ నటి సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు ఆరు వందల సినిమాలు చేసిన ఆమె పూర్తి పేరు సనా బేగమ్. పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్‌గా, తల్లిగా డిసెంట్ రోల్స్ చేసి ఆడియన్స్ మెప్పించింది. ఇటీవలే రిలీజైన రంగమార్తాండ చిత్రంలోనూ విభిన్న పాత్ర పోషించింది. ఇక ఈ పాత్రల గురించి పక్కన పెడితే ఇంతకాలం సంప్రదాయ పాత్రలు చేసిన ఆమె రీసెంట్‌గా నటించిన మెట్రోల కథలు వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్‌లో కనిపించి షాకిచ్చింది. ఈ సిరీస్‌లో అప్పటికే పెళ్లై భర్త ఉన్న ఆమె మరో వ్యక్తితో బెడ్ షేర్ చేసుకుంటుంది.
చదవండి: తొలిసారి బేబీ బంప్‌తో ఉపాసన.. ఫొటోలు వైరల్
అయితే తాజాగా తన బోల్డ్ రోల్‌పై సనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు చెప్పడంతో నేను ఆ రోల్ చేశాను. తాగుబోతు భర్త వల్ల ఓ మిడిల్ క్లాస్ మహిళ పడే ఇబ్బందులు, కష్టాలను ఈ ‘మెట్రో కథలు’ సిరీస్‌లో చూపించారు. నా పాత్రతో చాలా మంది స్ఫూర్తి పొందుతారు. ముఖ్యంగా ఆ వయసు మహిళలకు నా పాత్ర బాగా చేరుతుంది.
ఎందుకంటే భార్యని పట్టించుకోని తాగుబోతూ భర్త వల్ల కోరికలను చంపుకుని బతుకుతారు కొందరు మహిళలు. కానీ ఆలాంటి మహిళల గురించి బయట సమాజం ఎలా మాట్లాడుకుంటుంది, భర్త చేసిన తప్పుకు ఆమెను ఎలా ట్రీట్ చేస్తుందో చూపించారు. ప్రస్తుతం బయటకు జరుగుతున్నదే సిరీస్‌లో చూపించారు. ఆ పాత్రని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. మంచి మెసేజ్ ఉన్న సిరీస్, అలాగే మంచి ప్రొడక్షన్ హౌస్ కూడా. అందుకే నేను కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నా. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. తను కావాలని తప్పు చేయదు.
చదవండి: చరణ్ బర్త్‌డే పార్టీలో కనిపించని తారక్.. ఎందుకు రాలేదు?
అనుకోకుండా ఓ వీక్ మూమెంట్‌లో ఆ తప్పు జరిగిపోతుంది. ఆ తప్పు తనకు నచ్చింది కాబట్టి ఒప్పుకుంది. నన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతారని ఆ రోల్ చేశాను. భవిష్యత్తులో ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా ఇందులోని ఓ ఎపిసోడ్‌లో భర్తవల్ల చాలా ఇబ్బందిపడే గృహిణి పాత్రలో సనా నటించింది. తన తాగుబోతూ భర్తకు యాక్సెండ్ చేసిన వ్యక్తితో ఓ వీక్ మూమెంట్‌లో దగ్గరవుతుంది. ఆ వ్యక్తి పాత్రలో బిగ్‌బాస్ ఫేం అలీ రేజా నటించాడు. ఆలీ రేజాతో ఇంటిమేట్ సీన్ చేసిన సనా వార్తల్లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment