
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది పాప్ కార్న్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌లో ఓటీటీ అభిమానులను అలరించేందుకు వస్తోంది.
హోయ్‌చాయ్ ఓటీటీలో ఇందు పేరుతో స్ట్రీమింగ్ అయిన బెంగాలీ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేశారు. వధువు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సిరీస్‌లో అవికా గోర్, అలీ రెజా, నందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే జేడీ చక్రవర్తి నటించిన దయా థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరిస్తోన్న సంగతి తెలిసిందే.
ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తోన్న వధువు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకవేళ బయటకు వస్తే జరిగే పరిణామాలేంటి? వంటి ఆసక్తికర అంశాలతో వధువు వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment