![Romantic Youthful Web Series Heart Beat Streaming On This OTT - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/8/h.jpg.webp?itok=J6ptNWAi)
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. భాష ఏదైనా సరే సబ్ టైటిల్స్‌తోనే కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన మలయాళ వెబ్ సిరీస్ పోచర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా మరో సరికొత్త కంటెంట్‌తో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ అదేంటో చూద్దాం.
అయాలి నటి అనుమోల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ హార్ట్ బీట్. మెడికల్ జానర్‌లో దీపక్ సుందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో చాలామంది కొత్తవారు నటించారు. ఈ రొమాంటిక్ యూత్‌పుల్ సిరీస్ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను అమెరికన్ షో గ్రేస్ అనాటమీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, చారుకేష్, జయరావు, గిరి ద్వారకేష్, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment