Tamil cinema industry
-
ఫిర్యాదు చేయకపోతే ప్రయోజనం ఉండదు!
మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు. -
సై, సై అంటున్న కోలీవుడ్
-
ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. భాష ఏదైనా సరే సబ్ టైటిల్స్‌తోనే కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన మలయాళ వెబ్ సిరీస్ పోచర్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా మరో సరికొత్త కంటెంట్‌తో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ అదేంటో చూద్దాం. అయాలి నటి అనుమోల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ హార్ట్ బీట్. మెడికల్ జానర్లో దీపక్ సుందర్రాజన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో చాలామంది కొత్తవారు నటించారు. ఈ రొమాంటిక్ యూత్‌పుల్ సిరీస్ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను అమెరికన్ షో గ్రేస్ అనాటమీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, చారుకేష్, జయరావు, గిరి ద్వారకేష్, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
మంచానికే పరిమితమైన స్టార్ డైరెక్టర్ భార్యకు ప్రభుత్వ సాయం
'పుదు వసంతం', 'సూర్యవంశం' లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు విక్రమన్. తెలుగులో 'చెప్పవే చిరుగాలి', 'వసంతం' సినిమాలని డైరెక్ట్ చేశాడు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి అధ్యక్షుడిగాను పనిచేశాడు. కాగా ఈయన భార్య జయప్రియ ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన పరిస్థితి గురించి జనప్రియ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్లో బయటపెట్టారు. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) వెన్ను నొప్పి కారణంగా ఆపరేషన్ చేయించుకున్నానని, వైద్యుల తప్పిదం వల్ల ఐదేళ్లుగా మంచానికే పరిమితమైనట్లు జయప్రియ చెప్పుకొచ్చారు. ఆస్పత్రి నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు. తనకు తన భర్త అండగా ఉంటూ ఆస్తులను అమ్మి తనకు వైద్యం అందిస్తున్నారని ఈమె బాధని బయటపెట్టారు. బయటకు కూడా వెళ్లకుండా తన ఆరోగ్యం కోసమే పరితపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు విక్రమన్ భార్య అనారోగ్యం గురించి తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఆమెకు వైద్య సాయం అందించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్.. విక్రమన్ ఇంటికెళ్లి మరీ ఆయన సతీమణిని పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దర్శకుడు విక్రమన్.. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, ఆరోగ్యశాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) -
కొత్త కబురు
హీరో మాధవన్ కొత్త కబురు చెప్పా రు. తన తర్వాతి సినిమా డైరెక్టర్ మిత్రన్‌తో చేయనున్నట్లు పేర్కొన్నారాయన. తమిళ చిత్ర పరిశ్రమలో గత ఏడాది హిట్ కొట్టిన చిత్రాల్లో ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో ‘తిరు’) ఒకటి. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిట్ కావడంతో మిత్రన్‌కి మరో మంచి అవకాశం లభించింది. మాధవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘దర్శకుడు మిత్రన్‌తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. -
అందుకు ఒప్పుకుంటేనే అవకాశాలు.. నటి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ఇక్కడి ఇండస్ట్రీలో మగవాడి ఆశలకు లొంగితేనే.. అవకాశాలు దరి చేరుతాయని, అందుకే ఇతర రాష్ట్రాల వారు విజయాలు సాధిస్తున్నారని నటి మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటి, మోడల్, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ వ్యాఖ్యలు రచ్చకెక్కుతున్న విషయం తెలిసిందే. గతవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా ఏడు సెక్షన్లతో కేసులు ఆమె మీద నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఆమె విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారడమే కాదు, మరో వివాదాన్ని రేపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నటీమనుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించే వారు ఎక్కువే అయ్యారు. ముందుగా ఆ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఎంకే స్టాలిన్లకు విజ్ఞప్తి చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తమిళనాడు బిడ్డగా, ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళ నైన తాను అనేక ఇబ్బందుల్ని ఇక్కడ ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏది చేసినా, ఏమి చెప్పినా వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను వేధించిన ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి స్పష్టంగా వ్యాఖ్యలు చేస్తే, దానిని ఓ సామాజిక వర్గాన్ని కించ పరిచినట్లుగా చిత్రీకరించారని వివరించారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల్ని అడ్డుకోవాలని, ఇందుకు ముగింపు పలికేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, పోలీసుల్ని ఉద్దేశించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా, తన మీద అతి నీచాతి నీచంగా, అసభ్య పదజాలాలతో సామా జిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ఆరోపణలు, చర్చలు సాగుతున్నాయని, వీటన్నింటి మీద ఎందు కు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో పెట్టి వివాదంగా మార్చిన వారికి వత్తాసు పలుకుతూ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళనైన తన మీద సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న దాడి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనను అరెస్టు చేయలేరంటూ పోలీసులకు సవాల్ చేయడం గమనార్హం. -
నేను జీవించినంత కాలం గిల్టీ ఫిలింగ్ అనుభవిస్తా.. నన్ను క్షమించు పావని
తమిళ బిగ్‌బాస్ ఫేం, నటి యాషిక ఆనంద్ గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో ఆమె స్నేహితురాలు పావని అక్కడికక్కడే మృతి చెందారు. యాషికకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స తీసుకొని యాషిక ఇటీవల కోలుకున్నారు. అయితే తాజాగా యాషిక.. తన స్నేహితురాలకు సంబంధించి ఓ ఎమోషనల్ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్ మీడియోలో వైరల్‌గా మారాయి. ‘‘ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో కూడా చెప్పలేకపోతున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం ప్రమాదానికి సంబంధించి గిల్టీ ఫిలింగ్‌ను అనుభవిస్తాను. ఆ విషాదం నుంచి నన్ను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా లేదా ప్రాణ స్నేహితురాలిని నా నుంచి పూర్తిగా దూరం చేసిన దేవుడిని నిందించాలా అర్ధం కావటం లేదు. ప్రతి క్షణం పావనిని మిస్ అవుతున్నాను. ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదని తెలుసు. నన్ను క్షమించు పావని.. నీ కుటుంబాన్ని విషాదకరమైన పరిస్థితిలోకి నెట్టినందుకు తీవ్రంగా బాధపడుతున్నాను. ప్రతి క్షణం నిన్ను కోల్పోతున్నా.. బతికి ఉన్నంతకాలం దోషిగా బాధపడతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఏదో ఒకరోజు పావని కుటుంబం నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను. ఆమెతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని యాషిక భావోద్వేగంతో రాశారు. బుధవారం యాషిక ఆనంద్ 22వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే తన బర్త్ డే వేడకలను అభిమానులు ఎవరూ చేయవద్దని కోరారు. ‘నేను బర్త్ డే వేడకలు చేసుకోవటం లేదు. అభిమానులు కూడా నా బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దు.. పావని కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలని దేవుడిని ప్రార్థించండి. పావని దూరమవ్వటం.. నా జీవితంలో పూడ్చలేని లోటు. మిస్ యూ పావని’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాషిక పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Y A S H ⭐️🌛🧿 (@yashikaaannand) -
సినీ పరిశ్రమలో మరో విషాదం: నటుడు కన్నుమూత
చెన్నె: తమిళ సినీ పరిశ్రమలో ఆకస్మిక మరణాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రముఖ హాస్య నటుడు నెల్లె శివ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. నెల్లె జిల్లాకు చెందిన ఈయన నడిగర్ తిలగం శివాజీ గణేశన్‌కు వీరాభిమాని. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే సినీ రంగానికి వచ్చారు. 1985లో ‘అన్భావం’ సినిమా ద్వారా శివ నటుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 500కు పైగా సినిమాల్లో నెల్లె శివ నటించి ప్రేక్షకులను మెప్పించారు. నెల్లె శివ ఆకస్మిక మృతిపై తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు మారన్ కూడా కరోనాతో మంగళవారం చెంగల్పట్టులో మృతి చెందారు. పలు చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ గుర్తింపు పొందారు. ఇక ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విధంగా వరుస విషాద ఘటనలతో తమిళ సినీ పరిశ్రమ క్రుంగిపోతుంది. చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య -
కరుణానిధికి సినీతారల కన్నీటి నివాళి
తమిళ సినిమా (చెన్నై): కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు సినీతారలు భారీగా తరలివచ్చారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్, కూతురు ఐశ్వర్య, అల్లుడు, నటుడు ధనుష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, అజిత్, శాలిని దంపతులు, శివకుమార్, సూర్య, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్, నాజర్, ఇతర కార్యవర్గ సభ్యులు, ప్రభు, రామ్‌కుమార్, విక్రమ్ ప్రభు, టి.రాజేందర్, ప్రసన్న, స్నేహ, రాధా రవి, సత్యరాజ్, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌండ్రమణి, వివేక్, పార్తీపన్, సిబి రాజ్, శివకార్తీకేయన్, విజయ సేతుపతి, అధర్వ, నందా, బాబీ సింహా, పశుపతి, ఆర్కే.సురేశ్, మన్సూర్ అలీఖాన్, శ్రీమాన్, విమల్, పా.విజయ్, సంతానభారతి, నటి సరోజాదేవి,కోవై సరళ, దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్, పి.వాసు, కేఎస్.రవికుమార్ తదితరులు నివాళులర్పించారు. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నటుడు విజయ్, విక్రమ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సంగీత దర్శకుడు రెహమాన్, దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. -
అయోమయంలో చిత్రపరిశ్రమ
తమిళసినిమా: రాష్ట్రప్రభుత్వం విధించనున్న వినోదపు పన్ను విధానం తమిళ చిత్రపరిశ్రమను మరోసారి కష్టాల్లోకి నెట్టింది. పరిశ్రమ వర్గాల్లోనూ వివాదాలకు కారణమైంది. కేంద్రప్రభుత్వ జీఎస్టీ 28 శాతంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 30శాతం వినోదపు పన్ను విధించడంతో విలవిలలాడిన థియేటర్ల యాజమాన్యం జూలైలో సమ్మెకు దిగింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రభుత్వం ప్రకటించడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించారు. కాగా గత నెల 27న చెన్నై నగర పాలక సంస్థ 10శాతం వినోదపు పన్నును విధిస్తున్నట్లూ అది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ పన్ను విధానాన్ని చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని శాఖల వారు వ్యతిరేకించారు. ముఖ్యంగా నిర్మాతల మండలి, థియేటర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకించాయి. వినోదపు పన్ను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే వినోదపు పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ నరగంలోని పీవీఆర్, ఐనాక్స్ థియేటర్ల సముదాయం ప్రదర్శనలను రద్దు చేసుకుంది. ఈ సమస్యపై చర్చంచడానికి బుధవారం సాయంత్రం నిర్మాతల మండలి నిర్వాహకులు, థియేటర్ల యాజమాన్యం చెన్నైలో సమావేశమయ్యారు. సమావేశంలో వినోదపు పన్ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అందుకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ఒక రోజు సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసి పోరాటం చేయాలని తీర్మానం చేశారు. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించడానికి 10మంది సభ్యులతో కమిటీని నియమించారు. అయితే థియేటర్ల యాజమాన్యం చేసిన ఈ ప్రతిపాదనను నిర్మాతల మండలి నిర్వాహకులు వ్యతిరేకించారు. శుక్రవారం నుంచే థియేటర్లలో చిత్ర ప్రదర్శనలను నిలిపివేయాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, ప్రకాశ్‌రాజ్ కోరారు. దీనికి థియేటర్ల యాజమాన్యం నిరాకరించింది. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విశాల్, ప్రకాశ్‌రాజ్ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కాగా బుధవారం సాయంత్రం నిర్మాతల మండలి సమావేశమై శుక్రవారం నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇలా ఉండగా ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల థియేటర్ల యాజమాన్యం వినోదపు పన్నును పూర్తిగా రద్దు చేయాలని, సినిమా టిక్కెట్ల ధరను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ, ఇది జరగని పక్షంలో దీపావళి నుంచి థియేటర్లలో ప్రదర్శనలను నిలిపి వేస్తామని హెచ్చరించారు. మధురై, రామనాథపురం, తేని, దిండుగల్, విరుదునగర్, శివగంగై జిల్లాల థియేటర్ల యాజమాన్యం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇలాఉండగా నిర్మాతల మండలి థియేటర్లలో వెంటనే ప్రదర్శనలను నిలిపివేయాలన్న డిమాండ్‌తో కొత్త చిత్రాల విడుదలను నిలిపివేయడం, మరో పక్క ఒక వర్గం థియేటర్ల యాజమాన్యం దీపావళి నుంచి థియేటర్లను మూసి వేస్తామని నిర్ణయం తీసుకోవడం, మరో వర్గం ప్రభుత్వంతో చర్చలు జరపాలని తీర్మానం చేయడంతో చిత్ర పరిశ్రమలో అయోమయ పరిస్థితి నెలకొంది. కాగా కొన్ని థియేటర్ల యాజమాన్యం ప్రస్తుతం ప్రదర్శిస్తున్న చిత్రాలనే కొనసాగించాలని, లేని పక్షంలో ఎంజీఆర్, శివాజీగణేశన్ నటించిన పాత్ర చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ సమస్యకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి. -
తారలు దిగొచ్చేనా?
తారలు దిగొచ్చేనా అని ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చ సాగుతోంది. తారలేంది.. దిగి రావడమేంది.. అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదవండి. కోలీవుడ్‌లో ప్రముఖ నటుల పారితోషికాలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా నిర్మాతలు నిలబడలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న నిర్మాతలు నిలువునా మునిగిపోతున్నారు. పెళ్లాం మెడలో పుస్తులు, ఉన్న ఇళ్లు అమ్మినా సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాబట్టుకోలేక ఆది చిత్రంతోనే అంతం అయిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా నష్టాలకు గురిచేయడంతో చాలామంది నిర్మాతలు చిత్ర రంగం నుంచి బయటపడాలని చూస్తున్నారు. జాగోరో జాగో అన్నట్లు చిత్ర పరిశ్రమ ఆలస్యంగానైనా మేల్కొన్నట్లు తెలిసింది. భారంగా మారిన చిత్ర నిర్మాణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా ప్రముఖ నటీనటుల పారితోషికాలు తగ్గించుకోవాలన్న అంశాలపై యావత్ తమిళ చిత్ర పరిశ్రమ త్వరలో సమావేశం కానుంది. -తమిళసినిమా చిత్ర నిర్మాణ సంఖ్య అధికం.. చిత్ర నిర్మాణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 1990 ప్రాంతంలో ఏడాదికి 80 చిత్రాలు మాత్రమే నిర్మాణమయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 300 వరకూ పెరిగింది. చిన్న బడ్జెట్ చిత్రాల వ్యయం రెండు కోట్లు దాటుతుంటే భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం రూ.60 కోట్లు దాటింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు చిన్న చిత్రాల ఆయువు ఒకటి లేదా రెండు రోజులకు పడిపోయింది. మరో విషయం ఏమిటంటే ఇందులో చాలా మంది నిర్మాతలు కొనుగోలుదారులు లేక పంపిణీదారులు ముందుకు రాక రిస్క్ చేసి సొంతంగా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వారు మలి చిత్రం తీసే అవకాశం ఉండడం లేదు. మరి కొంతమంది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమై చిత్రాలను విడుదల చెయ్యడానికి మొండిగా ప్రయత్నించినా థియేటర్లు దొరకడం లేదు. లింగాకు యాగీ.. సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో నటించిన బాబా, కుచేలన్ చిత్రాలు పరాజయం పొందటంతో ఆ చిత్ర కొనుగోలుదారులకు రజనీకాంత్ నష్టపరిహారం చెల్లించారు. న్యాయంగా చెప్పాలంటే నటులు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. మానవత్వంతో చేసిన రజనీకాంత్‌ను అందరూ అభినందించారు. అలాంటి పరిస్థితే ఇటీవల లింగాకు ఏర్పడింది. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనలు, నిరాహార దీక్షలు అంటూ పెద్ద యాగీనే చేశారు. ఆ చిత్రానికి రజనీకాంత్ నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఇలానే మరికొందరు ప్రముఖ నటులు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తమ తదుపరి చిత్రాలను ఇచ్చి లబ్ధి పొందేలా చేస్తున్నారు. టికె ట్ల వెల తగ్గింపు.. తమిళ చిత్ర పరిశ్రమ ఇలాంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఇటీవల చెన్నై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్ను రాయితీల ఫలం ప్రేక్షకులకే దక్కాలని తీర్పును వెల్లడించింది. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.120 టికెట్ వెలను 85కు తగ్గించాల్సి ఉంటుంది. ఇది నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు దిగ్భ్రాంతి కల్పించే అంశం. టికెట్ ధర తగ్గింపు అనేది తమకు మరింత భారం పెంచుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. దీని నుంచి బయట పడాలంటే చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగించడమే ఏకైక మార్గమనే నిర్ణయానికి వచ్చారు. నష్టపరిహారం చెల్లిస్తున్న నటులు.. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలైనా లాభాలు గడిస్తున్నారా అంటే చాలా మంది పెట్టుబడులు కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వడ్డీల భారంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. మరో పక్క చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోతే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్ట పరిహారం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. చుక్కలు చూపిస్తున్న పారితోషికాలు.. ప్రముఖ నటీనటుల పారితోషికాలు నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాయి. పాపులర్ హీరోలు ఇప్పుడు 25 నుంచి 40 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. యువ హీరోలు 10 నుంచి 20 కోట్లు పుచ్చుకుంటున్నారు. ఇక హీరోయిన్లు తామేమీ తక్కువా అన్నట్లు కోటి నుంచి రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ హాస్యనటుడొకరు రోజుకు 10 లక్షల చొప్పున పారితోషికం నిర్ణయించినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. చిత్రం నష్టాన్ని చవిచూస్తే నటీనటులు 20 శాతం పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా అది అమలు కావడం లేదు. చిత్ర నిర్మాణ వ్యయం తగ్గించడంలో భాగంగా నటీనటులు పారితోషికాలను తగ్గించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చిత్ర ప్రముఖులు త్వరలో సమావేశమై నటీనటుల పారితోషికాల తగ్గింపుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే తారలు దిగివస్తారా? నలిగిపోతున్న నిర్మాతలకు చేయూతనిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. -
సెలబస్: స్వదండకం
కథ, మాటల రచయితగా, దర్శకుడిగా... తెలుగు, కన్నడం, తమిళ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు జనార్దన మహర్షి. కవిగా తన కలం నుంచి ఎన్నో అక్షర సుమాలను వెదజల్లారు. మహర్షి ఫ్లూటిస్ట్ కూడా! వీణ, వయొలిన్లపై సంగీతాన్ని పలికించే తన ఇద్దరు కూతుళ్లతో కలిసి త్వరలో ఒక కచేరీ ఇవ్వాలన్నది ఆయన లక్ష్యం. ప్రియాతి ప్రియమైన పద్మశ్రీ ‘భారతరత్న’ నాకు నేను రాసుకొను ప్రేమలేఖ ఇదే నా మొదటి ప్రేమలేఖ ఎవ్వరికీ రాయనేలేదింత దాకా. ‘నీ’ ప్రేమలో పడి ‘నాకే’ రాస్తున్నా. నన్నడిగారు... ‘నీకెవరంటే ఇష్టమని’ ‘నేనే’ అన్నాను. అంతేకదా... రాజకీయాలైనా రాసక్రీడలైనా, రచనలైనా, సం‘గీతా’లైనా అరువది నాలుగు కళల్లో ఎవడైనా నాకు ఇష్టంగా ఉండాలంటే ముందు వాటిని ఇష్టపడే నాకు నేను ఇష్టుడిగా ఉండాలి కదా! ‘ఎలా ఉన్నావ్’ అని అడిగాడతను ‘నువ్వెలా కోరుకుంటే అలా’ అన్నాను. నాకు నేనెందుకింత ఇష్టమో చెప్పాను ఎందుకంటే... నే స్వయంభుని విల్లంభుని... హయంభుని... జయంభుని నేను తెరిచిన నగలపెట్టెని ఎవరైనా ధరించొచ్చు కానీ నిష్ర్కమించేటప్పుడు నేలపైన, నెలరాజు లాంటి నన్నూ, పెట్టెని వదిలివెళ్లు. పెకైళితే... నగల నగరమే ఉందిగా సూర్యుడికీ చంద్రుడికీ తెలీని సంధి సమయంలో నేను భయాన్ని ఉరివేసి, దుఃఖాన్ని ఎన్కౌంటర్ చేసి, నిరాశకి తలకొరివి పెట్టాను. ఇది మీకూను లాభసాటి. తిరుగులేని ‘తిక్క’ నా సొంతం గొడుగు తడుస్తుందని వర్షంలో విప్పను చెప్పు కాలుతుందని ఎండలో తొడగను ఎందుకిలా అంటే... అంటాను ‘చెప్పు’నేనే... ‘ముళ్లు’ నేనే... ‘వర్షం’ నేనే తడిస్తే వచ్చే జలుబు నేనే. మందు చిటీ రాసే వైద్యుణ్ని, దాన్ని వాడక చింపే పేషెంట్‌ని, అన్నీ నేనే... అదే ‘నువ్వే’నని! హరిని... కరిని... కరిమింగిన వెలగని వెలగ మొలచిన చెట్టుని పెరిగే దేహాన్ని, తరిగే శరీరాన్ని అన్నీ ‘నేనే’... ‘నువ్వే’నని. అత్యధిక అపజయాలని సాధించడంలో నీ అంత విజయుడు లేడు నేనెంత పాతాళంలో ఉన్నానంటే భూమ్మీద ఉన్న మనుషులు నాకు ఆకాశం ఎత్తులో ఉంటారు ఆత్మహత్య చేసుకుందామనే వాళ్లందరూ కూడా నీతో నాలుగు నిమిషాలు గడిపితే... వీడే బతికేస్తున్నాడనే ధైర్యంతో నిండు నూరేళ్లు మిగులుతారు. ఆఖరుగా ఓ మాట. నీకు నేను చెప్పేదేంటంటే... ‘‘ఇష్టం లేకపోతే... ఉలక్కు... పలక్కు... అంతేగానీ కెలక్కు’’... అంతే నేనెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటా.