కొత్త కబురు | Madhavan new movie with Mithran | Sakshi
Sakshi News home page

కొత్త కబురు

Published Mon, Feb 13 2023 1:54 AM | Last Updated on Mon, Feb 13 2023 1:54 AM

Madhavan new movie with Mithran - Sakshi

హీరో మాధవన్‌ కొత్త కబురు చెప్పా రు. తన తర్వాతి సినిమా డైరెక్టర్‌ మిత్రన్‌తో చేయనున్నట్లు పేర్కొన్నారాయన. తమిళ చిత్ర పరిశ్రమలో గత ఏడాది హిట్‌ కొట్టిన చిత్రాల్లో ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో ‘తిరు’) ఒకటి. ధనుష్‌ హీరోగా  నటించిన ఈ సినిమాకు మిత్రన్‌ ఆర్‌.జవహర్‌  దర్శకత్వం వహించారు.

ఆ సినిమా హిట్‌ కావడంతో మిత్రన్‌కి మరో మంచి అవకాశం లభించింది. మాధవన్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.  ‘‘దర్శకుడు మిత్రన్‌తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్‌. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement