మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment