'పుదు వసంతం', 'సూర్యవంశం' లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు విక్రమన్. తెలుగులో 'చెప్పవే చిరుగాలి', 'వసంతం' సినిమాలని డైరెక్ట్ చేశాడు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి అధ్యక్షుడిగాను పనిచేశాడు. కాగా ఈయన భార్య జయప్రియ ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన పరిస్థితి గురించి జనప్రియ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌లో బయటపెట్టారు.
(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
వెన్ను నొప్పి కారణంగా ఆపరేషన్ చేయించుకున్నానని, వైద్యుల తప్పిదం వల్ల ఐదేళ్లుగా మంచానికే పరిమితమైనట్లు జయప్రియ చెప్పుకొచ్చారు. ఆస్పత్రి నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు. తనకు తన భర్త అండగా ఉంటూ ఆస్తులను అమ్మి తనకు వైద్యం అందిస్తున్నారని ఈమె బాధని బయటపెట్టారు. బయటకు కూడా వెళ్లకుండా తన ఆరోగ్యం కోసమే పరితపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దర్శకుడు విక్రమన్ భార్య అనారోగ్యం గురించి తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఆమెకు వైద్య సాయం అందించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్.. విక్రమన్ ఇంటికెళ్లి మరీ ఆయన సతీమణిని పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దర్శకుడు విక్రమన్.. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, ఆరోగ్యశాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
(ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!)
Comments
Please login to add a commentAdd a comment