
సీనియర్ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం హిట్ లిస్ట్. ఆర్కే సెల్యులాయిడ్ పతాకంపై ఇంతకు ముందు తెనాలి, గూగుల్ కుట్టప్పా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దర్శకుడు కేఎస్ రవికుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం హిట్ లిస్ట్. ఆయన శిష్యులు సూర్య కదీర్, కార్తికేయన్‌ల ద్వయం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఇందులో నటి సితార, ఐశ్వర్య దత్తా, మునీశ్ కాంత్, బాలా శరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినయ, కేజీఎఫ్ గరుడా రామచంద్రన్ తదితరులు నటిస్తున్నారు. రామ్ చరణ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకులు తెలిపారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని, తుదిదశకు చేరుకుందనీ తెలిపారు. కాగా ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం అన్నారు. ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం పతాక సన్నివేశాల షూటింగ్ జరుగుతోందన్నారు.
చదవండి: ఆ క్రికెటర్‌ను ప్రేమించా.. కానీ
Comments
Please login to add a commentAdd a comment