తమిళ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, రాజకీయ నాయయకుడు ఆర్ విక్రమన్‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అతడు తనను మోసం చేశాడంటూ విక్రమన్ మాజీ ప్రేయసి, దళితుల కార్యకర్త, న్యాయవాది కిరుబ మునుసామి సంచలన ఆరోపణలు చేస్తోంది. తనపై వేదింపులకు సైతం పాల్పడ్డాడని పేర్కొంది. ప్రస్తుతం విక్రమన్ విడుదలై చిరుదైగల్ కచ్చి(వీసీకే) పార్టీలో ఉండగా.. సదరు పార్టీ తనకు జరిగిన అన్యాయంపై స్పందించి ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది.
నేను అమాయకుడిని
తాజాగా ఈ ఆరోపణలపై విక్రమన్ స్పందించాడు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే ఈ కథలో రెండు కోణాలున్నాయన్నాడు. ఈ పూర్తి గొడవలో అసలైన బాధితుడిని తానేనన్నాడు. తన రాజకీయ, నట జీవితాన్ని దెబ్బ తీసేందుకే ఆమె ఇలా ఆరోపణలు గుప్పిస్తోంది. తనతో పెళ్లికి నిరాకరించానన్న కోపంతోనే ఇదంతా చేస్తోందంటూ వాట్సప్ చాట్ స్క్రీన్‌షాట్లు, కిరుబ రాసిన లేఖల ఫోటోలు ట్విటర్‌లో షేర్ చేశాడు.
నిజంగా వేధిస్తే ఆ లేఖ అర్థమేంటి?
'1. కిరుబ పీహెచ్‌డీ చదవడానికి యూకే వెళ్లినప్పుడు రాసిన ఉత్తరం. ఇది 2022 జూన్ 15న రాసింది. నేను నిజంగా వేధించేవాడినైతే.. ఎవరూ ఇలా లేఖ రాయరు. 2. నా కోసం కొన్న వస్తువులకు నేను కిరుబాకు డబ్బు చెల్లించిన సాక్ష్యాలు. తను నాకు ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేస్తానని చెప్పాను. అన్నట్లుగానే అదే మాట మీద నిలబడ్డాను.. నాపై చేసిన ప్రతి ఆరోపణను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకమీదట నా గురించి ఏ తప్పుడు ఆరోపణలు చేసినా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. చట్టప్రకారమే వాటి సంగతి తేలుస్తాను' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు విక్రమాన్.
అసలేం జరిగిందంటే?
విక్రమన్, కిరుబ ముసుసామి ప్రేమించుకున్నారు. ఏమైందే ఏమో కానీ కొంతకాలంగా వీరు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ఆదివారం నాడు కిరుబ.. విక్రమన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. '2013 నుంచే విక్రమన్ నాకు తెలుసు. ఓ కార్యక్రమానికి నేను గెస్ట్‌గా వెళ్లాను. అందులో విక్రమన్ కూడా పాల్గొన్నాడు. అలా మా పరిచయం మొదలైంది. 2020 ఆగస్టులో లండన్‌కు వెళ్లినప్పుడు అతడు ఎయిర్‌పోర్ట్ వరకు వచ్చి మరీ వీడ్కోలు పలికాడు. అక్కడికి వెళ్లిన రెండు నెలలకే నాతో రొమాంటిక్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు.
కులం పేరిట దూషణలు
తనకు వీసీకే పార్టీ నుంచి పిలుపొచ్చిందని అబద్ధం చెప్పాడు. కేవలం తనకున్న కోరిక వల్ల ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటినుంచి తన రాజకీయ కెరీర్‌కు సపోర్ట్‌గా ఉండమని కోరాడు. ఏదైనా అడ్డు చెప్పానంటే చాలు.. కులం పేరుతో దూషించేవాడు. కులపిచ్చి ఉన్న వ్యక్తితో దూరంగా ఉండటం నయం అనుకున్న ప్రతిసారి క్షమించమని ఏడ్చేవాడు. మాట్లాడమని బతిమాలేవాడు. మారతాడనుకుని ఛాన్స్ ఇచ్చిన మొదట్లో బాగానే ఉండేవాడు. కానీ కొంతకాలానికే ఎప్పటిలానే దూషించడం, ఏడ్చి సానుభూతి సాధించడం జరిగేది.
మేనేజర్‌తో ఎఫైర్.. అడ్డంగా దొరిగాక
తనతో రెండేళ్లు రిలేషన్‌లో ఉన్న తర్వాత అతడితో విడిపోవాలని నిశ్చయించుకున్నాను. నేను అతడికి ఇచ్చిన డబ్బును తిరిగివ్వమన్నాను. అప్పుడు నన్ను బ్లాక్ చేశాడు. 3 నెలలపాటు ప్రయత్నించాను, పట్టించుకోలేదు. తీరా బిగ్‌బాస్ షోలోకి వెళ్లేముందు తనే క్షమాపణలు అడిగాడు. ఎప్పటిలా కలిసుందాం అన్నాడు. మళ్లీ రొమాంటిక్‌గా చాట్ చేశాడు. బిగ్‌బాస్ నుంచి వచ్చాక కూడా నాతో బానే ఉన్నాడు. అయితే అతడి మేనేజర్‌తో పెట్టుకున్న ఎఫైర్ నాకు తెలిసింది. ఓసారి వాళ్లిద్దరూ నాకు అడ్డంగా దొరికిపోయారు. అప్పుడు అతడు నిజం అంగీకరించాడు.
చనిపోదామనకున్నా
ఏడాదిన్నరకాలంగా తనతో రిలేషన్‌లో ఉన్నానని ఒప్పుకున్నాడు. అతడి మాజీ ప్రేమికులు, స్నేహితులు దాదాపు 15 మందిని కలిశాను. తను చాలా దారుణంగా ప్రవర్తిస్తాడని చెప్పారు. నమ్మడం, మోసపోవడం, తిట్లు తినడం, కుంగిపోవడం.. ఇదే పనైపోయింది. ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనై చనిపోదామనుకున్నాను. దీని నుంచి బయటపడేందుకు ఏడాది కాలంగా థెరపీ తీసుకుంటున్నాను అంటూ వాట్సాప్ స్క్రీన్‌షాట్లు షేర్ చేసింది.
After having undergone a great deal of agony over the past few months & a huge disappointment, I'm writing in public. I've known @RVikraman since 2013 when he participated in an event in which I was a guest. When I left for London in Aug 2020, he voluntarily came to send me off. pic.twitter.com/AA2rTxagZm
— Kiruba Munusamy (@kirubamunusamy) July 16, 2023
I deny the allegations made against me by Ms. Kiruba Munusamy in entirety. A coin has two sides likewise this story also has two sides. "There is only one victim in this issue and it is me rather than the person making the accusations against me".
— Vikraman R (@RVikraman) July 17, 2023
We were acquaintances till… pic.twitter.com/IGCFE0PrBl
Comments
Please login to add a commentAdd a comment