heart beat
-
ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!
గుండెకు రూపం ఉంటుంది. హృదయానికి కాదు. గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడు తన హృదయం చేసే ఉద్వేగాలను అదుపు చేసుకోవాలి. అయితే అన్నిసార్లూ అలా ఉండదు. ఒక్కోసారి గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడి గుండె కొట్టకులాడుతుంది. ఆ గుండెను ఎలాగైనా కాపాడాలని పెనుగులాడుతుంది. పరితపిస్తుంది. అలాంటి ఒక అరుదైన కేసు వివరాలివి... దాదాపు రెండేళ్ల కిందట మా దగ్గరికి 32 ఏళ్ల సతీష్ (పేరు మార్చాం) తీవ్రమైన ఛాతీనొప్పి, గుండెదడతో వచ్చాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని చూస్తే అతడి గుండె నార్మల్ కంటే చాలా వేగంగా కొట్టుకుంటూ, ఆగిపోయింది. ఇలాంటప్పుడు కరెంట్‌తో షాక్ ఇచ్చి మళ్లీ కొట్టుకునేలా చేస్తుంటాం. గుండె మరీ బలహీనంగా కొట్టుకుంటున్నప్పుడు లేదా హార్ట్ అటాక్‌తో గుండె ఆగిపోయినప్పుడు కరెంట్‌తో షాక్ ఇచ్చి తిరిగి స్పందించేలా చేయడం మామూలే. సతీష్‌కూ ఇలాగే షాక్ ఇచ్చి ఆగిపొయిన గుండె మళ్లీ స్పందించేలా చేశాం. ఆ తర్వాత వెంటనే అతణ్ణి కాథ్ల్యాబ్కు తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసి చూస్తే అందులో ఏమీ తేడా లేదుగానీ, వేగంగా కొట్టుకుంటున్న అతడి గుండె స్పందనలు నార్మల్ కాలేదు. గుండె బాగా బలహీనంగా ఉంది. లంగ్స్‌లోకి నీరు చేరింది. వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది. గుండె ఇలా వేగంగా కొట్టుకునే కండిషన్‌ను ‘వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా – వీటీ’ అంటారు. ఒకసారి షాక్ తర్వాత... గుండె స్పందించడం మొదలయ్యాక మళ్లీ మునుపటి పరిస్థితి రాకుండా ఉండటానికి అనేక ఇంజెక్షన్లు ఇచ్చాం. కానీ వీటీ అదుపులోకి రాలేదు. మల్టిపుల్ ఇంజెక్షన్స్ తర్వాత కూడా అతడి పరిస్థితి చక్కబడకపోవడంతో చాలా బాధేసింది. పాపం... పెళ్లి వయస్సుకు వచ్చిన కుర్రాడు. సాధారణంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా (వీటీ)ని చక్కదిద్దడానికి పేస్ మేకర్ అమర్చుతారు. ఇది గుండె స్పందనల్లో మార్పులు వచ్చినప్పుడల్లా ఓ చిన్న షాక్‌ను ఉత్పన్నం చేసి, గుండె స్పందనలను సాధారణ స్థితిలోకి వచ్చేలా చేస్తుంది. కానీ అతడికి వస్తున్నది వీటీల పరంపరం. దాన్ని వీటీ స్టార్మ్ అంటారు. అంటే వీటీల తుఫాను. ఇలా ఆగకుండా వస్తున్న వీటి పరంపరకు పేస్‌మేకర్ అమర్చినా లాభం ఉండదు. అది వేగంగా మాటిమాటికీ కరెంట్‌తో షాక్‌లిస్తూ పోతుంటే అందులోని బ్యాటరీ అయిపోతుంది తప్ప... ఇంక పెద్దగా ప్రయోజనం ఉండదు. బయటి నుంచే ఓవర్ డ్రైవ్ పేసింగ్ చేసే ఓ చిన్న పేస్ మేకర్ పెట్టి చూశాం. లాభం లేదు. వైద్య చికిత్సల్లో ఇలాంటి పరిస్థితిని ఎన్ని రకాలుగా ట్యాకిల్ చేయవచ్చో అన్నీ చేశాం. సిటీలోని ఇతర కార్డియాలజిస్టులతోనూ మాట్లాడాం. ఇలా వీటీ వచ్చినప్పుడల్లా బ్లడ్‌ప్రెషర్ డౌన్ అయిపోతోంది. కొన్నిసార్లు 50కు కూడా పడిపోయింది. వీటీలు ఆగడం లేదు. ఊపిరితిత్తుల్లో నీరు. పేషెంట్ వెంటిలేటర్ మీద. అలా వెంటిలేటర్ మీద ఉంచాల్సిరావడంతో కిడ్నీలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఎక్కడెక్కడి మెడిసిన్స్ ఇచ్చాం. ఎన్నెన్నో ఇంజెక్షన్లు చేశాం. నార్మలైజ్ చేయడానికి ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నీ చేసి చూశాం. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. చిన్న వయసు. లోకం అంతగా చూడని కుర్రాడు కళ్ల ముందే చనిపోతున్నాడనిపించింది. చనిపోవడం ఖాయం. ఒక చివరి ప్రయత్నంగా మెడికల్ లిటరేచర్ అంతా చదివా. ‘‘సింపథెక్టమీ’’ అనే ఓ ప్రోసీజర్ ఉంటుంది. ఇందులో నెర్వ్‌కు సంబంధించిన గ్యాంగ్లియాన్స్కు ఇంజెక్షన్ ఇస్తే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లోని నరాలు నెమ్మదిస్తాయి. దాంతో వీటీ ఆగుతుంది అని లిటరేచర్‌లో ఉంది. పేషెంట్ బంధువులను అడిగితే ‘ఎలాగూ చనిపోయేలా ఉన్నాడు. ఆ ప్రోసీజర్ చేస్తే బతుకుతాడేమో చేయండి సర్’ అన్నారు.దాంతో సింపథెక్టమీ చేసే నా జూనియర్... డాక్టర్ విజయభాస్కర్ అని ఉన్నాడు. అతణ్ణి పిలిపించాం. వెంట్రిక్యులార్ ట్యాకికార్డియాకు సింపథెక్టమీ చేయడం మెడికల్ లిటరేచర్‌లో రాసి ఉన్న చాలా అరుదైన ప్రోసీజర్. నిత్యం మెడికల్ ప్రాక్టీస్‌లో అనుసరించేది కాదు. కేవలం ప్రయోగాత్మకంగా చేయాలనుకున్నది మాత్రమే. ప్రపంచం మొత్తమ్మీద ‘వీటీ’కి అప్పటికి జరిగిన సింపథెక్టమీ ప్రోసీజర్లు చాలా తక్కువ. పేషెంట్‌ను క్యాథ్ల్యాబ్లోకి తీసుకెళ్లాం. వెంటనే సింపథెక్టమీకి పూనుకున్నాం. వెన్నుపూస ఇరువైపులా ఉన్న గ్యాంగ్లియాన్స్కు ఇంజెక్షన్ ఇవ్వడం కోసం డాక్టర్ విజయభాస్కర్ సహాయంతో ‘బై లేటరల్ సర్వైకల్ సింపథెక్టమీ’ అనే ప్రోసీజర్ చేశాం. ఒకసారి సింపథెక్టమీ చేశాక... ఒకటి రెండు సార్లు వీటీ వచ్చింది. అయితే ‘ఓవర్‌డ్రైవ్ పేసింగ్’తో తగ్గిపోయాయి. ఆ తర్వాత మళ్లీ వీటీ రాలేదు. వీటీ ఆగిపోగానే నెమ్మదిగా బాధితుడి కండిషన్ మెరుగవ్వడం మొదలైంది. మూత్రం రావడం మొదలైంది. డయాలసిస్ ఆపేశాం. వెంటిలేటర్ కూడా తీసేశాం. ఆ తర్వాత పేస్ మేకర్ అమర్చాం. రెండేళ్ల తర్వాత మొన్ననే ఓసారి అతడు వచ్చాడు. పరీక్షల్లో గుండె కండిషన్ బాగా మెరుగైనట్లు కనిపించింది. ఈమధ్య పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇదో టీమ్ వర్క్. ఓ బృందంలా చాలా ఫోకస్డ్గా పనిచేశాం. చావు తప్ప మరో దారే లేదనుకున్న ఓ బాధితుడి జబ్బును పూర్తిగా నార్మల్ చేయడం మా కార్డియాలజిస్టులకు దేవుడిచ్చిన ఒక అరుదైన అవకాశమని భావిస్తున్నాం. డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ (చదవండి: కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?) -
ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. భాష ఏదైనా సరే సబ్ టైటిల్స్‌తోనే కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన మలయాళ వెబ్ సిరీస్ పోచర్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా మరో సరికొత్త కంటెంట్‌తో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ అదేంటో చూద్దాం. అయాలి నటి అనుమోల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ హార్ట్ బీట్. మెడికల్ జానర్లో దీపక్ సుందర్రాజన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో చాలామంది కొత్తవారు నటించారు. ఈ రొమాంటిక్ యూత్‌పుల్ సిరీస్ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను అమెరికన్ షో గ్రేస్ అనాటమీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, చారుకేష్, జయరావు, గిరి ద్వారకేష్, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్
యాపిల్ వాచ్ భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గుండెకు స్పందలను సంబంధించిన హిస్టరీని ట్రాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లకు అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు కూడా ఇప్పుడు ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. AFib అనేది క్రానిక్ హార్ట్ కండిషన్‌ను సూచిస్తుంది. ఇది ఒక రకమైన అరిథ్మియా. గుండె దడ , వేగంగా, క్రమరహితంగా కొట్టుకోవడం. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుంది. అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గుండె-ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, ఇతర వైద్య చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. (US H1B visa: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త) ఎవరికి పనిచేస్తుంది? ♦ యాపిల్‌వాచ్ 4, తర్వాత వాచ్ ఏఓస్ 9లోని వినియోగదారులకు ఈ ఫీచర్ పని చేస్తుంది. ♦ భారతదేశంలోని వాచ్ యూజర్లు ఐఫోన్లో ఐఓఎస్ 16ని ఉపయోగించాలి ♦ AFib హిస్టరీ ఖచ్చితంగా 22 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అని యాపిల్ సపోర్ట్ పేజీ స్పష్టంచేసింది. ఇదీ చదవండి : శ్రావణం అలా వచ్చిందో లేదో,రూ. 60వేల ఎగువకు బంగారం ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి? ♦ ఐఫోన్లో హెల్త్యాప్ ఓపెన్ చేసి, బ్రౌజ్ క్లిక్ చేసి హార్ట్ ఆప్షన్నుఎంచుకోవాలి ♦ AFib హిస్టరీ సెట్ చేసిన స్టార్ట్ అప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మీ పుట్టిన తేదీని నమోదు చేయండి ♦ AFibతో బాధపడుతున్నారని వైద్యుడు నిర్ధారించిన వైనాన్ని ధృవీకరించాలి ♦ తరువాత AFib చరిత్ర, ఫలితాలు , లైఫ్ ఫ్యాక్ట్ గురించి మరింత తెలుసుకునేలా కంటిన్యూపై క్లిక్ చేయాలి. -
వావ్..కంగ్రాట్స్ మేడమ్.. మీరు గర్భవతి అయ్యారు!!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన స్మార్ట్ వాచ్‌ల పనితీరు చర్చాంశనీయమయ్యాయి. ఇప్పటికే పలు ప్రమాదాల నుంచి యూజర్లను సురక్షితంగా రక్షించిన యాపిల్ వాచ్‌లు.. తాజాగా ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని తనకు ముందే గుర్తు చేశాయి. యాపిల్ వాచ్‌లో హార్ట్ మానిటరింగ్, ఈసీజీ, ఆక్సిమీటర్‌తో పాటు ఆరోగ్యపరమైన ఫీచర్లు ఉన్నాయి. కాబట్టే వినియోగదారులు హెల్త్ పరమైన సమస్యల్ని ముందే గుర్తించేందుకు ఆ సంస్థ వాచ్‌లను ధరిస్తుంటారు. అయితే తాజాగా యాపిల్ వాచ్ ధరించిన ఓ మహిళకు..ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని, త్వరలో డాక్టర్‌ను సంప్రదించాలంటూ ఆలెర్ట్లు (హార్ట్‌బీట్) పంపించడం ఆసక్తికరంగా మారింది. రెడ్డిట్ ప్రకారం.. 34ఏళ్ల మహిళ యాపిల్ వాచ్‌ను ధరించింది. ఈ తరుణంలో వాచ్ ధరించిన కొన్ని రోజుల తర్వాత ఆమె హార్ట్ బీట్‌లో పెరిగింది. సాధారణంగా ‘నా హార్ట్ రేటు 57 ఉండగా..అది కాస్తా 72కి పెరిగింది. వాస్తవంగా హార్ట్ రేటు గత 15 రోజులుగా ఎక్కువగా ఉన్నట్లు యాపిల్ వాచ్ హెచ్చరించింది. ఓ వ్యక్తి హార్ట్ రేటు పెరగడానికి అనేక కారణాలుంటాయి. అందుకే అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా. అందులో నెగిటీవ్ వచ్చింది.’ అదే సమయంలో గర్భం దాల్చిన మొదటి వారాల్లో మహిళ హార్ట్ బీట్ పెరుగుతుందని, ఇదే విషయాన్నితాను హెల్త్ జర్నల్‌లో చదివినట్లు పోస్ట్‌లో పేర్కొంది. తర్వాత తాను ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్‌కు వెళ్లగా..డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి నాలుగు వారాల గర్బణీ అని నిర్ధారించినట్లు చెప్పారని తెలిపింది. హార్ట్ రేట్ : గర్భం దాల్చిన మహిళల హార్ట్ రేటు నిమిషానికి 70 నుంచి 90 వరకు కొట్టుకుంటుంది చదవండి👉 స్మార్ట్ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది! -
ఇన్నోసెంట్ హార్ట్ మర్మర్.. చిన్నారుల గుండె గుసగుస..!
గుండెల్లో గుసగుసలు అన్న మాట ఇక్కడ కవిత్వమో, భావుకతో కాదు. ఇది పక్కా వాస్తవం. కొందరు చిన్నపిల్లల్లో ఇది చాలా సాధారణం. దీన్నే ఇన్నోసెంట్ హార్ట్ మర్మరింగ్ అంటుంటారు డాక్టర్లు. ఈ గుసగుసలు ఎందుకో, అప్పుడేం చేయాలో తెలిపే కథనం ఇది. నెలల పిల్లలు మొదలుకొని... ఏడాదీ లేదా రెండుమూడేళ్ల పిల్లలను డాక్టర్లు స్టెతస్కోప్‌తో పరీక్షించినప్పుడు కొంతమంది చిన్నారుల్లో గుసగుస శబ్దం (మర్మర్) వినపడుతుంది. అలా వినగానే ‘ఇదేమిటి?... ఇదేదో తేడాగా ఉందే!’ అనిపిస్తుంది. కానీ అలా వినిపించినప్పటికీ దాదాపు చాలా కేసుల్లో తేడా ఏమీ ఉండదు. ఇది చాలావరకు నిరపాయకరమైన కండిషన్. అందుకే దీన్ని ఫంక్షనల్, బినైన్, ఫ్లో మర్మర్ లేదా స్టిల్ మర్మర్ అంటుంటారు. మర్మర్ మర్మమేమిటి? మర్మర్ మర్మమేమిటని పరిశీలిస్తే... ఇదేమైనా గుండె ఆకృతి (స్ట్రక్చరల్) లేదా నిర్మాణపరమైన (అనటామికల్) కారణాలతో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అంతా నార్మల్ అయితే ఈ శబ్దం ఎక్కడిది అనే అనుమానం వస్తుంది. అయితే ఈ శబ్దమంతా రక్తప్రవాహానిది. గుండెలోకి రక్తం వస్తున్నప్పుడు కలిగే ప్రవాహపు ఆటంకాలు (ఫ్లో డిస్ట్రబెన్స్)గానీ లేదా రక్తం అక్కడ సుడులు తిరగడం (ఫ్లో టర్బ్యులెన్సెస్), ఆ శబ్దం ప్రకంపనలు (రెసొనెన్సెస్) వల్ల ఇలా జరగవచ్చు. ఒక్కోసారి ఏ సమస్యా లేకపోయినా శబ్దం వినిపించవచ్చు. అందుకే చాలా సందర్భాల్లో ఇది ఏమాత్రం అపాయం కలిగించని సమస్యగా డాక్టర్లు చెబుతుంటారు. ఇది ఎంతమంది పిల్లల్లో? ఎవరిలో? పుట్టిన పిల్లల్లో కనీసం సగం మందికి... అంటే 50 శాతం మంది పిల్లల్లో ఈ హార్ట్ మర్మర్ ఉంటుంది. పుట్టిన పిల్లలు మొదలుకొని... చిన్నారుల్లో ఏదో ఒక దశలో ఇది కనిపించవచ్చు. ఇక ఏ చిన్నారిలోనైనా ఇది రావచ్చు. అయితే జ్వరంతో బాధపడే పిల్లల్లోనూ లేదా గుండె వేగంగా కొట్టుకునేవారిలోగానీ లేదా ఉద్వేగాలకు గురైనప్పుడు గుండె వేగం పెరిగే పిల్లల్లో సాధాణంగా ఈ కండిషన్ కనిపిస్తుంది. పెరిగాక ఈ కండిషన్ తగ్గిపోయినప్పటికీ... కొందరిలో వారు వ్యాయామం చేస్తున్నప్పుడు, బాగా ఉద్వేగానికి గురైనప్పుడు శబ్దం మళ్లీ వినపడవచ్చు. లక్షణాలేమిటి? సాధారణంగా కనిపించే గుండె స్పందనలు కాకుండా... కాస్తంత రక్తప్రవాహపు శబ్దాలు వినిపించడం తప్ప మరే రకమైన ఇతర లక్షణాలూ వీళ్లలో ఉండవు. ఒకవేళ వాళ్లలో ఇంకా ఏవైనా లక్షణాలు కనిపిస్తే అవి మాత్రం గుండెకు ఆపాదించకూడదు. పరీక్షలు ఏవైనా అవసరమా? స్టెతస్కోప్‌తో విన్నప్పుడు నిపుణులైన డాక్టర్లకు గుండె శబ్దం, లయను బట్టి అది సాధారణమా లేక ఏదైనా సమస్య (అబ్నార్మాలిటీ) ఉందా అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ల ఆధ్వర్యంలో కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. పిల్లల ఆరోగ్య చరిత్రను బట్టి ఆ పరీక్షలేమిటన్నది నిర్ణయిస్తారు. సాధారణంగా ఈసీజీ, అటు తర్వాత ఎకోకార్డియోగ్రామ్తో అది సాధారణమా, అసాధారణమా అన్నది తెలిసిపోతుంది. ఒక్కోసారి గుండె, ఊపిరితిత్తుల పరిస్థితి తెలుసుకోడానికి ఓ సాధారణ ఎక్స్–రే సరిపోతుంది. చికిత్స ఏదైనా ఉందా? చాలా సందర్భాల్లో ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. ఈ చిన్నారులు, పెద్దపిల్లలుగా ఎదిగే సమయానికి ‘గుండె గుసగుసలు’ వాటంతట అవే తగ్గిపోవచ్చు. చిన్నతనంలో ఇలా హార్ట్ మర్మర్ ఉన్న పిల్లలు ఎదిగాక... వారు పూర్తిగా నార్మల్ వ్యక్తుల్లాగే పెరుగుతారు. అంతే ఆరోగ్యంగా ఉంటారు. మరేదైనా కారణాలతో వారికి గుండె సమస్యలు రావచ్చేమోగానీ... భవిష్యత్తులో వారికి వచ్చే గుండె సమస్యలకు ఇది మాత్రం కారణం కాబోదు. అందుకే హార్ట్ మర్మర్ అంటూ రిపోర్ట్ వచ్చే పిల్లల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు చిన్నపిల్లల వైద్యులూ... చిన్నారుల గుండెనిపుణులు. -
మరణించిన శిశువు బతికుందని..
సూర్యాపేట క్రైం: శిశువుకు హార్ట్ బీట్ లేకున్నా బతికుందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు రిపోర్టు ఇచ్చారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి ప్రాణం లేని శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని హాస్పిటల్‌పై బంధువులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన మరిపెద్ది లావణ్యకు పురిటినొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని మాధవి ఆస్పత్రికి ఆదివారం ఉదయం తీసుకొచ్చారు. డాక్టర్ సలహా మేరకు లావణ్యకు దగ్గర్లోని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. భర్త శ్రీకాంత్‌గౌడ్ మరోసారి ఆపిల్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్లు మృత శిశువును బయటికి తీశారు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌పై దాడి చేశారు. జన్యు సంబంధిత వ్యాధితో శిశువు మృతి చెందినట్లు డాక్టర్ మాధవి వివరణ ఇచ్చారు. -
ఒక్క లబ్డబ్తోనే గుట్టు పట్టేస్తుంది..
హార్ట్ ఫెయిల్యూర్‌ను ముందుగానే కచ్చితంగా గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ యంత్రం ఒకే ఒక్క లబ్డబ్తోనే సమస్యను గుర్తించగలగడం విశేషం. అరవై ఐదేళ్ల పైబడ్డ వారిలో కనీసం 10 శాతం మంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణిస్తుంటారు. శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేయడంలో గుండె విఫలం కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. కారణాలేవైనా.. ఈ పరిస్థితిని గుర్తించడం మాత్రం కష్టం. కొన్ని రోజులపాటు ఈసీజీ తీసి పరిశీలించడం ద్వారా డాక్టర్లు హార్ట్ ఫెయిల్యూర్‌కు ఉన్న అవశాలను అంచనా వేస్తారు. అయితే సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఈసీజీ సమాచారాన్ని వేగంగా విశ్లేషించే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా గుండె ఒక్కసారి కొట్టుకోగానే సమస్యను గుర్తించగలిగారు. దీనిపై మరిన్ని విస్తృత పరిశోధనలు చేపడతామని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్‌వాచీలు, హెల్త్ బ్యాండ్స్లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంటున్నారు. చిన్ని గుండె సిద్ధమైంది త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవి బిర్లా ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణాలతో చిన్న సైజు గుండెను అభివృద్ధి చేశారు. తెల్ల రక్త కణాలను మూలకణాలుగా మార్చడం ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుంది. దీంతో ఈ మూలకణాలు కార్డియో మయోసైట్స్గా రూపాంతరం చెందుతాయి. పోషకాలు కొన్నింటిని కలిపి.. ప్రత్యేకంగా తయారు చేసిన బయో ఇంక్ సాయంతో తాము పొరలు పొరలుగా గుండెను తయారు చేశామని, బయోలైఫ్ 4డీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన రవి బిర్లా తెలిపారు. ఒక రోగి తాలూకూ నిజమైన గుండె వివరాల ఆధారంగానే ఈ కృత్రిమ గుండె తయారైందని తెలిపారు. నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత దాన్ని శరీరం లోపలి పరిస్థితులను తలపించే బయో రియాక్టర్లో ఉంచినప్పుడు కణాలన్నీ కండరాల మాదిరిగా దృఢంగా మారాయని, ఫలితంగా అనుకన్న పరిమాణం కంటే తక్కువ సైజు గుండె ఏర్పడిందని తెలిపారు. ఇదే టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తే గుండెలను కృత్రిమంగా తయారు చేసి అమర్చుకునే రోజులు దగ్గరకొచ్చినట్లే అని అంచనా వేస్తున్నారు. -
విందాం.. చిట్టిగుండె చప్పుడు!
మాతృత్వంలోనే ఉంది మహిళ జన్మసార్థకం. అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. బిడ్డ కడుపులో³డగానే తల్లి ఎనలేని సంతోషాన్నిపొందుతుంది. మరి గర్భస్థ శిశువు భూమిమీద పడకముందే హృదయస్పందనలు తెలుసుకుంటే అంతకుమించిన ఆనందం ఆ తల్లికి మరేముంటుంది. అదిగో ఆ దిశగా కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. గర్భంలో ఉన్న బేబీ హార్ట్ బీట్‌ను స్పష్టంగా వినేందుకు ‘సునో’ పేరుతో ఓ డివైజ్‌ను కనుగొన్నారు నగరానికి చెందిన ఇద్దరు యువకులు. ప్రస్తుతం ఈ డివైజ్ గర్భిణులు తమ బేబీ హృదయ స్పందనలు వినేందుకు ఉపయుక్తంగా మారింది.. హిమాయత్‌నగర్: నగరంలోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన పవన్‌కుమార్ బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్) పూర్తి చేశారు. ఎండీ సాధ్ గుంటూరులోని ఎన్ఆర్ఐ కళాశాల్లో ఇంజినీరింగ్ చేశారు. ‘డుకేరా టెక్నాలజీస్’లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ సమయంలో కంటిచూపు లేని వారి కోసం ప్రత్యేకంగా షూస్‌ను రూపొందించారు. ఇవి అంధులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. అదే ఉత్సాహంతో మరేదైనా కొత్త ఆవిష్కరణ చేయాలనే తపనతో పరిశోధన చేయసాగారు. ఈ నేపథ్యంలోనే గర్భిణులకు ఉపయుక్తంగా ఉండే ఉపకరణం ఏదైనా కనుగొనాలనే ఆలోచన వచ్చింది. దీంతో బేబీ హార్ట్ బీట్ వినేందుకు ఓ డివైజ్‌ను రూపొందించారు. వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి బేబీపై దంపతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. భార్యభర్తల మధ్య జరిగే సంభాషణ కూడా బేబీ గురించే ఉంటుంది. ఈ డివైజ్ ద్వారా హార్ట్‌బీట్‌ను స్నేహితులు, బంధువులతోనూ షేర్ చేసుకోవచ్చు. హార్ట్‌బీట్ వింటున్న సమయంలో యాప్‌లో షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని ఎంచుకుని నచ్చిన వారికి ఒక్క క్లిక్‌తో బేబీ హార్ట్‌బీట్‌ను షేర్ చేసుకోవచ్చు. నార్మల్డెలివరీ కోసం ప్రత్యేక తరగతులు.. ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ లెక్కల ప్రకారం ఇతర దేశాల్లో శస్త్రచికిత్సలు 10 నుంచి15 శాతం నమోదవుతున్నాయి. మన దేశంలో 23 నుంచి 75 శాతం నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో సిజేరియన్లు 75 శాతం నమోదవుతున్నట్లు ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ స్పష్టం చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పవన్, ఎండీ సాధ్‌లు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఈ నెల చివర్లో చైల్డ్ బెర్త్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్‌తో ప్రెగ్నెన్సీ ఉమెన్స్‌కి ఆన్లైన్లో క్లాసెస్‌ను చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి బేబీ డెలివరీ అయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే అన్ని విషయాలను ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెబుతారు. ప్రస్తుతానికి దీనిని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా దీనిలో రిజిస్టరైన వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారికి కన్వినెంట్‌గా ఉన్న సమయంలో క్లాసెస్ వినొచ్చు. దీని ద్వారా సిజేరియన్లు తగ్గి నార్మల్ డెలివరీకి మార్గం సులభమవుతుందని చెబుతున్నారు పవన్, సాద్. ఇలావినవచ్చు.. రిసీవర్, ఎక్స్టెన్షన్ బాక్స్, రెండు కేబుళ్లతో ఎలక్రానిక్ డివైజ్‌ను రూపొందించారు. దీనికి ‘సునో’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ డివైజ్ ఆన్లైన్లో రూ.2500, మార్కెట్లో రూ.3 వేలకు లభిస్తోంది. గర్భిణుల కోసం దీనిని కొనుగోలు చేయవచ్చు. ముందుగా మొబైల్లో ‘సునో’ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలి. అనంతరం రీసీవర్కు రెండు కేబుల్స్‌ని కనెక్ట్ చేయాలి. ఈ రెండు కేబుళ్లల్లో ఒకటి మొబైల్‌కు పెట్టే ఆడియో కేబుల్, మరొకటి రిసీవర్‌కు పెట్టేది. ఈ రెండు కనెక్ట్ చేశాక యాప్‌లోని ఆప్షన్స్‌ని ఎంచుకుని డివైజ్‌ను గర్భిణి తన పొత్తికడుపుపై పెట్టుకొని బేబీ బీట్‌ను స్పష్టంగా వినవచ్చు. గర్భస్థ శిశువుకు 7 నెలలు నిండిన తర్వాత నుంచి ఈ హార్ట్‌బీట్ వినవచ్చని పవన్, సాద్‌లు చెబుతున్నారు. -
ధూమపానానికి దూరం కాకుంటే..
లండన్ : ధూమపానంతో గుండె కొట్టుకునే వేగం లయతప్పే ఊప్రమాదం 45 శాతం అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. రోజుకు తాగే ప్రతి పది సిగరెట్లతో ఆర్టియల్ ఫిబ్రిలేషన్గా పిలువబడే అసంబద్ధ హార్ట్‌బీట్ ముప్పు 14 శాతం పెరుగుతుందని అథ్యయనం పేర్కొంది. పొగతాగడంతో వచ్చే పెనుముప్పు కారణంగా మీరు ఇప్పటికే పొగతాగుతుంటే తక్షణమే దాన్ని మానివేయాలని, పొగతాగకుంటే అసలు దాని జోలికెళ్లొద్దని అథ్యయన రచయిత, ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన డాక్టర్ డాగ్ఫిన్ అనే స్పష్టం చేశారు. స్మోకింగ్‌తో ఆర్టియల్ ఫిబ్రిలేషన్ రిస్క్ అధికమని, అయితే పొగతాగడానికి తక్షణమే స్వస్తిపలకడం ద్వారా దీన్ని నివారించవచ్చని అన్నారు. ప్రపంచంలోని ప్రాణాంతక స్ర్టోక్ట్స్లో 30 శాతం ఆర్టిఫిషియల్ ఫిబ్రిలేషన్ వల్లనే ముంచుకొస్తున్నాయని చెప్పారు. అథ్యయన వివరాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. -
మొబైల్..గుండెకు చేటు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్‌తో గంటల తరబడి కుస్తీ పడితే హృదయ స్పందన వేగం పెరగడం తథ్యమట. నిత్యం 5–6 గంటలకు మించి సెల్‌ఫోన్‌తో కుస్తీపట్టడమే కాదు.. షర్ట్ జేబులో ఎక్కువసేపు భద్రపరచుకునే వారికీ కష్టాలు తప్పవట. నగరంలో 18–40 ఏళ్ల వయసున్న 10,000 మంది యువతపై దక్కన్ మెడికల్ కళాశాల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. సెల్ వినియోగంతో రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ విడుదలై ఆరు వేల మందికి తల, హృదయంపైనున్న కణ జాలంపై దుష్ప్రభావం పడినట్లు తేలింది. మానవ కణజాలం 0.08 వాట్/కేజీ రేడియో ఫ్రీక్వెన్సీని తట్టుకుంటుందని.. కానీ ప్రస్తుతం పలు బ్రాండ్ల మొబైల్స్ నుంచి సుమారు 1.6 వాట్/కేజీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ విడుదలవుతోందని హెచ్చరిస్తున్నారు. మరికొన్నింటిలో 2.0 వాట్/కేజీ కూడా ఉత్పన్నమవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో హృదయ స్పందన వేగం పెరుగుతోందని.. ఇది ఏళ్లపాటు కొనసాగితే గుండె సంబం ధిత వ్యాధులు తథ్యమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు. తల, ఛాతిలోని కణజాలం దెబ్బతినడం, హృదయ స్పందన వేగం పెరగడం, గుండె దడ, తలనొప్పి వంటి విపరిణా మాలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇంట్లో లేదా ఆఫీసులో ఉన్న సమయంలో ఇయర్ ఫోన్స్ వినియోగించి మొబైల్లో మాట్లాడాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
తల్లీబిడ్డ సేఫ్
సాక్షి కథనంపై స్పందించిన ప్రశాంతి ఆస్పత్రి యాజమాన్యం గుండె జబ్బుగల గర్భిణికి ఉచితంగా ఆపరేషన్ రెక్కాడితే డొక్కాడని పేద గిరిజన కుటుంబం వారిది. భర్తతో ఆనందంగా జీవిస్తున్న ఆ మహిళను పిడుగులాంటి వార్త భయాందోళనకు గురిచేసింది. కడుపులో బిడ్డను మోస్తున్న ఆమె హృదయ స్పందనలు నిమిషానికి సాధారణ స్థితిని మించి 167 సార్లు కొట్టుకుంటుండడంతో డెలివరీ చేసేందుకు వైద్యులు వెనుకడుగు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దంపతులకు ‘సాక్షి’ అండగా నిలి చింది. ‘హృదయ వేదన’ శీర్షికతో ఆగస్టు 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి హన్మకొండలోని ప్రశాంతి ఆస్పత్రి వైద్యు లు స్పందించారు. నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డను రక్షించారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. న్యూశాయంపేట : గూడూరు మండలం కేశ్యాతండాకు చెందిన వోంకుడోతు మహేందర్, భారతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎలాంటి జబ్బు లేని భారతికి ఒకసారి గుండెనొప్పి వచ్చింది. మహబూబాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకొని మందులు వాడుతోంది. ఈ క్రమంలో మూడో సంతానం కో సం మరోసారి భారతి గర్భం దాల్చింది. వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆమెకు కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందిగా డాక్టర్ సూచించారు. హన్మకొండలో కార్డియాలజిస్టును సంప్రదించగా గుండె మామూలు స్పందన కంటే ఆధికంగా ఉందని, ప్రసవ సమయంలో గుండెనొప్పి వస్తే తల్లీ,బిడ్డకు చాలా ప్రమాదమని చెప్పారు. కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు సమక్షంలో ఆపరేషన్ చేసి ప్రసవం చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. తమ దగ్గర అన్ని డబ్బులు లేవని బోరున విలపించిన ఆ దంపతులు ఇంటికి చేరుకున్నారు. అప్పటి వర కు భారతి ప్రసవానికి మరో నెల సమ యం ఉంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి దీనావస్థ గురించి సాక్షిలో ‘హృద య వేదన’ శీర్షికతో ఆగస్టు 4న కథనం ప్రచురితం కాగా హన్మకొండ మచిలీ బజార్‌లోని ప్రశాంతి ఆస్పత్రి యాజ మాన్యం స్పందించింది. ఆ మహిళకు ఉచితంగా వైద్యం అందిస్తామని ముందుకొచ్చింది. రిస్క్‌తో కూడుకున్న పేషెం ట్ను ఆస్పత్రిలో చేర్చుకొని నెల రోజుల పాటు ఉచిత ౖÐð ద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. ఈ క్రమంలో ఈ నెల 5న కార్డియాలజిస్ట్ సిద్ధార్థ ప్రసాద్, గైనకాలజిస్ట్ ప్రశాంతిమోహన్, మహేష్‌కుమా ర్, నిమోటాలజిస్ట్ నిఖిల్కులకర్ణి వైద్యబృందం సమక్షంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి ఆమెను ప్రాణాపా యంనుంచి కాపాడారు.ఎలాంటి ఇబ్బం దులు లేకుండా భారతి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందభాష్పాలు వెల్లివిరిశాయి. సేవా దృక్పథంతో ముందుకొచ్చాం.. సేవా దృకృథంతో ముందుకొచ్చి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించామని ప్రశాంతి ఆస్పత్రి చైర్మన్ టి.మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అయినా చాలెంజ్‌గా తీసుకున్నామని తెలిపారు. డబ్బు ఆశతో కాకుండా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రాణభిక్షపెట్టి ఆదుకున్నానన్నారు. సమావేశంలో డాక్టర్లు నిఖిల్కులకర్ణి, మహేష్‌కుమార్ ఉన్నారు. ‘సాక్షి’కి రుణపడి ఉంటాం మాకు అండగా నిలిచిన ‘సాక్షి’ పత్రికకు రుణపడి ఉంటాం. లక్షలు ఖర్చవుతాయనగానే మాకు భయమైంది. గతంతో వైద్యఖర్చుల కోసం ఉన్న రెండెకరాల్లో ఓ ఎకరం అమ్మి వైద్యం చేయించాను. అప్పటికి నా భార్య భారతి బతుకుతుందో లేదో భయం ఉండేది. ప్రశాంతి ఆస్పత్రి డాక్టర్లు దేవుళ్లలా ముందుకొచ్చి ఉచితంగా ఆపరేషన్ చేశారు. వారికి, సాక్షికి జీవితాంతం రుణపడి ఉంటాం. – వాంకుడోతు మహేందర్ -
'మన హృదయ స్పందన ఒకేలా ఉంటుంది'
-
'మన హృదయ స్పందన ఒకేలా ఉంటుంది'
భారత్, ఆఫ్రికా దేశాల సమావేశంతో ప్రపంచంలో మూడోవంతు జనాభా ఒకచోటుకు చేరుకున్నట్లయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సులో మాట్లాడుతూ ఆయిలా చెప్పారు. 125 కోట్ల భారతీయులు, 125 కోట్ల ఆఫ్రికన్ల హృదయ స్పందన తీరు ఒకేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఇది కేవలం ఇండియా, ఆఫ్రికాల మధ్య సమావేశం మాత్రమే కాదని, ప్రపంచంలో మూడోవంతు ప్రజల ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఇక్కడ కనపడుతున్నాయని అన్నారు. ప్రపంచంలో మనది ఒకే గొంతుగా మాట్లాడామని, మన భాగస్వామ్యం బలోపేతం అయ్యిందని నరేంద్ర మోదీ చెప్పారు. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలే కాక అంతకంటే ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల కోసం తాము సాయం చేస్తామని, అక్కడ రోడ్లు, విద్యుత్ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, మీ వనరులకు విలువను జోడిస్తామని ఆఫ్రికా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. -
మీ గుండెచప్పుడే... పాస్వర్డ్!
మొబైల్ ఫోన్లు, పీసీలు, ట్యాబ్లెట్లు... కారు, ఇంటి తలుపులను సైతం ఇకపై మీ గుండె చప్పుడుతోనే ఓపెన్ చేసేయొచ్చు. ఇందుకు కావలసిందల్లా జస్ట్ మీ చేతికి ఓ రిస్ట్‌బ్యాండ్‌ను కట్టుకోవడమే. అవును.. గుండెచప్పుడును బట్టి మనుషుల్ని గుర్తించే సరికొత్త రిస్ట్‌బ్యాండ్‌ను టొరంటోలోని ‘బయోనిమ్స్’ కంపెనీ పరిశోధకులు తయారుచేశారు. ‘నైమీ’ అనే ఈ రిస్ట్‌బ్యాండ్‌పై ఉండే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) సెన్సర్లపై కొన్ని సెకన్లపాటు చేతితో తాకితే చాలు. ముందుగానే రికార్డు అయిన మీ గుండెచప్పుడుతో పోల్చి చూసుకుని ఇది బ్లూటూత్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తుంది. వేలిముద్రలు, కనుపాపలే కాదు... గుండె కొట్టుకునే విధానంలో కూడా మనిషికి మనిషికీ మధ్య తేడాలుంటాయట. దీన్నిబట్టే ఈ రిస్ట్‌బ్యాండ్ అసలు మనిషిని గుర్తిస్తుందట. ఇప్పుడున్న బయోమెట్రిక్ పద్ధతుల కన్నా ఇది మరింత భద్రమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు.