మాట్లాడుతున్న ఆస్పత్రి చైర్మన్ మోహన్‌రావు, చిత్రంలో మహేందర్, భారతి దంపతులతో శిశువు
-
సాక్షి కథనంపై స్పందించిన ప్రశాంతి ఆస్పత్రి యాజమాన్యం
-
గుండె జబ్బుగల గర్భిణికి ఉచితంగా ఆపరేషన్
రెక్కాడితే డొక్కాడని పేద గిరిజన కుటుంబం వారిది. భర్తతో ఆనందంగా జీవిస్తున్న ఆ మహిళను పిడుగులాంటి వార్త భయాందోళనకు గురిచేసింది. కడుపులో బిడ్డను మోస్తున్న ఆమె హృదయ స్పందనలు నిమిషానికి సాధారణ స్థితిని మించి 167 సార్లు కొట్టుకుంటుండడంతో డెలివరీ చేసేందుకు వైద్యులు వెనుకడుగు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దంపతులకు ‘సాక్షి’ అండగా నిలి చింది. ‘హృదయ వేదన’ శీర్షికతో ఆగస్టు 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి హన్మకొండలోని ప్రశాంతి ఆస్పత్రి వైద్యు లు స్పందించారు. నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డను రక్షించారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.
న్యూశాయంపేట : గూడూరు మండలం కేశ్యాతండాకు చెందిన వోంకుడోతు మహేందర్, భారతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎలాంటి జబ్బు లేని భారతికి ఒకసారి గుండెనొప్పి వచ్చింది. మహబూబాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకొని మందులు వాడుతోంది. ఈ క్రమంలో మూడో సంతానం కో సం మరోసారి భారతి గర్భం దాల్చింది. వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆమెకు కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందిగా డాక్టర్ సూచించారు. హన్మకొండలో కార్డియాలజిస్టును సంప్రదించగా గుండె మామూలు స్పందన కంటే ఆధికంగా ఉందని, ప్రసవ సమయంలో గుండెనొప్పి వస్తే తల్లీ,బిడ్డకు చాలా ప్రమాదమని చెప్పారు. కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు సమక్షంలో ఆపరేషన్ చేసి ప్రసవం చేయాల్సి ఉంటుందన్నారు.
ఇందుకు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. తమ దగ్గర అన్ని డబ్బులు లేవని బోరున విలపించిన ఆ దంపతులు ఇంటికి చేరుకున్నారు. అప్పటి వర కు భారతి ప్రసవానికి మరో నెల సమ యం ఉంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి దీనావస్థ గురించి సాక్షిలో ‘హృద య వేదన’ శీర్షికతో ఆగస్టు 4న కథనం ప్రచురితం కాగా హన్మకొండ మచిలీ బజార్‌లోని ప్రశాంతి ఆస్పత్రి యాజ మాన్యం స్పందించింది. ఆ మహిళకు ఉచితంగా వైద్యం అందిస్తామని ముందుకొచ్చింది. రిస్క్‌తో కూడుకున్న పేషెం ట్‌ను ఆస్పత్రిలో చేర్చుకొని నెల రోజుల పాటు ఉచిత ౖÐð ద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. ఈ క్రమంలో ఈ నెల 5న కార్డియాలజిస్ట్ సిద్ధార్థ ప్రసాద్, గైనకాలజిస్ట్ ప్రశాంతిమోహన్, మహేష్‌కుమా ర్, నిమోటాలజిస్ట్ నిఖిల్‌కులకర్ణి వైద్యబృందం సమక్షంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి ఆమెను ప్రాణాపా యంనుంచి కాపాడారు.ఎలాంటి ఇబ్బం దులు లేకుండా భారతి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందభాష్పాలు వెల్లివిరిశాయి.
సేవా దృక్పథంతో ముందుకొచ్చాం..
సేవా దృకృథంతో ముందుకొచ్చి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించామని ప్రశాంతి ఆస్పత్రి చైర్మన్ టి.మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అయినా చాలెంజ్‌గా తీసుకున్నామని తెలిపారు. డబ్బు ఆశతో కాకుండా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రాణభిక్షపెట్టి ఆదుకున్నానన్నారు. సమావేశంలో డాక్టర్‌లు నిఖిల్‌కులకర్ణి, మహేష్‌కుమార్ ఉన్నారు.
‘సాక్షి’కి రుణపడి ఉంటాం
మాకు అండగా నిలిచిన ‘సాక్షి’ పత్రికకు రుణపడి ఉంటాం. లక్షలు ఖర్చవుతాయనగానే మాకు భయమైంది. గతంతో వైద్యఖర్చుల కోసం ఉన్న రెండెకరాల్లో ఓ ఎకరం అమ్మి వైద్యం చేయించాను. అప్పటికి నా భార్య భారతి బతుకుతుందో లేదో భయం ఉండేది. ప్రశాంతి ఆస్పత్రి డాక్టర్లు దేవుళ్లలా ముందుకొచ్చి ఉచితంగా ఆపరేషన్ చేశారు. వారికి, సాక్షికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– వాంకుడోతు మహేందర్