ప్రేమ వివాహం చేసుకున్న తమకు ఇరుకుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. గుత్తిలోని పైమాల వీధికి చెందిన పవ¯ŒS, తాడిపత్రి రోడ్డు కాలనీకి చెందిన సన మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.
విషయం తెలిశాక పెద్దలు తమను విడదీసే అవకాశం ఉందని భావించిన ఇద్దరూ గుత్తికి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదుచచేశారు. ఎస్‌ఐ రామాంజనేయులు ఇరువురి తల్లిదండ్రులనూ స్టేష¯ŒSకు పిలిపించారు. ఇద్దరూ మేజర్లని, ఇష్ట్రపకారమే పెళ్లి చేసుకున్నారని, వారిపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, భయపెట్టినా నేరంగా పరిగణిస్తామని చెప్పి పంపారు.