gooty
-
ఏఎల్ఎం హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు
సాక్షి, అనంతపురం: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న అశోక్ హత్యకేసులో మిస్టరీని గుత్తి పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యనే హతమార్చినట్లుగా తేల్చారు. వివరాలను గుత్తి పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. పెద్దవడుగూరులో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న చెట్నేపల్లికి చెందిన అశోక్ ఈ ఏడాది ఏప్రిల్ 12న చెట్నేపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద నీటి కుంటలో పడి మృతి చెందాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత హత్యగా నిర్ధారణ కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలోనే అశోక్ భార్య కవిత ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బసినేపల్లి నివాసి హరికృష్ణతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కవిత.. తమ అనుబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. చదవండి: (పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..) ఏప్రిల్ 12న చెట్నేపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి కుంట వద్ద ఒంటరిగా అశోక్ మద్యం సేవిస్తున్నట్లుగా తెలుసుకుని కవిత, హరికృష్ణ అక్కడకు చేరుకున్నారు. మాటల్లో అశోక్ చేత ఫుల్‌గా మద్యం తాగించి అనంతరం కుంటలోకి వేసి తొక్కి హతమార్చారు. అనంతరం మద్యం మత్తులో కుంటలో పడి తన భర్త మృతి చెందాడంటూ పోలీసులకు కవిత ఫిర్యాదు చేసింది. లోతైన దర్యాప్తుతో ఈ కేసులోని మిస్టరీని ఛేదించి, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందిని డీఎస్పీ చైతన్య అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే కాబోయే వరుడు..?
గుత్తి రూరల్: యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన శివశంకర్ ప్రసాద్‌రెడ్డి మూర్ఛ వ్యాధితో మృతి చెందాడు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ యువతితో ఈ నెల 13వ తేదీన వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో గుత్తిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు పంచేందుకు వచ్చాడు. పత్రికలు ఇచ్చి అందరినీ ఆహ్వానించిన అనంతరం స్వగ్రామం బయల్దేరాడు. అయితే ఎంగిలిబండ శివారుకు చేరుకోగానే మూర్ఛ రావడంతో శివశంకర్ రోడ్డు పక్కకు వాహనం ఆపేసి కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు, వాహనదారులు అతడు కోలుకునేందుకు సపర్యలు చేయగా.. శివశంకర్ ఆలోపే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం ఏర్పడింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతోంది. -
వాగులో కొట్టుకుపోతూ బయటపడి.. ఒక్కసారిగా..
-
వాగులో కొట్టుకుపోతూ బయటపడి.. ఒక్కసారిగా..
సాక్షి, అనంతపురం: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుత్తి మండలం కొజ్జేపల్లి వాగులో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే బయటకు తీసుకురాగానే ఒక్కసారిగి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. మృతుడు గొల్లలదొడ్డి చెర్లోపల్లికి చెందిన శ్రీరాములుగా గుర్తించారు. కాగా ఇదే వాగులో మరో లారీ, ఆటో కూడా చిక్కుకున్నాయి. అయితే స్థానికులు వెంటనే స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. -
కారును ఢీకొన్న లారీ, పెళ్లింట విషాదం
సాక్షి, గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు వద్ద ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె తండ్రి మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో పెళ్లికూమార్తె సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహ కార్యక్రమానికి కర్నూలు నుంచి కొండాపురం వెళుతున్న ఓ కారును లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నల్లవాగు వద్ద ఘోర ప్రమాదం కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో నల్లవాగు వద్ద నిన్న (శనివారం) జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకి చేరింది. కర్ణాటక రాయచూర్ జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన గురుస్వామి తన కుటుంబసభ్యులతో కలిసి నిన్న ఉదయం ఎమ్మిగనూరుకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. స్థానికంగా ఉన్న సోదరిని చూసి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే మంత్రాలయం గ్రామ శివారులోని నల్లవాగు వద్ద బైక్ అదుపు తప్పి పక్కనున్న ఇనుప దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుస్వామి కుమారుడు మహేష్ (4) అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నభార్య నాగవేణి, కుమార్తెలు మౌనిక, శైలజ ఆదివారం ఉదయం మృతి చెందారు. మరోవైపు గురుస్వామి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
-
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
సాక్షి, అనంతపురం : గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహ్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో కేఎమ్ రాము అనే విద్యార్థి బీఎస్సీ (డిగ్రీ) చదువుతున్నాడు. కొంత కాలంగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన రాము బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్‌టాక్ చేశాడు. ఈ వీడియోలను టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసిన అనంతరం రైలు కిందపడి రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె ) -
గూగుల్‌లో సీఐ నెంబర్ కనుక్కొని వీడియోలు పంపి
సాక్షి, గుత్తి రూరల్: ‘అన్న నన్ను క్షమించండి.. ఏమి చేయాలో నాకు అర్థమవడం లేదు. మిమ్మల్ని మోసం చేయాలని కాదు.. నేను బతుకుతానో లేదో తెలియదు.. నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.. నన్ను క్షమించండి’ అంటూ నోటి నుంచి నురగలు కక్కుకుంటూ వీడియో తీసి శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని గుత్తి సీఐ రాజశేఖర్‌రెడ్డి రక్షించారు. కర్నూలు పాత బస్టాండు ప్రాంతానికి చెందిన జంగం కన్నప్ప కుమారుడు జంగం విశాల్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతడిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కర్నూలు నుంచి అనంతపురానికి ద్విచక్రవాహనంలో వెళ్తూ గుత్తి మండలం కొత్తపేట వద్ద ఆగాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సోదరుడు నందకు వాట్సాప్‌లో పంపాడు. వీడియో చూసిన నంద వెంటనే గూగుల్ ద్వారా గుత్తి సీఐ రాజశేఖర్‌రెడ్డి సెల్‌ఫోన్ నంబర్ కనుక్కొని వీడియోలు పంపి సమాచారం అందించాడు. వెంటనే సీఐ తన సిబ్బందితో కలసి కొత్తపేట శివారులో 44వ నంబర్ జాతీయ రహదారికి రెండు వైపులా గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తపేట గ్రామానికి సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న విశాల్‌ను గుర్తించి వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపారు. విశాల్ ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు సీఐ తెలిపారు. సకాలంలో నిండు ప్రాణాన్ని కాపాడి పోలీసులపై గౌరవాన్ని పెంచిన సీఐ రాజశేఖర్‌రెడ్డిని పట్టణ ప్రజలు అభినందించారు. -
వర్షాలతో పులకించిన ‘అనంత’
సాక్షి, అనంతపురం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ‘అనంత’ పులకించింది. ఈ ఏడాది వర్షాభావంతో తడారిపోయిన ‘అనంత’కు జలకళ సంతరించుకుంది.నాలుగు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం డివిజన్లలో కాస్త తక్కువగా ఉన్నా మిగతా డివిజన్లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అందులోనూ తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల, ఉరవకొండ, అనంతపురం, ధర్మవరం ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. ఈ నాలుగు రోజుల్లోనే ఏకంగా 67 మి.మీ సగటు నమోదు కావడం విశేషం. గురువారం కూడా జిల్లా అంతటా 16 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమమయమయ్యాయి. అక్కడక్కడ రహదారులు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఉద్యాన తోటలు వంద ఎకరాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తిం చారు. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించగా, అక్కడక్కడ చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలు, పండ్ల తోటలు పచ్చదనం సంతరించుకోగా రబీ సాగుకు గంపెడాశతో రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 16 మి.మీ సగటు నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 71.9 మి.మీ నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ ఖరీఫ్‌లో 283.5 మి.మీ గానూ 26 శాతం తక్కువగా 209.5 మి.మీ నమోదైంది. ఇంకా వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తుండడంతో అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్న రబీ వ్యవసాయం జోరుగా సాగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నల్లరేగడి భూములు కలిగిన తాడిపత్రి, గుంతకల్లు డివిజన్లలో మంచి వర్షాలు పడటంతో పప్పుశనగ సాగు విస్తీర్ణం పెరిగే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. చదవండి : వాల్మీకి కాదు... ‘గద్దలకొండ గణేష్ -
కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి
సాక్షి, గుత్తి(అనంతపురం) : కానిస్టేబుల్ దంపతులపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గుత్తి మండలం బసినేపల్లి తండా సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసినేపల్లి తండాకు చెందిన ఎం.వెంకటేష్ నాయక్ ఓడీచెరువులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన తన భార్యతో కలిసి బుధవారం రాత్రి బైక్‌లో బసినేపల్లి తాండాకు బయలుదేరాడు. తండా సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద దుండగులు దారిలో కంప చెట్లు అడ్డం పెట్టారు. వెంకటేష్ నాయక్ ద్విచక్ర వాహనం దిగి కంప చెట్లను తొలగిస్తున్నాడు. ఇంతలో అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు దుండగులు ఒక్క ఉదుటున దంపతులపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి వద్దనున్న రెండు సెల్ఫోన్లు, కొంత డబ్బు లాక్కొని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ దంపతులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండావాసులు బ్రిడ్జి వద్దకు వచ్చి దుండగుల కోసం గాలించారు. అయితే అప్పటికే దుండగులు పారిపోయారు. -
గుత్తి ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్
-
ముసుగు దొంగల హల్చల్
సాక్షి, గుత్తి: ముసుగు ధరించిన దొంగలు గుత్తిలో హల్చల్ చేశారు. అర్ధరాత్రి వేళ తాళం వేసిన ఇంటిలోకి చొరబడ్డారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రోడ్డులో పరుపుల తయారీదారుడు మస్తాన్‌వలి నివాసం ఉంటున్నాడు. వేసవి కావడంతో మస్తాన్‌వలి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి మంగళవారం రాత్రి మేడపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఇంటి కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించారు. నాలుగు గదుల్లో ఉన్న బీరువాలను తెరిచి, అందులో దాచి ఉంచిన 13 తులాల బంగారు ఆభరణాలు (5 తులాల రాళ్ల నెక్లెస్, 3 తులాల సాదా నెక్లెస్, ఒకటిన్నర తులం చంప చారలు, తులం రాళ్ల కమ్మలు, తులం నల్లపూసల దండ, అర తులం డాలర్, అర తులం ఉంగరం, అర తులం జుంకీలు), 42 తులాల వెండి ఆభరణాలు (30 తులాల, 12 తులాల నాలుగు జతల వెండి పట్టీలు) తో పాటు 35 వేల నగదు అపహరించుకుపోయారు. బుధవారం సమాచారం అందుకున్న ఎస్ఐ గోపాలుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బిహారీలే పనేనా..? అనంతపురం క్లూస్‌టీం, వేలిముద్రల నిపుణులతో పాటు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి చోరీ జరిగిన ఇల్లు, పరిసరాలలో ఆధారాల కోసం అన్వేషించారు. చోరీ జరిగిన ఇంటి పక్కన సూపర్ మార్కెట్ ఉంది. అక్కడి సీసీ కెమెరాలో చోరీ ఉదంతం నిక్షిప్తమైంది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కిటికీని తొలగించి ఒక్కొక్కరుగా లోపలికి ప్రవేశించినట్లు తెలిసింది. వీరు ఆరు అడుగుల పొడవు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఆనవాళ్లను బట్టి దొంగలు బిహారీలై ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే రోడ్డులోనే హీరో బైక్‌ల షోరూంలో ఇలాంటి వ్యక్తులే ప్రవేవించి రూ.లక్షన్నర నగదుతో పాటు విలువైన వస్తువులు అపహరించారు. అపుడు కూడా సీసీ ఫుటేజీని పరిశీలించారు. మస్తాన్‌వలి ఇంటిలో చోరీ చేసిన దొంగలు, హీరో షోరూమ్‌లో చోరీ చేసి వ్యక్తులకు చాలా దగ్గరి పోలిక ఉన్నట్లు స్పష్టమైంది. -
వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నాయకులు అధికారమదంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తునే ఉన్నారు. తాజాగ గుత్తి మండలం ధర్మాపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత రామాంజనేయుపై టీడీపీ నేతలు రాజేంద్ర, బాలరాముడు దాడి చేసి తీవ్రంగ గాయపరిచారు. ఈ దాడికి గల కారణం రామాంజనేయులు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాడనే అక్కసుతోనే అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నేత రామాంజనేయులును ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు
గుత్తి: గుత్తి పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ. 12 లక్షల విలువ చేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో గురువారం దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐ ప్రభాకర్‌గౌడ్‌లు తెలిపారు. గత యేడాది కాలంగా అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో తరుచూ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో అనంతపురం ఎస్పీ అశోక్ కుమార్ అఫెండర్స్ సర్వ్లైన్స్ సిస్టమ్ (పాత నేరస్తుల నిఘా కార్యక్రమం) ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా గతంలో బైక్ చోరీలు ఎక్కడెక్కడ జరిగాయి? వాటి అఫెండర్స్ ఎవరు? అనే విషయాలను ఆరా తీశారు. ఈ క్రమంలో గుత్తిలో గత మూడు మాసాల్లో 8 బైక్‌లు చోరీకి గురయ్యాయి. నిఘా కార్యక్రమం ఆధారంగా గుత్తి సీఐ ప్రభాకర్‌గౌడ్ బైక్ దొంగలను పసిగట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అంతరాష్ట్ర బైక్ దొంగల గుట్టు రట్టైంది. గుత్తి మండలం ఊబిచెర్లకు చెందిన బాచుపల్లి రామకృష్ణ, చండ్రపల్లి సుంకన్నలు పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించారు.గుత్తిలో 8 బైక్‌లు, తాడిపత్రిలో 5, డోన్‌లో 1, పత్తికొండలో 1, వజ్రకరూర్‌లో 1, యాడికిలో 1, అనంతపురంలో 5, కడపలో 2 బైక్‌లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే రాజు అనే మరోదొంగ పరారైనట్లు చెప్పారు. బైక్ దొంగలను పట్టుకోవడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్ఐలు వలిబాషు, యువరాజు, పోలీసు కానిస్టేబుళ్లు మోహన్, గణేష్‌లకు నగదు రివార్డును అందజేశారు. -
ఆ దారుణానికి నిద్రమత్తే కారణం ..
గుత్తి: కావేరి ఫుష్కర స్నానాలు చేసి వారంతా ఎంతో సంతోషంగా గడిపారు. తిరిగి గమ్యస్థానాలకు వెళ్తుండగా మార్గంమధ్యలో వారి వాహనం బోల్తా పడింది. అనంతరపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామ శివార్లలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ ఘట్కేసర్కు చెందిన కళా శారద(60), సోదరి విజయలక్ష్మి, సొహైల్, విశ్రాంత ఉద్యోగి కళా లక్ష్మణరావు(65), భార్య అనురాధ, శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణారెడ్డి, అల్వాల్ లోతుకుంటకు చెందిన భార్యభర్తలు సత్యనారాయణ, అరుణలు ఈ నెల 15న హైదరాబాద్ నుంచి క్వాలిస్ వాహనంలో కర్ణాటకలోని శ్రీరంగపట్టణంలో జరుగుతున్న కావేరి పుష్కరాలకు వెళ్లారు. శ్రీనివాస్, సొహైల్‌లు తప్ప మిగిలిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. శనివారం రాత్రి మైసూర్ నుంచి ఘట్కేసర్కు బయలుదేరారు. తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డుకు కుడివైపు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి రోడ్డు మధ్యలో డివైడర్‌పై అగిపోయింది. వాహనం నుంచి భారీగా పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన యువకులు వాహనాన్ని అపి స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. శారద(60) అప్పటికే మృతి చెందగా లక్ష్యణరావు(65) తీవ్రంగగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. తీవ్రంగా గాయపడిన వారు రక్షించండి అంటూ హాహాకారాలు చేశారు. 40 నిమిషాల పాటు 108 వాహనం కోసం ఎదురు చూసిన రాకపోవడంతో ఆ ముగ్గురు యువకులు తమ వాహనంలోనే లక్ష్మణరావును ఆస్పత్రికి తరలించారు. చికిత్సపారంభించేలోపే ఆయన మృతిచెందాడు. లక్ష్మణరావు, శారదలు వరుసకు అన్నాచెల్లెళ్లు. మిగతా క్షతగాత్రులను హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. -
గుత్తిలో కలకలం
ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. వివాహిత మెడపై కత్తిపెట్టి నగలు దోపిడీ అడ్డుకోబోయిన ఇంటి యజమాని హత్య గుత్తిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి తెగబడ్డారు. వివాహితను గదిలో బంధించి ఆమె మెడపై కత్తి పెట్టి నగలు దోచుకున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇంటి యజమాని అయిన జీపు డ్రైవర్‌ను డంబెల్‌తో తలపై మోది హతమార్చారు. రూ.5లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించారు. గుత్తి: గుత్తి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జీపు డ్రైవర్ హత్యను చేసి, ఆయన భార్యను కత్తితో బెదిరించి నగలు, నగదుతో ఉడాయించారు. సీఐ ప్రభాకర్‌గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కుమ్మర వీధిలోని కుక్కల బావి సమీపాన బలిజ సుధాకర్(30), వెంకటేశ్వరిలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రామ్‌చరణ్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుధాకర్ సొంతంగా టాటా సుమో (జీపు) పెట్టుకుని బాడుగలకు తిప్పుతూ జీవనం సాగించేవాడు. శుక్రవారం కూడా బాడుగలకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మిద్దెమీద నుంచి లోపలికి ప్రవేశించారు. అలికిడి విని అప్రమత్తమైన సుధాకర్ వారిపై తిరగబడ్డాడు. ముగ్గురు వ్యక్తులు సుధాకర్‌పై దాడి చేస్తుండగా.. మరొక వ్యక్తి భార్య వెంకటేశ్వరిని పక్క గదిలోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి నోటికి గుడ్డ కట్టి బంధించాడు. ఆమె మెడపై కత్తి పెట్టి బంగారు లాంగ్ చైన్, తాళిబొట్టు, ఉంగరాలు, కమ్మలు లాక్కున్నారు. తర్వాత సుధాకర్‌పై నలుగురు కలిసీ దాడి చేశారు. ఎదురుదాడికి ప్రయత్నిస్తుండటంతో పక్కనే ఉన్న డంబెల్ తీసుకుని తల వెనుక బలంగా మోదారు. దీంతో సుధాకర్ గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బీరువాను తెరిచి అందులో ఉన్న రూ. 5 లక్షల నగదు, 30 తులాల విలువైన బంగారు ఆభరణాలు (లాంగ్ చైన్లు, కమ్మలు , ఉంగరాలు, వడ్డాణం) ఎత్తుకెళ్లారు. దొంగలు వెళ్లిపోయాక వెంకటేశ్వరి కట్లు విప్పుకుని గదిలో నుంచి బయటకు వచ్చింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. ‘నా భర్తను చంపేశారం’టూ గట్టిగా అరిచింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, ఏఎస్ఐ ప్రభుదాస్, హెడ్ కానిస్టేబుళ్లు చెన్నమయ్య, నాగరాజు, కుమార్, ఐడీ పార్టీ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు. డాగ్, క్లూస్ టీమ్‌ల పరిశీలన బలిజ సుధాకర్ హత్య జరిగిన ఇంటిని అనంతపురానికి చెందిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలించింది. క్లూస్ టీమ్ నిపుణులు హత్యకు వినియోగించిన డంబెల్, గోడపై పడిన రక్తపు మరకలు, బీరువా, తలుపులపై ఉన్న వేలి ముద్రలను పరిశీలించారు. డాగ్ మొదటి ఇంటిలోకి ప్రవేశించి తర్వాత మిద్దె ఎక్కింది. తర్వాత కిందకు దిగి ఇంటికి ఎడమ పక్కకు పరుగుతీసింది. అటు తర్వాత కొంత దూరంలో ఉన్న బారే హిమామ్ పీర్ల మకాన్ వరకు వెళ్లి అక్కడ ఆగిపోయింది. తిరిగి సుధాకర్‌ను హత్య చేసిన ప్రాంతానికి చేరుకుంది. నిందితులను పట్టుకుంటాం : డీఎస్పీ హత్య సమాచారం తెలియగానే తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి శనివారం గుత్తికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. నలుగురు వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి డంబెల్‌తో తలపై మోది హత్య చేశారన్నారు. త్వరలోనే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. హత్యపై అనుమానాలు జీపు డ్రైవర్ సుధాకర్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య వెంకటేశ్వరి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. నలుగురు వ్యక్తులు వచ్చి తనను బంధించి భర్త సుధాకర్‌ను హత్య చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. నిజంగా దొంగలే అయి ఉంటే సుధాకర్‌తో పాటు వెంకటేశ్వరిని కూడా హతమార్చేవారు. బంధీగా ఉన్న ఆమె ఎలా తప్పించుకుని బయటకు వచ్చిందో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. డాగ్ స్క్వాడ్ కూడా ఇంటిలోనే కాసేపు తిరిగింది. సుధాకర్ హత్య చేయబడిన గదిలోకి, వంట గదిలోకి రెండు సార్లు డాగ్ వెళ్లింది. దీంతో కొత్తవారు ఇంటిలోకి ప్రవేశించలేదని తేటతెల్లమవుతోంది. ఒక వేళ దొంగలు వచ్చి ఉంటే బీరువా ఉన్న గదిలోకి వెళ్లకుండా వంటగదిలోకి ఎందుకు వెళతారు అనే సందేహం కలుగుతోంది. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా సభ్యుడు అరెస్ట్
గుత్తి: మునిసిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన నకిలీ సర్టిఫికెట్ల ముఠా సభ్యుడు మనోజ్‌ను మంగళవారం కర్నూల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెట్నేపల్లికి చెందిన మనోజ్ కర్నూలుకు చెందిన నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్‌తో జతకట్టాడు. గ్యాంగ్‌లో సుమారు పది మంది దాకా ఉన్నారు. సదరు గ్యాంగ్ సభ్యులు అనంతపురంలో ఉంటూ డిగ్రీ, పీజీ, బీఎడ్, డీఎడ్, బీపీడీ వంటి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇటీవల కర్నూలుకు చెందిన కొంతమంది వ్యక్తులు తమకు బీఎడ్, డిగ్రీ సర్టిఫికెట్లు కావాలని నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్‌ను కలిసి వేలాది రూపాయలు సమర్పించుకున్నారు. అయితే సర్టిఫికెట్లు ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పుకోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు పోలీసులను వెంట బెట్టుకుని నకిలీ గ్యాంగ్ సభ్యుడు మనోజ్ నివాసముండే చెట్నేపల్లికి వచ్చారు. వీరిని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన మనోజ్‌ను పట్టుకుని కర్నూలుకు తీసుకెళ్లారు. నకిలీ సర్టిఫకెట్ల గ్యాంగ్‌లో ఎంత మంది ఉన్నారు? వారు ఏ ప్రాంతాలకు చెందిన వారు? ఇంత వరకు ఎన్ని నకిలీ సర్టిఫికెట్లను తయారు చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అరుణాచల్ రిజిస్ట్రేషన్ బస్సులు సీజ్
గుత్తి రూరల్: పట్టణ శివార్లలోని టోల్గేట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను శనివారం వేకువజామున రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండి అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న ఆరెంజ్, యెల్లో ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సీజ్ చేసి గుత్తి ఆర్టీసీ డిపోకు తరలించారు. బస్సుల యజమానులపై కేసులు నమోదు చేసి, కోర్టుకు పరుస్తామని అధికారులు తెలిపారు. -
మద్యం షాపులు తొలగించాలని విద్యార్థుల రాస్తారోకో
గుత్తి: పట్టణంలోని అనంతపురం, కర్నూల్ రోడ్లలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపులను తొలగించాలని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరస్పాండెంట్ వీకే సుధీర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమల్లేశ్వరరెడ్డి నేతృత్వంలో సుమారు 1500 మంది విద్యార్థులు 25 బస్సుల్లో గుత్తికి వచ్చి అనంతపురం రోడ్డులో మద్యం దుకాణాలకు ఎదురుగా రాస్తారోకో చేపట్టారు. గేట్స్ కాలేజీ విద్యార్థులు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న మద్యం షాపుల నిర్వాహకులు వాటిని మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. సుమారు అరగంట సేపు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ బాలికల హాస్టల్, కళాశాలలతో పాటు నివాసగృహాల మధ్య మూడు బ్రాందీ షాపులు ఏర్పాటు చేయడం ఎంత వరకూ సమంజసమన్నారు. విద్యార్థినులు కళాశాలకు రావాలంటే జంకుతున్నారని, మహిళలు ,పిల్లలు అటువైపు వెళ్లడానికే భయాందోళన చెందుతున్నారన్నారు. మహిళలు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో సమాచారం తెలుసుకున్న సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. సమస్య ఉంటే ఎక్సైజ్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడాలని చెప్పడంతో విద్యార్థులంతా ఎక్సైజ్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ బైఠాయించి, ధర్నా చేశారు. అనంతరం ఎక్సైజ్ సీఐ రాజశేఖర్‌గౌడ్‌తో చర్చించారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
గుత్తి: ఇంటి నుంచి బయటకెళ్లిన యువకుడు మూడు రోజుల అనంతరం బావిలో శవమై తేలాడు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని బెస్త వీధికి చెందిన విజయబాబు(26) ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సురేష్ దుకాణంలో పని చేసేవాడు. గత బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయబాబు దుకాణానికి వెళ్లలేదు. ఇంటికీ రాలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే శుక్రవారం పట్టణ శివారులోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్న మునిసిపాలిటీ బావిలో శవమై తేలాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఏఎస్ఐ ప్రభుదాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
రెండో తరగతి విద్యార్థి అదృశ్యం
గుత్తి : పట్టణంలోని అగాపే కేర్ హోమ్‌లో నివాసముంటూ ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎస్.అబ్దుల్ హఫీజ్ శనివారం అదృశ్యమైనట్లు అగాపే కేర్ హోమ్ (రైడ్స్) పీడీ జోసఫ్ ఆదివారం సీఐ ప్రభాకర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
మద్యం.. యుద్ధం
గుత్తిలో ఉద్రిక్తత జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహిళల రాస్తారోకో పోలీసుల సమక్షంలోనే వైన్‌షాపు యజమానుల దాడి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దంపతులు, మహిళలకు గాయాలు పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాధితుల ధర్నా ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై జనం తిరగబడ్డారు. తక్షణమే దుకాణాలు అక్కడి నుంచి తొలగించాలంటూ ఉద్యమించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గుత్తిలో రాస్తారోకో చేశారు. ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రశ్నించిన మహిళలు, నాయకులపై మద్యం షాపుల యజమానులు, సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దంపతులతోపాటు పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుత్తి (గుంతకల్లు) : గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో నాలుగు రోజుల క్రితం ఒకే చోట ఐదు మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్సైజ్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా మొదట రెండు షాపులు ప్రారంభించారు. మరో మూడు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోతుందని బీసీ కాలనీ మహిళలు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను తొలగించాలని సివిల్, ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా దుకాణాలు యథావి«ధిగా నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం మద్యం దుకాణాలకు ఎదురుగా రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పీరా, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లయ్యయాదవ్, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, కౌన్సిలర్లు కళ్యాణి, రాజేశ్వరి, నజీర్, కమలాక్షమ్మ మాట్లాడుతూ టీడీపీ సర్కార్ బడులు మూసివేసి బార్లు, బ్రాందీషాపులు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యనే మద్యం తాగుతున్నారని, మహిళలకు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోందని మహిళలు వరలక్ష్మి, లక్ష్మీదేవి, గౌరమ్మ, పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు ఎత్తేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహిళలపై మద్యం షాపు నిర్వాహకుల దాడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై మద్యం దుకాణం నిర్వాహకులు శ్రీనివాసులు, వలి, నారాయణస్వామిలు తమ అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా మహిళలను అని చూడకుండా వరలక్ష్మి, కళ్యాణి, రాజేశ్వరిలను కాళ్లతో తన్ని, ఇష్టానుసారం కొట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూడా దాడికి పాల్పడ్డారు. బండరాయితో తలపై మోదడంతో వైఎస్సార్ సీపీ నాయకుడు జానప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఈ తతంగమంతా పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం. ఆందోళనకారుల అరెస్ట్ ఘర్షణ పూర్తయిన తర్వాత ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి వచ్చారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు పీరా, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు మల్లయ్యయాదవ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, రంగస్వామి, జిల్లా అధికార ప్రతినిధి పాశం రంగస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, శివ, రాజశేఖర్ రెడ్డి, ఆనందరెడ్డి, నిర్మల, రంగప్రసాద్ రాయల్, ప్రసాద్ గౌడ్, బేల్దారి చంద్రలను బలవంతంగా అరెస్టు చేసి జీపులో తరలిస్తుండగా మహిళలు అడ్డుపడ్డారు. పోలీసులు వారికి నచ్చజెప్పి, ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీసు స్టేషన్లోనే ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. అనంతరం మహిళలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా, మండల నాయకులు నారాయణస్వామి, జీపు రమణ,కొత్తపల్లి రంగయ్య, బసినేపల్లి భాస్కరరెడ్డి, గోపాల్, అబ్బేదొడ్డి కాంతారెడ్డి, రమాకాంత్‌రెడ్డి, భీమలింగ తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమంటున్న మహిళాలోకం
– జనావాసాల్లో మద్యం షాపుల ఏర్పాటుపై ఆగ్రహం – జిల్లా వ్యాప్తంగా నిరసనలు అనంతపురం సెంట్రల్ : జనావాసాల మధ్య మద్యం షాపుల ఏర్పాటు చేస్తుండటంపై మహిళాలోకం భగ్గుమంటోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. అనంతపురంలో గుత్తిరోడ్డులో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించకపోతే ధ్వంసం చేస్తామంటూ మహిళల సీపీఐ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని కలిసి నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యుం దుకాణాలను తొలగించాలని ఫిర్యాదు చేశారు. గుత్తిలో మద్యంషాపుపై మహిళలు దాడికి యత్నించారు. గోడలను ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో మహిళలకు ఇబందులు కలిగించేలా ప్రభుత్వం మద్యం షాపులను ఏర్పాటు చేస్తోందని అనంత మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకల్లు, రాయదుర్గం, ఉరవకొండలో మద్యం షాపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండలో రంగావీధి ప్రజలు చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు తెలిపారు. -
ఆస్తి కోసం తమ్ముడినే హతమార్చాడు..
గుత్తి: ఎట్టకేలకు యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించగలిగారు. ఆస్తి కోసం సోదరుడే... రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని హత్య చేసినట్లు తేలింది. ఈ యేడాది ఏప్రిల్ 19న గుత్తి మండల పరిధిలోని వన్నేదొడ్డి సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద గ్రామానికి చెందిన లోకేష్(19) అనే యువకుడు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది. ఎవరు హత్య చేశారో తెలియలేదు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై పడేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుత్తి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం కేసును సివిల్ పోలీసులకు బదిలీ చేశారు. అయినా హత్యా మిస్టరీ వీడలేదు. ఎట్టకేలకు రెండు మాసాల తర్వాత హంతకుని కాల్ డేటా ఆధారంగా హత్యా మిస్టరీని పోలీసులు శుక్రవారం చేధించారు. లోకేష్‌ను అతని సోదరుడు రైల్వే ఉద్యోగి(గ్యాంగ్‌మెన్) శ్రీనివాసులు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని కొందరు వన్నేదొడ్డి గ్రామస్తులు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ కోణంలో విచారణ వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో సొంత సోదరుడే లోకేష్‌ను అతి కిరాతకంగా కొడవలితో ముక్కలు ముక్కలుగా నరికి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు తేలింది. దీంతో నిందితుడు(హంతకుడు) శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణలో తానే తన తమ్ముడిని ఆస్తి కోసం హత్య చేసినట్లు అన్న అంగీకరించినట్లు తెలిసింది. తమ్ముడిని హత్య చేస్తే ఆస్తి అంతా తనకు దక్కుతుందనే దురుద్దేశంతో శ్రీనివాసులు లోకేష్‌ను వన్నేదొడ్డి ట్రాక్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొడవలితో అతి దారుణంగా హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించాలనే నెపంతో మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. తాపీగా ఇంటికెళ్లిపోయాడు. మృతుని తండ్రి సుంకన్న రైల్వే గ్యాంగ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు. అయితే గత ఐదు సంవత్సరాల క్రితం తండ్రి వీఆర్ఎస్ ఇచ్చి పెద్దకుమారుడు శ్రీనివాసులకు ఉద్యోగం ఇప్పించాడు . చిన్న కుమారుడు లోకేష్‌కు పది లక్షల నగదు, ప్లాట్లు, ఇళ్లు రాసి ఇచ్చాడు. లోకేష్‌ను హంతమొందిస్తే ఆస్తితో పాటు నగదు మొత్తం తనకే వస్తుందనే దురాశతో పథకం ప్రకారం తమ్ముడిని అతిదారుణంగా హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశాడు. అయితే ఫోన్ కాల్ డేటా హంతకున్ని పట్టించింది. -
తెల్లవారుజామున హాహాకారాలు
- గుత్తి సమీపంలో అదుపు తప్పి ఓల్వో బస్సు బోల్తా - 17 మందికి తీవ్ర గాయాలు - ఐదుగురి పరిస్థితి విషమం - బాధితుల్లో హిందూపురం, హైదరాబాద్, పత్తికొండ, కరీంనగర్ వాసులు - సకాలంలో స్పందించిన పోలీసులు అందరూ గాఢనిద్రలో ఉన్నారు. బస్సు రయ్‌య్‌య్...మని పరుగులు తీస్తోంది. మరికొన్ని గంటలు గడిస్తే గమ్యస్థానం చేరుకుంటారు. అంతలోనే ఒకరిపై మరొకరు పడిపోయారు. అందరికీ ఎక్కడబడితే అక్కడ రక్తగాయాలయ్యాయి. హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరిగిందో తెలియగానే ఒక్కసారిగా నిద్రమత్తు వదిలింది. ఒకవైపు రక్తమోడుతున్నా.. మరోవైపు తమ వారి కోసం చీకట్లోనే వెతకడం ఆరంభించారు. కొన ఊపిరితో ఉన్నారని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. తెలతెలవారుతుండగా జరిగిన ఈ ఘటనతో వన్నేదొడ్డి-కొత్తపేట గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. - గుత్తి / గుత్తి రూరల్ (గుంతకల్లు) గుత్తి మండలం వన్నేదొడ్డి– కొత్తపేట గ్రామాల మధ్య శనివారం తెల్లవారు జామున 3.30 గంటలకు జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన ఓల్వో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో 15 మంది ప్రయాణికులు సహా, బస్సు డ్రైవర్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎలా జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన టి–ఆర్టీసీ బస్సు 48 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి బెంగుళూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని వన్నేదొడ్డి– కొత్తపేట గ్రామాల మధ్య లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే అదృష్టశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ హిందూపురం, హైదరాబాద్, పత్తికొండ, కరీంనగర్ పరిసర ప్రాంతాలకు చెందిన వారు. గాయపడింది ఎవరెవరంటే... హిందూపురానికి చెందిన సాల్మన్ సుధీర్, హైదరాబాద్‌కు చెందిన భాగ్యవతి, జ్యోతి(మనవరాళ్లు), హల్కా, విజయ్(దంపతులు), అఖిల, సురేశ్, విజయేంద్ర, ప్రణీత, వినయ్, గౌరి, సుజయ్, భరత్, బస్సు డ్రైవర్లు సీహెచ్‌వీ రావు(కరీంనగర్), శీనయ్య(హైదరాబాద్), కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన నీలకంఠ, పంజాబ్‌కు చెందిన కుస్కుమార్ గాయపడిన వారిలో ఉన్నారు.క్షతగాత్రులందరినీ గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో అఖిల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి, జ్యోతి, భాగ్యవతి, హల్కా, విజయ్ను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గుత్తి ఎస్ఐ చాంద్‌బాషా, ఏఎస్ఐ ప్రభుదాస్ సహా పామిడి సీఐ నరేంద్రరెడ్డి, పెద్దవడుగూరు ఎస్ఐ రమణారెడ్డి తమ సిబ్బందితో వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. చీకటిలోనే గాయపడ్డ వారిని అతికష్టమ్మీద బయటకు తీసుకురాగలిగారు. ఆ తరువాత వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించారు. తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల చొరవను అభినందించారు. ఫర్లాంగు దూరం ముందుకెళ్లి ఉంటే.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరో ఫర్లాంగు ముందుకెళ్లి బస్సు అదుపు తప్పి ఉన్నట్లైతే పెను ప్రమాదం జరిగేది. బస్సు బోల్తాపడిన సమీపంలోనే 33 కేవీ విద్యుత్ టవర్ ఉంది. దాన్ని బస్సు ఢీకొని ఉన్నట్లైతే ఏ ఒక్కరూ మిగిలి ఉండేవారు కాదు. అడుగుల దూరంలోనే ఘోరం ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
హాస్టల్ గదిలో మృతదేహం
పరిగి(పెనుకొండ) : పరిగిలోని సాంఘిక సంక్షేమ వసతి గహం (హాస్ట ల్) గదిలో గుర్తు తెలియని ఓ వద్ధుడి(60) మృతదేహాన్ని శనివారం కనుగొన్నట్లు ఎస్ఐ అంజనయ్య తెలిపారు. హాస్టల్ లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికెళ్లి చూడగా.. మృతదేహం ఉందన్నారు. అయితే బాగా ఉబ్బిపోయి ఉండడంతో గుర్తు పట్టేందుకు కూడా వీల్లు కాలేదన్నారు. మతుడు ఇదే ప్రాంతంలో పగలంతా భిక్షాటన చేసి, రాత్రిళ్లు హాస్టల్‌కు వచ్చి నిద్రపోయేవాడని పేర్కొన్నారు. రెం డు, మూడు రోజుల కిందట చనిపోయి ఉంటాడని, అది అనారోగ్యంతో అయి ఉంటుందని భావిస్తున్నారు. గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో... గుత్తి(గుంతకల్లు) : గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. మతుడు ఎవరైందీ తెలియరాలేదన్నారు. అతని వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించారు. వారం రోజులుగా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తుండేవాడని స్థానికులు చెప్పారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకని విచారిస్తున్నట్లు తెలిపారు. -
ఇంట్లో చోరీ
గుత్తి రూరల్ : మండలంలోని కొత్తపేట గ్రామంలో మస్తాన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఉక్కపోతగా ఉండటంతో కుటుంబసభ్యులంతా ఇంటి ఆవరణలో నిద్రించారు. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రెండు తులాల వెండి పట్టీలు, రూ.5 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బతో మహిళ మృతి
గుత్తి : పట్టణంలోని జెండా వీధికి చెందిన ఎస్.రసూల్ బీ(51) వడదెబ్బతో మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రసూల్ బీ రెండు రోజులుగా పని నిమిత్తం ఎండలో బాగా తిరిగారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో కళ్లు తిరిగి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. ఆమెకు భర్త అబ్దుల్ జబ్బార్, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
వడదెబ్బకు ఒకరి మృతి
గుత్తి : గుత్తిలో వడదెబ్బకు మరొకరు బలయ్యారు. స్థానిక బండగేరిలో నివాసముంటున్న ఆర్.బి.రామకృష్ణ(46) అనే టైలర్ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సొంత పనిపై రెండ్రోజుల పాటు ఎండలో తిరిగిన ఆయన సోమవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తర్వాత ఇంటికి పిల్చుకెళ్లారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిలోనే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
మీకు తెలుసా?
రాయలసీమలోని గిరి దుర్గాలలో అత్యంత ప్రాచీన, చారిత్రాత్మకమైనది గుత్తి దుర్గం. సీమ పౌరుషానికి చిరునామాగా ఉన్న గుత్తికోటను సముద్ర మట్టానికి 640 మీటర్ల ఎత్తున కట్టారు. అత్యంత ప్రాచీన చరిత్రను సొంతం చేసుకున్న ఈ కోట వైభవం 18వ శతాబ్దంలో రాజకీయంగా, సంస్కృతి పరంగా శిఖరాగ్రానికి చేరుకుంది. విజయనగర పాలనలో ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. మౌర్యుల మొదలు ఆంగ్లేయుల వరకూ ఎందరో పాలనలను చవిచూచిన చారిత్రాత్మక దుర్గమిది. ఇక కోట నిర్మాణం విషయంగా చూస్తే 303 మీటర్ల ఎత్తు ఉన్న కొండపైన మూడు వైపులా ఉన్న గుట్టలను కలుపుకుని సుమారు 25 హెక్టార్ల విస్తీర్ణంలో శంఖాకృతిలో నిర్మితమై నాటి రాజసాన్ని నేటికీ చూపుతోంది. కోట చుట్టూ ఐదు మీటర్ల ఎత్తు, రెండున్నర మీటర్ల వెడల్పుతో బలమైన రాతి కట్టడాలను కలిగి ఉంది. కోట లోపలకు వెళ్లగానే 15 ఉప కోట కట్టడాలు ఉన్నాయి. ఒక్కొక్క కోటకు ఒక ముఖద్వారం ప్రకారం మొత్తం 15 ముఖద్వారాలు ఉన్నాయి. కోటకు వెలుపల రెండు కొండలను కలుపుతూ పెద్ద కందకం ఉండేది. ప్రస్తుతం అది కోనేరుగా మారింది. కోట పైభాగాన్ని చేరాలంటే ఈ 15 ముఖద్వారాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరో మార్గం అంటూ ఏదీ లేదు. కోట లోపల 101 బావులు, గజ, అశ్వ, వ్యాయామ శాలలు, రంగమంటపం, నీటి కొలనులు, చీకటి గదలు, సొరంగాలు, ఆలయాలు, ఆట స్థలాలు లెక్కకు మించి ఉన్నాయి. కోటలోపల మహల్ల నిర్మాణంలో కర్రముక్క అనేది లేకుండా కమాన్లు తీర్చి ఇటుక, సున్నం, బెల్లం ఉపయోగించారు. క్రీస్తు పూర్వం 220 నాటి మౌర్యుల నుంచి క్రీస్తు శకం 1947 నాటి బ్రిటీష్ పాలకుల వరకు మొత్తం 22 రాజవంశాల రాజకీయ ప్రజ్ఞా ప్రదర్శనకు వేదికగా గుత్తి దుర్గం నిలిచింది. ప్రపంచ చరిత్రలో తన దైన స్థానాన్ని పొందిన అశోక చక్రవర్తి, విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల పాలనను కూడా ఈ దుర్గం చవి చూసిందంటే ఈ కోట ప్రాశస్త్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవర్చు. - గుత్తి క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు గుత్తి కోటను పాలించిన వారి వివరాలు ఇలా.. పాలనా కాలం రాజ వంశం క్రీ.పూ 220–213 మౌర్యులు, శాతవాహనులు క్రీ.శ 230–234 చూటకూళులు క్రీ.శ 234–575 కంచి పల్లవులు క్రీ.శ 610–853 బాదామి చాళుక్యులు క్రీ.శ 940–950 రాష్ట్రకూటులు క్రీ.శ 973–1064 గంగవంశపు రాజులు క్రీ.శ 1069–1070 చోళులు క్రీ.శ 1070–1190 పశ్చిమ చాళుక్యులు క్రీ.శ 1190–1327 హోయసళలు క్రీ.శ 1327–1328 దేవగిరి యాదవులు క్రీ.శ 1330–1565 విజయనగర రాజులు క్రీ.శ 1565–1587 గోల్కొండ నవాబులు క్రీ.శ 1687–1710 మొగలాయిలు క్రీ.శ 1710–1713 కడప నవాబులు క్రీ.శ 1713–1724 డక్కన్ సుబేదారులు క్రీ.శ 1724–1730 ఆసఫ్ నిజాం క్రీ.శ 1731–1734 పాలెగాండ్లు క్రీ.శ 1735–1773 మహారాష్ట్ర పాలకులు క్రీ.శ 1773–1792 టిప్పు సుల్తాన్ క్రీ.శ 1792–1800 నైజాం నవాబులు క్రీ.శ 1800–1947 ఆంగ్లేయులు -
వడదెబ్బతో ఒకరి మృతి
గుత్తి : గుత్తిలో వడదెబ్బకు మరొకరు బలయ్యారు. స్థానిక న్యూ సీపీఐ కాలనీకి చెందిన ఫకృల్లాఖాన్(45) వడదెబ్బకు గురై ఆదివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. పూల మండిలో కూలీ పనులు చేసే అతను వ్యాపారం నిమిత్తం వారం రోజులుగా బాగా తిరిగాడన్నారు. దీంతో శనివారం సాయంత్రం కళ్లు తిరిగి కింద పడిపోయాడని చెప్పారు. ఆ వెంటనే వాంతులు, వీరేచనాలు కాగా, స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి పిల్చుకెళ్లగా ఆదివారం తెల్లవారు జామున మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారా?
- వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వైవీఆర్ - దుకాణాల తొలగింపును నిరసిస్తూ భారీ ర్యాలీ - మున్సిపల్ కార్యాలయం ముట్టడి గుత్తి : గుంతకల్లు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను ఎలా తొలగిస్తారని వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అని మండిపడ్డారు. గుంతకల్లు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధితులతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాబ్తో వైవీఆర్ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం కమిషనర్ చాంబర్లోకి దూసుకెళ్లి కమిషనర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వైవీఆర్ మాట్లాడుతూ గుంతకల్లు రోడ్డులో ఒక్క దుకాణం కూడా తొలగించడానికి తాము అంగీకరించబోమన్నారు. గుంతకల్లు రహదారికి ఇరుపక్కలా ఉన్న స్థలం ఆర్అండ్బీ, ఎన్‌హెచ్ శాఖలకు సంబంధించిందని అలాంటపుడు వాటిని తొలగించడానికి మున్సిపాలిటీ వారు ఎలా నోటీసులు జారీ చేశారని కమిషనర్‌ను వైవీఆర్ నిలదీశారు. దీంతో కమిషనర్ నీళ్లు నమిలారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి దుకాణాలు తొలగించడానికి పూనుకుంటే తాము ఊరుకునేది లేదన్నారు. ముఖ్యంగా గుంతకల్లు రహదారి వాసులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అన్నారు. ఇందుకు స్పందించిన కమిషనర్ నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని, అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తొలగింపు ప్రతిపాదనను విరమించుకున్నామన్నారు. కమిషనర్ హామీతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గోవర్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ యాదవ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మల్లయ్య యాదవ్, బాలరాజు రాయల్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మల్లికార్జున, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మర్తాడు అన్సార్, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, శివయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షఫీ, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శులు ఫారూక్, ఫయాజ్, అఫ్సర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హాజీ మలన్ బాబా, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి చంద్ర, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు వెంకటేష్, మూముడూరు మాజీ సర్పంచు రామచంద్రారెడ్డి, పామిడి మండల యూత్ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి, కౌన్సిలర్లు నజీర్, కృపా సుజాత, కళ్యాణి, మహిళా నాయకురాలు నిర్మల, తురకపల్లి గోపాల్‌రెడ్డి, మండల, జిల్లా సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి, వెంకటేష్, శంకర్‌రెడ్డి, నారాయణస్వామి, శేషారెడ్డి, రంగ ప్రసాద్ రాయల్, ప్రసాద్ గౌడ్,లాలు శేఖర్, తొండపాడు వాటర్ షెడ్ చైర్మన్ శంకర్, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్ఎస్ నాయక్, నారాయణ, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు బాలుడి బలి
గుత్తి : గుత్తి గాంధీ నగర్‌కు చెందిన షేర్‌వలి కుమారుడు అన్సర్(17) వడదెబ్బతో ఆదివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. రెండ్రోజులుగా ఎండలో బాగా తిరిగడంతో శనివారం మధ్యాహ్నం ఇంటికి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం మళ్లీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే మృతి చెందినట్లు చెప్పారు. -
కారులో తిప్పుతూ అత్యాచారం
మూడురోజులపాటు మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం అనంతపురం జిల్లా గుత్తిలో ఘటన నిందితులపై నిర్భయ–పోక్సో చట్టం కింద కేసు.. గుత్తి (గుంతకల్లు): ఆలయం నుంచి ఇంటికి వెళుతున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు కామాంధులు కిడ్నాప్ చేసి.. మూడురోజులపాటు కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో ఆలస్యంగా వెలుగు చూసింది. దుండగుల చెర నుంచి బయటపడిన బాలిక తల్లిదండ్రులతో కలసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇందుకు బాధ్యులైన నిందితులిద్దరిపై పోలీసులు నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గుత్తి ఎస్ఐ సుధాకర్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుత్తి జంగాలకాలనీకి చెందిన పదమూడేళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 5న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అటకాయించి, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు. గుడి కెళ్లిన బాలిక పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ జాడ కనుక్కోలేకపోయారు. ఈ క్రమంలో ఈనెల 8న (శనివారం) తెల్లవా రుజాము 3 గంటల సమయంలో గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు. తిప్పలు పడి ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులతో కలసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన ఉదంతాన్ని పోలీసులకు తెలియజేసింది. తనను కిడ్నాప్ చేశాక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని చెప్పింది. మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారని విలపించింది. నిందితుడు అశోక్ పట్టణంలోని అన్నపూర్ణ హోటల్లో వంటమనిషి అని, మరో నిందితుడు సురేష్ ఆటోడ్రైవర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరిపై నిర్భయ కేసుతోపాటు సెక్షన్ 366 (కిడ్నాప్), 342 (నిర్బంధం), 376బీ (అత్యాచారం), 109 (అత్యా చారాన్ని ప్రోత్సహించడం), 5 లేదా 6 (పోక్సో– నిర్భయ చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. -
బాలికపై సామూహిక లైంగికదాడి
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గుత్తిలో యువకుడి మృతదేహం
గుత్తి : గుత్తి మన్రో సత్రం సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం కనుగొన్నారు. మృతుడు వడదెబ్బకు గురై మృతి చెందాడా? లేక అతిగా మద్యం తాగి చనిపోయాడా అనే విషయం తెలియడం లేదు. ఒంటిపైనా ఎలాంటి గాయాలు లేవు. మృతదేహాన్ని అందరూ చూస్తూ వెళ్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోలేదు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేకపోయారు. -
నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గుత్తి : భార్య తన మాట వినలేదనే కోపంతో షేక్ బషీర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుత్తి పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కటిక బజారులో షేక్ బషీర్, సాధిక సంజరీ నివాసముంటున్నారు. షేక్ బషీర్ పట్టణంలోని బీరువాల షాపులో పని చేస్తున్నాడు. భార్య సాధిక పాటలు పాడుతుండేది. అయితే ఇటీవల వారు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో బషీర్ మద్యం, మట్కాకు బానిసయ్యాడు. దీంతో గొడవలు రోజు రోజుకూ తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరు మాసాల క్రితం భర్త షేక్ బషీర్ నుంచి సా«ధిక సంజరీ విడిపోయింది. సాధిక సంజరీ గాయనిగా ఖవ్వాళీ చెబుతూ జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆర్అండ్బీ బంగ్లాలో గుత్తి కోట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకుని సందడి చేద్దాం రండి పేరుతో సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాధిక సంజరీ వెళ్లింది. బషీర్ కూడా కార్యక్రమానికి వెళ్లారు. అయితే సాధిక సంజరీ స్టేజ్ ఎక్కకూడదని, పాటలు పాడకూడదని భర్త షేక్ బషీర్ ఆర్డర్ వేశాడు. అయితే పాటలు పాడితేనే నాలుగు డబ్బులు వస్తాయని నేను పాటలు పాడి తీరుతానని ఆమె స్టేజ్ ఎక్కింది. దీంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఖవ్వాళీకి వచ్చిన వారు భయాందోళనతో పరుగులు తీశారు. కొందరు కంబళి తెచ్చి మంటలు ఆర్పారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. కాగా సాధిక తన భర్త నుంచి ప్రాణ భయం ఉందని మంగళవారం ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఖాతా నుంచి రూ.48 వేలు గల్లంతు
గుత్తి : సైబర్ నేరగాళ్ల ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు సైబర్ నేరగాళ్లు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో జనం బెంబేలెత్తుతున్నారు. తాజాగా గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి దేవేంద్రగౌడ్ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కారు. బుధవారం ఆయనకు ఓ కాల్ వచ్చింది. ‘నేను ఎస్బీఐ ఆఫీసర్ని మాట్లాడుతున్నా. మీ ఏటీఎం బ్లాక్ అయింది. యాక్టివేట్ చేయాలంటే మేం అడిగిన వివరాలు చెప్పండి..అంటూ ఏటీఎం కార్డుపైన ఉండే నంబర్లతో పాటు సీక్రెట్ కోడ్ నంబర్‌ను అవతలి వ్యక్తి కోరాడు. ఇదంతా నిజమేనని నమ్మిన దేవేంద్ర వెంటనే తన వివరాలు చెప్పారు. అంతే... ఖాతాలో రూ.లక్ష ఉండగా, దేవేంద్రగౌడ్ కుమారుడు శేఖర్ గౌడ్ గురువారం ఏటీఎంకు వెళ్లి కొంత డబ్బు డ్రా చేశారు. బ్యాలెన్స్ తక్కువగా ఉన్నట్లు గమనించి, ఆరా తీయగా బుధవారం ఇదే అకౌంట్ నంబర్ నుంచి పూనేలోని వివిధ ఏటీఎం కేంద్రాల్లో రూ.48 వేలు డ్రా అయినట్లు తెలుసుకుని ఇక్కడి ఎస్బీఐ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
గుత్తి : గుత్తిలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన సౌజన్య, వెంకటరాముడు దంపతుల కుమార్తె హేమలత(17) అదృశ్యమైనట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే ఆమె శుక్రవారం జరిగిన ఫిజిక్స్ పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లిందన్నారు. ఆ తరువాత ఆరగంటకే ఇంటి నుంచి మాయమైందని, రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా గాలించారన్నారు. పరీక్ష బాగా రాయలేదనే కారణంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. తల్లిదండ్రులు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
మూడిళ్లలో చోరీ
గుత్తి (గుంతకల్లు) : గుత్తి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో గురువారం అర్ధరాత్రి తర్వాత మూడిళ్లలో దొంగలు పడ్డారు. హరి అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి అహోబిలం వెళ్లాడు. తాళం వేసిన వీరి ఇంటిలోకి దుండగులు ప్రవేశించి బీరువాలో రెండు జతల బంగారు కమ్మలు, రూ. 5 వేల నగదు అపహరించారు. ఇదే కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఆదిశేషయ్య ఇళ్లలో కూడా దొంగలు పడ్డారు. వీరిళ్లలో నగదు, బంగారు ఆభరణాలు లేకపోవడం వల్ల కొన్ని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాలంలో గుత్తి, గుత్తి ఆర్ఎస్లలో చోరీలు అధికంగా జరుగుతున్నాయి. పోలీసులు రాత్రి సమయాల్లో నిఘా, గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వృద్ధుడు అనుమానాస్పద మృతి
గుత్తి (గుంతకల్లు) : గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు (60) అనుమానాస్పద స్థి«తిలో మృతి చెందాడు. తలపై బలమైన గాయాలు, రక్తస్రావమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహం దుర్వాసన వస్తోంది. రెండు రోజుల కిందటే ఎవరో కొట్టి చంపేసినట్లు తెలుస్తోంది. హెడ్‌కానిస్టేబుల్ చెలమయ్య శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
గుత్తిలో ఘరానా మోసం
= తప్పుడు రిజిస్ట్రేషన్లతో రూ.కోట్ల విలువైన స్థలం విక్రయం = స్థల యజమాని ఫిర్యాదులో వెలుగులోకి.. = పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, మరో మరొకరు పరారీ గుత్తి: గుత్తిలో ఘరానా మోసం వెలుగు చూసింది. కోట్ల విలువైన స్థలంపై కన్నేసిన కొందరు అక్రమార్కులు దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేయించి, ఆపై ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. అయితే ఆలస్యంగా మేల్కొన్న స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ, ఎలాగంటే... గుత్తిలోని అనంతపురం రోడ్డులో గల సర్వే నంబర్ 400–ఎఫ్‌లో ఎ.భీమయ్య అనే వ్యక్తికి 1.82 ఎకరాల భూమి ఉంది. అతను 1995లో మరో వ్యక్తి నుంచి ఈ భూమిని కొనుగోలు చేశారు. అనంతరం ఆయన కర్నూలులో స్థిరపడ్డారు. వార్డు మాజీ సభ్యులు వై.పి.బాబు, పెద్ద ఈరన్న, మరో వ్యక్తి ఆ భూమిపై కన్నేశారు. రెండు వారాల కిందట స్థల యజమాని భీమయ్య పేరుతో గల మరో వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు. సర్వే నంబర్ 400–ఎఫ్‌లో ఉన్న స్థలం యజమాని పేరుతో ఉన్న మరో వ్యక్తి(ఎ.భీమయ్య)ని రంగంలోకి దింపారు. నకిలీ భీమయ్యకు కొంత డబ్బు ముట్టజెప్పారు. అతని ఆధార్ కార్డు సహాయంతో రెండు వారాల కిందట సదరు స్థలాన్ని గుత్తికి చెందిన ఇమ్మానుయేల్ రాజుకు ప్లాట్లు వేసి సెంటు రూ.లక్ష ప్రకారం అమ్మేశారు. స్థలం కొనుగోలు చేసిన ఇమ్మానుయేల్ రాజు దాన్ని పట్టణానికి చెందిన మరో తొమ్మిది మందికి విక్రయించారు. డాక్యుమెంట్ రైటర్ సమాచారంతో... అయితే అసలు యజమాని ఎ.భీమయ్యకు తన స్థలాన్ని ఆక్రమించి దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా కాజేసిన విషయాన్ని ఒక డాక్యుమెంట్ రైటర్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో డొంకంతా కదిలింది. వెంటనే భీమయ్య హుటాహుటిన గుత్తికి చేరుకున్నారు. తాడిపత్రి డీఎస్పీకి ఫిర్యాదు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తారో, లేదోనని భావించిన బాధితుడు తాడిపత్రికి వెళ్లి అక్కడ డీఎస్పీ చిదానందరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు గుత్తి సీఐ మ«ధుసూదన్‌గౌడ్, ఎస్ఐ–2 రామాంజనేయులు రంగంలోకి దిగి విచారణ చేశారు. విచారణలో వార్డు మాజీ సభ్యులు వై.పి.బాబు, పెద్ద ఈరన్న, నకిలీ వ్యక్తి ఎ.భీమయ్య స్థలాన్ని కొట్టేసి దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇమ్మానుయేల్ రాజు, పెద్ద ఈరన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంలో కీలకంగా మారిన వై.పి.బాబు, మరో వ్యక్తి ఊరొదిలి పారిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే ఇమ్మానుయేల్ రాజు కూడా కుట్రలో భాగమేనని తెలిసింది. వై.పి.బాబు, పెద్ద ఈరన్న, ఇమ్మానుయేల్ రాజు సదరు స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్‌తో కాజేసి ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలాన్ని మొదట ఇమ్మానుయేల్ రాజుకు విక్రయించారు. అతని ద్వారా ప్లాట్లుగా వేసి తిరిగి మరో తొమ్మిది మందికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. జరిగిందంతా వాస్తవమేనని ఎస్ఐ–2 రామాంజనేయులు అన్నారు. వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుత్తి రూరల్ : మండలంలోని తొండపాడు బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏటా నిర్వహించే రాతిదూలం లాగుడు పోటీలు బుధవారం మూడవ రోజు హోరాహోరీగా సాగాయి. న్యూ క్యాటగిరీ విభాగంలో మొత్తం 19 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అగ్రహారానికి చెందిన మహిధర్‌రెడ్డి వృషభాలు 4841 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం అక్కంపల్లికి చెందిన జీహెచ్.రెడ్డి వృషభాలు 4525 అడుగుల దూరం లాగి రెండవ స్ధానం, కర్నూలు జిల్లా సంజామల మండలం ముక్కమల్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి వృషభాలు 4343 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలిచాయి. రాతిదూలం లాగుడు పోటీలు మరో రెండు రోజుల పాటు జూనియర్, సీనియర్ విభాగాల్లో జరుగుతున్నట్లు నిర్వాహకులు రంగస్వామిరెడ్డియాదవ్, చిన్నరెడ్డియాదవ్లు తెలిపారు. ఈ పోటీల్లో అనంత, కర్నూ లు, వైఎస్సార్, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వృషభాలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో గుత్తి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, నిర్వాహకులు రామచంద్ర, అనిల్, నాగార్జున పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన రైతులు, పోటీదారులకు గొందిపల్లి గ్రామస్తులు అన్నదానం చేశారు. -
63 మందిపై కేసు కొట్టివేత
గుత్తి (గుంతకల్లు) : మెయిల్ గ్రీన్ పవర్ లిమిటెడ్ కంపెనీ వేసిన కేసులో పెన్నానది పరివాహక పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట లభించింది. 63 మందిపై నమోదైన కేసును గుత్తి జేఎఫ్‌సీఎం జడ్జి వెంకటేశ్వర్లు బుధవారం కొట్టివేశారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం నాగలాపురం (చిట్టూరు) వద్ద మెయిల్ గ్రీన్ పవర్ కంపెనీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. అక్కడ అక్రమంగా బావి (ఇన్ఫిల్ట్రేషన్ వెల్) తవ్వింది. పెన్నానదికి సంబంధించిన అన్ని కాలువలనూ ఈ బావిలోకి మళ్లించింది. చుట్టుపక్కల 20 గ్రామాల్లో ఐదు వేల బోర్లు ఎండిపోయాయి. ఆయా గ్రామాల్లో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. దీంతో కంపెనీపై పోరాటం చేయడానికి రైతులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమయ్యారు. పెన్నానది పరీవాహక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ సభ్యులు బావిని పూడ్చి వేయాలని పదిరోజులపాటు ఆందోళలనలు నిర్వహించారు. బావిని పూడ్చి వేయడానికి ప్రయత్నించారు. దీంతో కంపెనీ నిర్వాహకులు కమిటీలోని 63 మందిపై 427, 447, 147, 188, 353 సెక్షన్ల కింద 2013 మేలో కేసు నమోదు చేయించారు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. ఈ కేసు పలు విచారణల అనంతరం బుధవారం గుత్తి జేఎఫ్‌సీఎం కోర్టులో తుది విచారణకు వచ్చింది. తుది విచారణలో 63 మంది కమిటీ సభ్యులపై కేసును కొట్టివేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సంగీత వాదించారు. కోర్టు తీర్పు.. కంపెనీకి చెంప పెట్టు తమపై అక్రమంగా బనాయించిన కేసును కోర్టు కొట్టివేయడం మెయిల్ గ్రీన్ పవర్ కంపెనీ ప్రతినిధులకు చెంప పెట్టులాంటిదని పెన్నానది పరివాహక పరిరక్షణ కమిటీ సభ్యులు శరత్ చంద్రారెడ్డి (వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి), ఓబుల కొండారెడ్డి (రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్), ఇమామ్ (కదిలిక ఎడిటర్), న్యాయవాదులు సంజయ్ యాదవ్, ధనుంజయ, వెంకటరమణారెడ్డిలు అభివర్ణించారు. తమపై బనాయించిన కేసును కొట్టివేసిన అనంతరం కోర్టు ఆవరణలోనే వారు విలేకరులతో మాట్లాడారు. మెయిల్ గ్రీన్ పవర్ కంపెనీ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు బావిని తవ్వి పెన్నానది నీటితో పాటు వంకల, కాలువల నీళ్లను బావిలోకి మళ్లించడం కారణంగా ఉష్ణోగ్రత 49 డిగ్రీలకు చేరుకుందన్నారు. దీంతో గొర్రెలు, పశువులు ఉదయం 11 గంటలకే వేడిమిని భరించలేక ఇళ్లకు వెళ్లిపోతున్నాయన్నారు. పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతినిందన్నారు. నాగలాపురం, గంజికుంట పల్లి, చిట్టూరు గ్రామాల్లోని పిల్లలకు చర్మవ్యాధులు సోకాయన్నారు. భూములను, కాలువలను, దారులను చివరకు దేవాలయ భూములను సైతం కంపెనీ నిర్వాహకులు ఆక్రమించారన్నారు. ఇప్పటికైనా కంపెనీపై చర్యలకు ఉపక్రమించకపోతే మరోసారి పోరాటాలకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
మహిళ మెడలో గొలుసు అపహరణ
గుత్తి : గుత్తి ఆర్ఎస్ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం పట్టపగలే మహిల మెడలో గొలుసు చోరీకి గురైంది. వివరాలిలా ఉన్నాయి. ఆర్ఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్న రైల్వే ఉద్యోగి రమణమ్మ యథావిధిగా మధ్యాహ్నం భోజనం చేసి విధులకు బయలుదేరింది. స్టేషన్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. -
ముగిసిన జకినీ మాత ఉత్సవాలు
గుత్తి : ఆరె కటికల ఆరాధ్య దైవం సునామ జకినీ మాత ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. వేకువజాము నుంచే అమ్మవారికి పలు పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో జకినీ మాత, మల్కూమ జకినీ మాత విగ్రహాలకు గంగాస్నానం చేయించారు. అనంతరం ఎరుపు దుస్తులు ధరించిన 108 మంది కన్యలు, ముత్తైదువులు పూర్ణ కుంభాలతో, మంగళ వాయిద్యాలతో అమ్మవారి విగ్రహాలను జకినీ మాత ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం పది, ఇంటర్, డిగ్రీల్లో ప్రతిభ కనబరిచిన ఆరె కటికల పిల్లలకు బహుమతులు అందజేశారు. -
చిట్టీల పేరుతో రూ.30 లక్షలకు కుచ్చుటోపీ
గుత్తి (గుంతకల్లు) : గుత్తి ఆర్ఎస్లో చిట్టీలు (చీటీలు) నిర్వహిస్తున్న ఓ మహిళ రూ.30లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించింది. బాధితులు తెలిపిన మేరకు... ఆర్ఎస్లోని రవూఫ్ కాంపౌండ్ కాలనీలో తాహేరా అనే మహిళ నివాసముంటోంది. ఈమె పదేళ్లగా చిట్టీలు వేసేది. ఈ క్రమంలో దాదాపు 30 మంది మహిళలు ఆమె వద్ద రూ. 30 లక్షల దాకా చిట్టీలు వేశారు. నెల రోజుల క్రితం తాహేరా చిట్టీ డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. నెల రోజులుగా ఆమె ఆచూకీ కోసం బాధిత మహిళలు గాలించినా లభ్యం కాలేదు. దీంతో బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళలు పద్మావతి, శకుంతల, విజయలక్ష్మి, రంగమ్మ, నారాయణమ్మ, కృష్ణవేణి తదితరులు పోలీసుస్టేషన్‌కు తరలివెళ్లి ఎస్ఐ చాంద్‌బాషాకు చిట్టీల నిర్వాహకురాలు తాహేరాపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్ఐ చాంద్‌బాషా, ఏఎస్ఐ ప్రభుదాస్‌లను వేడుకున్నారు. ఎస్ఐ, ఏఎస్ఐలు మాట్లాడుతూ చిట్టీలు కట్టాలంటే నిర్వాహకులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ రెండూ ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ లేనివారితో చిట్టీలు కడితే కేసు నమోదు చేయడం కుదరదన్నారు. అయితే మానవత్వంతో ఫిర్యాదు స్వీకరిస్తున్నామని, డబ్బుతో ఉడాయించిన తాహేరా ఆచూకీ కనుక్కుంటామని చెప్పారు. -
చాక్లెట్లు తెచ్చా.. లే అమ్మా!
పొద్దునే లేచి నన్ను రెడీ చేస్తివే.. చాక్లెట్లు తెస్తవా అంటివే.. నీ కోసం చాక్లెట్లు తెచ్చానమ్మా.. లే అమ్మా..ఒక్కసారి నన్ను చూడమ్మా.. నాతో మాట్లాడమ్మా.. అంటూ ఆ చిన్నారి తన తల్లి చెంపలు నిమురుతూ, గుండెలపై పడి ఒక్కో మాట అడుగుతుంటే అక్కడుకున్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. గణతంత్ర దినోత్సవానికి అందంగా తయారైన తన ముద్దుల తనయ తిరిగి ఇంటికొచ్చే సరికే ఆ తల్లి నిర్జీవంగా మారడంతో ఆ పసి హృదయం విలవిల్లాడిపోయింది. - గుత్తి --------------------------------------------- గుత్తి సీపీఐ కాలనీలో నివాసముండే బేల్దారి మల్లికార్జున భార్య ఉరుకుందమ్మ గురువారం ఆత్మహత్య చేసుకుంది. భర్త వ్యసనాలకు బానిస కావడం.. తాగేందుకు చేసిన అప్పులు తడిసిమోపెడవడం.. అప్పుల వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడం.. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల భవిష్యత్తు ఆ ఇల్లాలిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. భర్తలో మార్పు తీసుకువద్దామని ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక జీవితంపై విరక్తి పెంచుకుంది. చివరకు ఉరుకుందమ్మ ఆత్మహత్య చేసుకుంది. పాపను ముస్తాబు చేసి.. పాఠశాలలో జరిగే గణతంత్ర దినోత్సవానికి కుమార్తె ఉషా(ఏడో తరగతి)ను రెడీ చేయాలని ఐదు గంటలకే ఉరుకుందమ్మ నిద్ర లేచింది. పాపను తలంటుస్నానం చేయించి, కొత్త బట్టలు వేసింది. టాటా చెపుతూ.. వచ్చేటప్పుడే తనకు చాక్లెట్లు తీసుకురావాలని కోరింది. సరేనమ్మానంటూ ఆ చిన్నారి తల్లికి టాటా చెప్పి బయలుదేరింది. చాక్లెట్లు తల్లికి ఇద్దామని తొందరగా ఇంటికొచ్చినా... బడిలో ఇచ్చిన చాక్లెట్లను తన తల్లికి ఇద్దామని ఆత్రంగా ఇంటికొచ్చిన ఆ చిట్టి తల్లికి ఇంటి ముందు జనాలు గుంపుగా ఉండడం చూసి ఏం జరిగిందో అర్థం కాలేదు. లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా మారిన తల్లిని చూసి కన్నీరుమున్నీరైంది. చాక్లెట్లు కావాలంటివే అమ్మా.. నీకోసమే తెచ్చాను తిను తల్లీ.. నువ్వే తినకపోతే ఇక ఈ చాక్లెట్లు ఎవరికి ఇవ్వాలమ్మా..అంటూ ఆ చిన్నది అడగడం అక్కడున్న వారి హృదయాలను బరువెక్కించింది. తల్లి గుండెలపై పడి రోదించిన చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. ఆ చిట్టి తల్లిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుమారుడు విశ్వనాథ్ సైతం అమ్మ మృతదేహంపై పడి హృదయ విదారకంగా విలపించాడు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గుత్తి : అనారోగ్యంతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. గుత్తిలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ చాంద్‌బాషా తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముండే ఉసేని (టీచర్), రంగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి మేఘన. కర్నూలులోని శ్రీచైతన్య కాలేజీలో బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. ఆరు మాసాల క్రితం అనారోగ్యానికి గురైంది. తల నుంచి కాళ్ల వరకు విపరీతమైన నొప్పులతో బాధ పడేది. అంతే కాకుండా నరాల బలహీనత కూడా మొదలైంది. కర్నూలు, బళ్లారి, అనంతపురంతోపాటు హైదరాబాద్‌కు కూడా తీసుకెళ్లి వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ నేపథ్యంలో కాలేజీకి కూడా సక్రమంగా వెళ్లలేకపోయింది. చదువులో వెనుక పడతాననే భయం ఒక వైపు, ఆరోగ్యం మెరుగపడలేదనే ఆందోళన మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె బాధను చూడలేక తల్లిదండ్రులు కుంగిపోయారు. ఇవన్నీ గమనించిన ప్రీతి మేఘన ఇక తనువు చాలించడమే మేలనుకుంది. మంగళవారం ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలింజన్
గుత్తి : స్థానిక డీజిల్ షెడ్ వద్ద ఉదయం 6 గంటల సమయంలో గూడ్స్ రైలింజన్ (నంబర్ 70508) షంటింగ్ చేస్తున్న సమయంలో పట్టాలు తప్పింది. ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు టెక్నీషియన్లను, మెకానిక్‌లను పంపి ఇంజిన్‌ను తిరిగి యథాస్థితికి తెచ్చారు. గత మంగళవారం కూడా గుత్తి రైల్వే స్టేషన్లో రైలింజన్ పట్టాలు తప్పిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇది మరువకముందే తిరిగి రైలు ఇంజిన్ పట్టాలు తప్పండంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారులను ప్రశ్నిచంగా చలి కాలంలో పట్టాలు సంకోచించడంతో ఇలాంటి ఘటనలు ఏర్పడుతున్నాయన్నారు. -
పట్టాలు తప్పిన రైలింజన్
గుత్తి (గుంతకల్లు) : షంటింగ్ చేస్తున్న రైలింజిన్ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైలింజిన్ (నంబర్ డబ్ల్యూడీజీ 3ఏ 13100) రాత్రి 8.30 గంటల సమయంలో బే–1 వద్ద నుంచి వాషింగ్ పాయింట్ వద్దకు బయలు దేరింది. అయితే.. డీజిల్ షెడ్లోని వాషింగ్ పాయింట్ వద్ద పట్టాలు తప్పింది. ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు టెక్నీషియన్లను, మెకానిక్‌లను పంపి ఇంజిన్‌ను తిరిగి యథాస్థితికి తెచ్చారు. ఇదే ప్రాంతంలో గతంలో ఐదారు సార్లు షంటింగ్ ఇంజిన్లు పట్టాలు తప్పాయి. -
వివాహిత అదృశ్యం
గుత్తి (గుంతకల్లు): పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ప్రభావతి ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రవికుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాలాచోట్ల గాలించామని, అయినా జాడ కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్యాంపస్ ఇంటర్వూ్యల్లో 13 మంది ఎంపిక
గుత్తి : పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో లక్నోకు చెందిన సీ – కోర్ ఇండియా టెక్నో సొల్యూష¯Œ్స సాఫ్ట్వేర్ కంపెనీ శుక్రవారం ఎంబీఏ, బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించింది. 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇందులో ఎంబీఏ విద్యార్థులు ముగ్గురు, బీటెక్ విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ ప్రదీప్వర్మ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపిౖకెన ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.2.4 లక్షల వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను గేట్స్ కరస్పాండెంట్ వీకే సుధీర్‌రెడ్డి, డైరెక్టర్లు వీకే పద్మావతి, వీకే వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రతాప్‌రెడ్డి, పీడీ జోయెల్ అభినందించారు. -
25మంది బాలకార్మికులకు విముక్తి
గుత్తి : గుత్తి పట్టణంతోపాటు, ఆర్ఎస్లో బుధవారం చైల్డ్‌లైన్–1098, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హోటళ్లు, దుకాణాలు, జనరల్ స్టోర్స్, డాబాలు, మెకానిక్ షాపులలో పనిచేస్తున్న 25 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. మరో ఐదుగురు భిక్షమెత్తుకునే బాలలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇప్పించారు. బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. చైల్డ్‌లైన్ 1098 కో–ఆర్డినేటర్ బాలాజీ, ఎస్ఐ చాంద్‌బాషా మాట్లాడుతూ బాలలు పనుల్లో కాదు బడుల్లో ఉండాలనే ఉద్దేశంతోనే దాడులు నిర్వహిస్తున్నామన్నారు. చైల్డ్‌లైన్ 1098 సిబ్బంది రామకృష్ణ, పోలీసులు పాల్గొన్నారు. -
ఐదుగురిని కరిచిన పిచ్చికుక్క
గుత్తి : పట్టణంలోని షారోన్ నగర్లో మంగళవారం ఓ పిచ్చికుక్క పుల్లమ్మ, పావన జ్యోతి, లక్ష్మిదేవి, రంగయ్య మరొకరిని కరిచింది. వీరిలో తీవ్రంగా గాయపడిన పావన జ్యోతి, పుల్లమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాలనీవాసులు సునిల్, లారెన్స్, దివ్య, ఉషారాణి, రాజు, శ్యాం ప్రసాద్, అమృత్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఊర కుక్కలు, పిచ్చికుక్కల బెడద పెరిగిపోయిందన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి తమను రక్షించాలని కోరారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
గుత్తి: ప్రేమ వివాహం చేసుకున్న తమకు ఇరుకుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. గుత్తిలోని పైమాల వీధికి చెందిన పవ¯ŒS, తాడిపత్రి రోడ్డు కాలనీకి చెందిన సన మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోరని రెండు రోజుల క్రితం కసాపురం వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. విషయం తెలిశాక పెద్దలు తమను విడదీసే అవకాశం ఉందని భావించిన ఇద్దరూ గుత్తికి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదుచచేశారు. ఎస్ఐ రామాంజనేయులు ఇరువురి తల్లిదండ్రులనూ స్టేష¯ŒSకు పిలిపించారు. ఇద్దరూ మేజర్లని, ఇష్ట్రపకారమే పెళ్లి చేసుకున్నారని, వారిపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, భయపెట్టినా నేరంగా పరిగణిస్తామని చెప్పి పంపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ఎస్ఐ వాహనమే ఢీకొట్టిందని బంధువుల ఆరోపణ గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి శివార్లలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన షేక్ బాషా అనే స్లైక్లిస్టు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివార్లలోని సిమెంట్ స్తంభాల తయారీ పరిశ్రమలో కూలీ పనికి వెళ్లే బాషా మధ్యాహ్నం భోజనానికి సైకిల్‌పై ఇంటికి బయలు దేరాడు. అదే సమయంలో గుత్తి వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బాషా సైకిల్‌ను వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొనడంతో సైకిల్ నుజ్జునుజ్జైంది. బాసా ఎగిలి అల్లంత దూరంలో పడ్డాడు. రక్తస్రావమై తీవ్రంగా గాయపడ్డ బాషాను అటుగా వెళ్తున్న కర్నూలు జిల్లా ఎస్ఐ శంకర్ తన జీపులోనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. కాగా ఎస్ఐ శంకర్ వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి తండ్రి తెలిపారు. పంచాయితీ అనంతరం బాషా చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ఎస్ఐ భరించేలా మాట్లాడుకొన్నట్లు తెలిసింది. ఆ తరువాత అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఆ తరువాత బాధితులు మాటమార్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శంకర్ గుత్తిలో నివాసముంటూ ప్రభుత్వ వాహనాన్ని తన సొంతానికి వాడుకుంటూ రోజూ జొన్నగిరి నుంచి గుత్తికి వచ్చి వెళ్తుంటాడని తెలిసింది. ఈ విషయంపై ఎస్ఐ శంకర్‌ను ఫో¯ŒSలో ‘సాక్షి’ వివరణ కోరగా... బాషాను తన ముందు వెళ్తున్న లారీ ఢీ కొట్టి వెళ్తే వెనుకనే వచ్చిన తాను మానవత్వంతో అతడిని ఆస్పత్రికి చేర్చానన్నారు. తన వాహనమే ఢీకొట్టినట్లు బాషా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు భావించారని వివరించారు. బాధితుడు కూడా కోలుకున్నాక లారీ ఢీకొట్టినట్టు చెప్పాడని ఎస్ఐ తెలిపారు. గుత్తి ఎస్ఐ చాంద్‌బాషా వివరణ అడగ్గా.. బాషాను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఎగిరి ముందు వస్తున్న ఎస్ఐ జీపుపై పడ్డాడని చెప్పారు. ఎస్ఐ జీపు ఢీ కొట్టలేదన్నారు. -
కురుబలు అన్ని రంగాల్లో రాణించాలి
గుత్తి రూరల్ : కురుబలు అన్ని రంగాల్లో రాణించి తమ సత్తా చాటాలని కురుబ సంఘం రాయలసీమ అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు. బుధవారం కురుబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస 529 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మినారాయణ ఆధ్యక్షతన కనకదాస చిత్రపటాన్ని పట్టణంలో ఊరేగించారు. బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, నాగేంద్ర మాట్లాడారు. కురుబలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే గొర్రెల మేకల ఫెడరేషన్‌కు అధిక నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కెపీఎస్ ధియేటర్ ఎదురుగా కనకదాస విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కురుబ సంఘం నాయకులు లింగన్న, ఎంపీటీసీ శంకర్, మహాలింగ, కోశాధికారి కుళ్లాయి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, రంగయ్య, తిరుపాలు, నాగేశ్వరరావు, శేఖర్, సుధాకర్, నారాయణస్వామి పాల్గొన్నారు. -
ఎస్బీఐలో రూ.24 వేలు నగదు అపహరణ
గుత్తి : పట్టణంలోని ఎస్బీఐ శాఖలో పెద్దన్న అనే వ్యక్తికి చెందిన రూ.24 వేలు నగదు మంగళవారం అపహరణకు గురైంది. మండలంలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన పెద్దన్న తన కుమారుడు ఆదిని వెంట పెట్టుకుని ఎస్బీఐకి వెళ్లాడు. తన కుమారుడి ఖాతా నుంచి రూ.24 వేలు డ్రా చేయించాడు. ఆ డబ్బును పెద్దన్న తన జేబులో పెట్టుకున్నాడు. బ్యాంకు బయటకు వస్తున్న సమయంలో జేబును చూసుకున్నాడు. బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న రూ. 24వేలు (12 రెండు వేల నోట్లు) కనిపించలేదు. దీంతో వెంటనే బ్యాంకు మేనేజర్‌ను కలిసి డబ్బు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో మేనేజర్ సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించారు. అయితే సీసీ ఫుటేజీలో డబ్బు అపహరించిన వ్యక్తి స్పష్టంగా కనిపించలేదు. కాగా బాధితుడు పెద్దన్న మాట్లాడుతూ తాను డ్రా చేసినప్పుడు తన పక్కనే గుత్తికి చెందిన మాణిక్యం, మహేష్‌లతో పాటు మరో ఇద్దరు ఉన్నారన్నారు. వారే డబ్బు అపహరించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. -
జేసీబీ ఆపరేటర్ దుర్మరణం
గుత్తి రూరల్ : లారీలో జేసీబీని తీసుకెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జేసీబీ ఆపరేటర్ దుర్మరణం చెందాడు. మరొక ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రాజేష్‌గౌడ్ (23), లద్దగిరి మండలం కొండాపురానికి చెందిన గొల్ల కృష్ణలు జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వెల్దుర్తిలో పనులు ముగించుకుని రాయలచెరువుకు లారీలో జేసీబీని తీసుకెళ్తున్నారు. గుత్తి మండలం ఉబిచెర్ల వద్దకు రాగానే లారీ ముందు టైరు పంక్చర్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతల్లోకి దూసెకెళ్లింది. అలా వెళ్లే సమయంలో వెనుక ఉన్న జేసీబీ ఒక్క సారిగా లారీ క్యాబిన్‌పైన పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఇరుక్కుపోయిన రాజేష్‌గౌడ్, గొల్ల కృష్ణలను పోలీసులు, స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో రాజేష్‌గౌడ్ మృతి చెందాడు. గొల్ల కృష్ణకు ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. ఎస్ఐ చాంద్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఘర్షణలో గాయపడిన యువకుడి మృతి
గుత్తి: గుత్తిలో మొహర్రం సందర్భంగా సోమవారం రాత్రి తలెత్తిన ఘర్షణలో గాయపడిన కుమార్(25) మంగళవారం మరణించినట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. స్థానిక సీపీఐ కాలనీకి చెందిన కుమార్, రవి, మల్లికార్జున ఉప్పర వీధిలో చిందులు వేస్తుండగా వేణుగోపాల్ అనే వ్యక్తికి కుమార్ కాలు తగిలింది. దీంతో వారిద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కుమార్‌తో రవి, మల్లికార్జున జత కలసి వేణుగోపాల్‌తో గొడవకు దిగారు. దీంతో వేణుగోపాల్ తండ్రి నాగరాజు, స్నేహితుడు యుగంధర్ సైతం రంగంలోకి దిగారు. ఘర్షణ పెద్దదై పరస్పరం కొట్టుకున్నారు. అంతలోనే కొందరు మధ్యవర్తులు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కాసేపయ్యాక వారు మళ్లీ పరస్పరం దాడులకు దిగారు. కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడంతో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు మంగళవారం సాయంత్రం తరలిస్తుండగా కుమార్ మార్గమధ్యంలోనే మరణించాడన్నారు. దీంతో వేణుగోపాల్, నాగరాజు, యుగంధర్‌పై హత్య కేసు సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా కుమార్ ఏడాది కిందటే సుధారాణి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుధారాణి ప్రస్తుతం గర్భిణి. భర్త మృతి చెందడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. -
అవినీతి గోరంత ఖర్చు కొండంత
– రూ.6,487 అవినీతి తేల్చడానికి రూ.1.73 లక్షల ఖర్చు – అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు గుత్తి రూరల్ : ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిని తేల్చేందుకు చేపట్టిన సామాజిక తనిఖీలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారయ్యాయి. రూ.6.487 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బందం అధికారులు తేల్చారు. ఈ అవినీతిని తేల్చేందుకు అధికారులు చేసిన ఖర్చు చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఈ అవినీతిని తేల్చడానికి ఎకంగా రూ.1.73 లక్షలు ఖర్చు చేశారు. గుత్తి మండలంలో 2015 నవంబర్ 31 నుంచి ఈ ఏడాది జూన్ 31 వరకు రూ.4.88 కోట్ల ఉపాధి నిధులతో పనులు చేపట్టారు. ఈ నిధులు సక్రమంగా వినియోగించారా లేదా?అనే విషయంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ బందాలు తనిఖీలు చేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో రూ.6.487 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బందాలు వివరించాయి. ఈ అవినీతి అక్రమాలు గుర్తించేందుకు ఒక రాష్ట్ర రిసోర్సు పర్సన్, జిల్లా రిసోర్సు పర్సన్లు 14 మంది, ఎస్టీఎంలు 1, వీఎస్‌ఏలు 42 మంది పని చేశారు. వీరందరికి అయిన ఖర్చు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వీరికిచ్చే వేతనం, ప్రయాణ భత్యం, పనులకు సంబంధించిన రికార్డుల జిరాక్స్‌లు, తనిఖీలు నిర్వహించిన అనంతరం జిల్లా డ్వామా అధికారులకు ఇవ్వాల్సిన నివేదికల జిరాక్స్‌ల కోసం మొత్తం రూ.1.73 లక్షలు ఖర్చు చేశారు. భారీగా అవినీతి జరిగినా టీడీపీ నేతల ఒత్తిళ్లలో సామాజిక తనిఖీ బందం తూతూమంత్రంగా తనిఖీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తిరిగి తనిఖీలు సక్రమంగా జరిపించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి ఈశ్వరయ్య, జిల్లా విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్‌రావు, డీఆర్డీఏ టీఎంయూ ఈశ్వరయ్య, ఏపీడీ శైలకుమారి, ఎంపీడీఓ విజయప్రసాద్, ఏపీఓ రమేష్ పాల్గొన్నారు. -
ఈ ఆటోలు గర్భిణులకే..
గర్భిణుల కోసం ఉచిత ఆటో సర్వీస్‌లను ఐఎంఎం గుత్తి శాఖ ప్రారంభించింది. ఐఎంఎం సమకూర్చిన ఐదు ఆటోలను గుత్తిలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గహంలో ఎస్ఐ చాంద్‌బాషా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా మాట్లాడుతూ... గర్భిణులను ఆస్పత్రికి, కాన్పు తర్వాత ఇంటికి ఎంత దూరమైన తమ ఆటోలలో ఉచితంగా తీసుకెళతారని వివరించారు. -
దొంగల బీభత్సం
♦ రెండు లారీలు, ప్రైవేట్ బస్సుపై రాళ్లతో దాడి గుత్తి రూరల్ : గుత్తి శివార్లలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు లారీలు, ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. లారీ డ్రైవర్ల వద్దనున్న రూ.28 వేల నగదును దోచుకెళ్లారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హోస్‌కోటకు చెందిన అశోక్‌రెడ్డి, క్లీనర్ బాలుతో కలసి ఖాళీ సీసాల లోడుతో బెంగళూరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని గుత్తి మండలం కరిడికొండ వద్ద లారీ పక్కకు ఆపి నిద్రించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురు గుర్తు తెలియని యువకులు లారీపై ఒక్కసారిగా రాళ్లు రువ్వి డ్రైవర్ అశోక్‌రెడ్డి, క్లీనర్ రెహమాన్బాషాను భయభ్రాంతులకు గురి చేశారు. ఆ తరువాత కత్తులతో భయపెట్టి వారి వద్దనున్న రూ.8 వేల నగదు దోచుకెళ్లారు. కరిడికొండలో జితేంద్రనాయుడు తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌నూ ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తపేట వద్ద బెంగళూరు నుంచి కోకాకోలా కూల్ డ్రింక్సుకు సంబంధించిన ఫ్రీజ్‌ల లోడుతో హైదరాబాదుకు వెళ్తున్న లారీపై దాడి చేశారు. లారీ రోడ్డు పక్కకు ఒరగడంతో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లా తొరియూరుకు చెందిన డ్రైవర్ మోహన్‌రాజు, క్లీనర్ బాలుపై దాడి చేశారు. డ్రైవర్ మోహన్‌రాజు ప్రతిఘటించగా దొంగలు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో అతని తొడపై పొడిచారు. దీంతో అతను కుప్పకూలడంతో అతని వద్దనున్న రూ.20 వేల నగదు నొక్కేశారు. గాయపడ్డవారు స్థానికుల సహాయంతో గుత్తి పోలీసుస్టేçÙన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. దొంగల బైక్‌ను పట్టుకున్న లారీ డ్రైవర్, క్లీనర్ దోపిడీ అనంతరం దొంగలు పారిపోయేందుకు ఉపయోగించిన బైక్‌ను డ్రైవర్ అశోక్‌రెడ్డి, క్లీనర్ రెహమాన్బాషా పట్టుకున్నారు. వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో విషయం లారీ యజమానికి చెప్పారు. యజమాని సూచన మేరకు వారు బెంగళూరుకు బయలుదేరి వెళ్లగా పామిడి దాటిన అనంతరం దొంగలు బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్కన ఆగి చూసుకుంటున్నారు. క్లీనర్ రెహమాన్ బాషా దొంగలను గుర్తించి డ్రైవర్‌కు చెప్పడంతో వారు లారీని తిప్పుకొని వచ్చి వారిపైకి దూసుకెళ్లారు. ఇది గమనించిన దొంగలు బైక్‌ను వదిలేసి పక్కనున్న చెట్ల పొదల్లోకి పారిపోయారు. ఆ తరువాత కాసేపటికి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాగా దొంగలు రాళ్లు రువ్వారు. అయితే బస్సును ఆపకపోవడంతో అక్కడ ఎలాంటి చోరీ జరగలేదు. -
విద్యార్థి కిడ్నాప్
గుత్తి: పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..అనంతపురంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేసే అబ్రహాం కుమారుడు ఫిలిప్ విక్టర్ (7) గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్‌లో 2వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో సాయంత్రం వేళ స్థానికంగా ఉన్న ఓ పార్కుకు తండ్రితో కలిసి Ðð ళ్లాడు. అయితే విక్టర్ చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా అబ్రహాం ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 8 గంటల వేళ వచ్చి చూడగా పిల్లాడు కనిపించలేదు. అయితే బంధులెవరైనా తీసుకువెళ్లి ఉంటారని భావించిన అబ్రహాం ఇంటివద్దే చిన్నారికోసం ఎదురు చూశాడు. రాత్రి 11 గంటలైనా తన కుమారుడు ఇంటికి చేరకపోవడంతో గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
గుత్తిలో విద్యార్థి కిడ్నాప్
గుత్తి: పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..అనంతపురంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేసే అబ్రహాం కుమారుడు ఫిలిప్ విక్టర్ (7) గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్‌లో 2వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో సాయంత్రం వేళ స్థానికంగా ఉన్న ఓ పార్కుకు తండ్రితో కలిసి వెళ్లాడు. అయితే విక్టర్ చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా అబ్రహాం ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 8 గంటల వేళ వచ్చి చూడగా పిల్లాడు కనిపించలేదు. అయితే బంధులెవరైనా తీసుకువెళ్లి ఉంటారని భావించిన అబ్రహాం ఇంటివద్దే చిన్నారికోసం ఎదురు చూశాడు. రాత్రి 11 గంటలైనా తన కుమారుడు ఇంటికి చేరకపోవడంతో గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రైళ్లపై రాళ్ల వర్షం
అనంతరపురం జిల్లా: గుర్తు తెలియని దుండగులు గుత్తి రైల్వేస్టేషన్ సిగ్నల్ పాయింట్ సమీపంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లపై రాళ్లు దువ్వారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజాయున 2 గంటల సమయంలో జరిగనట్లు సమాచారం. దాదాపుగా 10 మంది దుండగులు రైళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఇది గమనించి రైల్వే ఎస్కార్ట్ పోలీసులు అప్రమత్తం కావడంతో నిందితులు పరారయ్యారు. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఎందుకు రైళ్లపై రాళ్లు విసరాల్సిన అవసరం వచ్చిందనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (గుత్తి) -
'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు'
-
'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు'
గుత్తి: వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని జగన్ విమర్శించారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేసి.. కిలో రూ.5.25కి పెంచిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. నీ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు మరిచిపోయావా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఆయన అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ గురించి చంద్రబాబు ఇప్పుడు చాలా హామీలిస్తున్నారు. తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వాటిని ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. వైఎస్ఆర్కు ముందు ఎందరో సీఎంలు వచ్చారు కాని ప్రజలకు గుర్తుండే సీఎం వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తామని జగన్ హామీయిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
చంద్రబాబు నిక్కర్లు వేసుకునేసరికే ఐటీలో మనం టాప్
చంద్రబాబు నాయుడు నిక్కర్లు వేసుకునే సమయంలోనే ఐటీ రంగంలో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉండేదని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని తానే తీసుకొచ్చానన్నట్లు చెబుతున్న చంద్రబాబు తీరును ఆమె ఎండగట్టారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన వైఎస్ జనపథం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాబు హయాంలో పెన్షన్‌దారుడు ఒకరు చనిపోతేనే మరొకరి పెన్షన్ వచ్చేదని, అలాంటిది ఇప్పుడు మాత్రం ఆయన ఎన్నికల వేళ రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. 9 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయని చంద్రబాబు ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటున్నారని మండిపడ్డారు. రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే తన హయాంలో రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. వెన్నుపోటుకు మారుపేరైన చంద్రబాబుకు వైఎస్ఆర్ను విమర్శించే అర్హత లేదని, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని, కేసులను ఎదుర్కొనే దమ్ములేక స్టే తెచ్చుకున్నారని ఆమె అన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలపై 32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని వేశారని, ఆయనే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి ఉంటే విభజన జరిగేది కాదని వైఎస్ విజయమ్మ అన్నారు. భర్తను పోగొట్టుకున్న బాధ ఓ వైపు, ప్రజలు కష్టాల సుడిగుండంలో ఉన్నారన్న వేదన మరోవైపు తనను తీవ్రంగా కలచివేశాయని వైఎస్ విజయమ్మ చెప్పారు. అప్పట్లో వైఎస్ఆర్ చూపించిన పట్టుదల అంతా ఇప్పుడు వైఎస్ జగన్‌లో కనిపిస్తోందని ఆమె అన్నారు. సమైక్యాంధ్ర అనలేని పరికిపంద చంద్రబాబు అని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ద్వంద్వనీతే విభజనకు కారణమని, నయవంచకుడైన చంద్రబాబును నమ్మితే మరోసారి ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. వైఎస్ జగన్ వల్లే వైఎస్ఆర్ ఆశయాల సాధన సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. -
గుత్తిలో రూ. 6 లక్షల బంగారు, వెండి నగలు దోపిడీ
అనంతపురం జిల్లా గుత్తి పట్టణలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చంద్రప్రియనగర్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి శ్రీధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. దుండగులు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. వీటి విలువ దాదాపు ఆరు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ మృతి
అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. సాయినాథ్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999 నుంచి 2004 వరకూ సాయినాథ్ గుత్తి ఎమ్మెల్యేగా పని చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నాయకుడ్ని కోల్పోవడంతో పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.జిల్లాలో సౌమ్యుడిగా పేరున్న సాయినాథ్ బౌతికంగా దూరం అవడం టీడీపీకీ నిజంగానే తీరని లోటు.