గుత్తి : పట్టణంలోని జెండా వీధికి చెందిన ఎస్.రసూల్ బీ(51) వడదెబ్బతో మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రసూల్ బీ రెండు రోజులుగా పని నిమిత్తం ఎండలో బాగా తిరిగారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో కళ్లు తిరిగి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. ఆమెకు భర్త అబ్దుల్ జబ్బార్, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.