గుర్తు తెలియని దుండగులు గుత్తి రైల్వేస్టేషన్ సిగ్నల్ పాయింట్ సమీపంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లపై రాళ్లు దువ్వారు.
అనంతరపురం జిల్లా: గుర్తు తెలియని దుండగులు గుత్తి రైల్వేస్టేషన్ సిగ్నల్ పాయింట్ సమీపంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లపై రాళ్లు దువ్వారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజాయున 2 గంటల సమయంలో జరిగనట్లు సమాచారం. దాదాపుగా 10 మంది దుండగులు రైళ్లపై రాళ్ల వర్షం కురిపించారు.
ఇది గమనించి రైల్వే ఎస్కార్ట్ పోలీసులు అప్రమత్తం కావడంతో నిందితులు పరారయ్యారు. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఎందుకు రైళ్లపై రాళ్లు విసరాల్సిన అవసరం వచ్చిందనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(గుత్తి)