throw stones
-
TN: కార్యకర్తలపైకి రాయి విసిరిన మంత్రి
వైరల్: తమిళనాడు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఎస్ఎం నాజర్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆయన రాయి విసిరిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తిరువల్లూరు జిల్లాలో బుధవారం జరగబోయే ఓ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరు కావాల్సి ఉంది. ఆ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి నాజర్ వెళ్లారు. అయితే.. ఆ సమయంలో ఆయనకు కూర్చోవడానికి కుర్చీ లేదట. వెంటనే ఆయన కార్యకర్తలపై కుర్చీ తేవాలని కేకలు వేశారు. అయితే.. అది తేవడం కాస్త ఆలస్యం కావడంతో సహనం కోల్పోయిన ఆయన అలా రాయి విసిరారు. మంత్రి నాజర్ రాయి విసిరి.. కార్యకర్తలను దూషిస్తున్న టైంలో వెనుకాల ఉన్న వాళ్లంతా నవ్వడం ఆ వీడియోలో చూడొచ్చు. #WATCH | Tamil Nadu Minister SM Nasar throws a stone at party workers in Tiruvallur for delaying in bringing chairs for him to sit pic.twitter.com/Q3f52Zjp7F — ANI (@ANI) January 24, 2023 ఇదిలా ఉంటే.. ఈ డీఎంకే మంత్రి స్వతహాగానే ఇలా తరచూ తన కోపాన్ని ప్రదర్శిస్తుంటారట. కార్యకర్తపై రాయి విసిరిన ఆయన తీరుపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహుశా దేశ చరిత్రలో ఇలా ఏ మంత్రి కూడా జనాల మీదకు రాళ్లు విసిరి ఉండకపోవచ్చు అంటూ ట్వీట్ చేశారాయన. డీఎంకేవాళ్లు ఎదుటివాళ్లను బానిసలుగా చూస్తారనడానికి ఇదే నిదర్శనం కాబోలు అంటూ ట్వీట్ చేశారాయన. ఇంకోవైపు ఈ కోపధారి మంత్రిపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మంత్రిగారి కంటే రౌడీలే నయం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. In India’s history, has anybody seen a govt minister throwing stones at people? Display of this by a @arivalayam party DMK Govt Minister, Thiru @Avadi_Nasar. Throwing stones at people in frustration No decency, No decorum & treating people like slaves! That's DMK for you. pic.twitter.com/D2iAKV4YZ4 — K.Annamalai (@annamalai_k) January 24, 2023 -
రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం
సాక్షి,ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలతో రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడిచేశారు. అలాగే నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బీజేపీ-శివసేన కార్యకర్తల వార్ మరింత ముదురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి నారాయణ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శివసేన కార్యకర్తలు దూకుడుమీద ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు , ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం పూణేలోని ఆర్ డెక్కన్ మాల్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. యువ నేత వరుణ్ దేశాయ్ నాయకత్వంలో, కొంతమంది శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముంబైలోని జుహులోని రాణే బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో, రాణే మద్దతుదారులు ప్రతిఘటించడంతో జుహు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, చిప్లూన్, సాంగ్లీ, ఔరంగాబాద్ లలో శివ సైనికులు రెచ్చిపోయారు. వీరి ఆందోళనలు, ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తత రాజేశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని మరచిపోయారని, అదే తానైతే ఆయనను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినంటూ కేంద్రమంత్రి రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో నాసిక్ పోలీసులు రాణేను అరెస్టు చేయడం, చివరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
భగ్గుమన్న బడుగుజీవులు
భోపాల్: వలసజీవులు మరోసారి భగ్గుమన్నారు. తమ పట్ల పాలకులు చూపుతున్న అలసత్వానికి నిరసగా ఆందోళన బాటపట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమకు తిండి, రవాణా సౌకర్యాలు కల్పించలేదన్న ఆవేదనతో మధ్యప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దులోని సెంద్వా పట్టణంలో గురువారం వేలాది మంది వలస కార్మికులు నిరసనకు దిగారు. దీంతో మూడవ నంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సహనం కోల్పోయిన బడుగుజీవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. ‘పసిపిల్లలను చంకనేసుకుని మేమంతా ప్రయాణిస్తున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయం చేయలేదు. మేము గత రాత్రి నుంచి ఆకలి, దాహంతో ఇక్కడ ఉన్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేద’ని పుణెలో పనిచేసే మధ్యప్రదేశ్ నివాసి సైలేష్ త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు) జిల్లా కలెక్టర్ అమిత్ తోమర్ మాట్లాడుతూ.. బస్సులు బయలుదేరిన తర్వాత మిగిలిన వారు తమకు వాహనాలు ఉండవని ఆందోళన చెందారని తెలిపారు. అందరిని వారి స్వస్థలాలకు పంపిస్తామని భరోసాయిచ్చి వారిని శాంతింపజేసినట్టు చెప్పారు. సరిహద్దు నుంచి 135 బస్సుల్లో వలసదారులను వివిధ జిల్లాల్లోని ట్రాన్సిట్ పాయింట్లకు పంపించామన్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) సంయమనం పాటించాలని కార్మికులకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు, భోజనం తర్వాత బస్సుల ద్వారా ఉచితంగా తరలిస్తామని వారికి భరోసాయిచ్చారు. సెంధ్వా సరిహద్దులోని బీజాసన్ ఘాట్‌కు ప్రతిరోజూ 5,000 నుండి 6,000 మంది కార్మికులు చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ నుంచి కార్మికుల నుంచి తరలించడం అధికారులకు ప్రయాసగా మారుతోంది. -
రైళ్లపై రాళ్ల వర్షం
అనంతరపురం జిల్లా: గుర్తు తెలియని దుండగులు గుత్తి రైల్వేస్టేషన్ సిగ్నల్ పాయింట్ సమీపంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లపై రాళ్లు దువ్వారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజాయున 2 గంటల సమయంలో జరిగనట్లు సమాచారం. దాదాపుగా 10 మంది దుండగులు రైళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఇది గమనించి రైల్వే ఎస్కార్ట్ పోలీసులు అప్రమత్తం కావడంతో నిందితులు పరారయ్యారు. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఎందుకు రైళ్లపై రాళ్లు విసరాల్సిన అవసరం వచ్చిందనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (గుత్తి) -
వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి కారుపై రాళ్ల దాడి
విజయవాడ: అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తమదే అనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు.. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని పెనమలూరులో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ నేత బోడె ప్రసాద్ వర్గీయులు వైఎస్ఆర్ సీపీ బ్యానర్లను తగులబెట్టారు. ఈ ఘటనపై ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పెనమలూరులో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.