
గుత్తిలో యువకుడి మృతదేహం
గుత్తి : గుత్తి మన్రో సత్రం సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం కనుగొన్నారు. మృతుడు వడదెబ్బకు గురై మృతి చెందాడా? లేక అతిగా మద్యం తాగి చనిపోయాడా అనే విషయం తెలియడం లేదు. ఒంటిపైనా ఎలాంటి గాయాలు లేవు. మృతదేహాన్ని అందరూ చూస్తూ వెళ్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోలేదు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేకపోయారు.